తీవ్ర ప్రమాదంలో ఇండియా.. ఏం జరగబోతుంది?

324

ప్రపంచవ్యాప్తంగా మానవమాత్రులు గుర్తించలేకపోయిన ఓ విషయాన్ని యంత్రాలు పసిగట్టాయి. భూకంపాలను పరిశీలించడంపై ఆసక్తిగల ఔత్సాహికుడు ప్రపంచాన్ని ఏకకాలంలో చుట్టేసిన ప్రకంపనల గురించి వెల్లడించారు. ఇది చాలా అసాధారణమైన భూకంప సంకేతమని తెలిపారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కనిపించిందని పేర్కొన్నారు.

Image result for himalayas earthquake in indiaఎంఏటీఏ ఆర్ఐకే ఐపీఎఎక్స్ హ్యాండిల్‌ యూజర్ భూకంపాలను ఆసక్తిగా పరిశీలిస్తారు. ఈ యూజర్ మాత్రమే అమెరికా జియొలాజికల్ సర్వేకి చెందిన రియల్ టైమ్ సీస్మోగ్రామ్ డిస్‌ప్లేలో ఈ సంకేతాలను మొదట గుర్తించారు. ఈ ఔత్సాహికుడి పోస్ట్ భూకంపాలను పరిశీలించే శాస్త్రవేత్తలకు చర్చనీయాంశమైంది. ఈ కంపనలకు కారణాలేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image result for himalayas earthquake in indiaశాస్త్రవేత్తలకే అంతు చిక్కని ప్రకంపనలు నవంబరు 11న ఉదయం 9.30 గంటలకు ప్రపంచాన్ని చుట్టేశాయి. 20 నిమిషాలపాటు ఈ ప్రకంపనలుకొనసాగాయి. హిందూ మహా సముద్రంలోని మయోటీ ద్వీప తీరం నుంచి 15 మైళ్ళ దూరంలో ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. మడగాస్కర్, ఆఫ్రికా మధ్య ఈ ద్వీపం ఉంది.

Image result for himalayas earthquake in indiaమయోటీ ద్వీపం నుంచి ప్రారంభమైన ఈ ప్రకంపనలు యావత్తు ఆఫ్రికాలోనూ, జాంబియా, కెన్యా, ఇథియోపియా, అట్లాంటిక్‌ను దాటి చిలీ, న్యూజిలాండ్, కెనడా, హవాయిలలో కనిపించాయి. భూకంపాల అనంతరం వచ్చినట్లుగానే ఈ కంపనలు కూడా భూకంప లేఖినిపై కనిపించాయి. అయితే ఈ నెల 11న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మయోటీలో కానీ, ఇతర చోట్ల కానీ భూకంపం సంభవించలేదు. అయినా భూకంప లేఖినిపై ఈ సంకేతాలు నమోదయ్యాయి. దీనికి కారణాలేమిటనే అంశంపై శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఉల్కా పాతం సంభవించిందా? భూగర్భ జలాల్లో ఏదైనా భూతం ఏదైనా ఉందా? అణు పరీక్ష జరిగిందా? అనే అనుమానాలతో ఒక్కొక్కరూ ఒక్కొక్క వాదనను లేవనెత్తుతున్నారు.హిందూ మహాసముద్రంలో చోటుచేసుకోబోయే భారీ అగ్నిపర్వత పేలుళ్లకు ఇది కారణం కావొచ్చని అనుకుంటున్నారు. లావా వల్ల మేయోట్‌ ద్వీపసమూహం ఇప్పటికే 2.4 అంగుళాలు పక్కకు జరిగిందని అంటున్నారు. ఇక ఇండియాకు కూడా ఈ ప్ర‌మాదం ఉంది అని స‌ముద్ర అల‌ల తాకిడి పెరిగే అవ‌కాశం ఉంది అని అంటున్నారు అలాగే నార్త్ స్టేట్స్ లో కొన్ని చోట్ల భారీ భూకంపం రావ‌చ్చు అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మ‌రి కాస్త ఈ విష‌యం పై జాగ్ర‌త్త‌గా ఉండండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.