కేరళ వరదలకు క్రికెటర్ శ్రీశాంత్ కు ఎంత నష్టం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు

530

కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు అపార‌న‌ష్టాన్ని మిగిల్చాయి.. 20 వేల కోట్ల రూపాయల ఆస్తి న‌ష్టాన్నివ‌ర‌ద‌లు కేర‌ళ‌కు మిగిల్చాయి అనే చెప్పాలి…వాగులు వంక‌లు న‌దులు పొంగిపొర్లి కేర‌ళ‌ను రెండు వారాల పాటు నీటిలో ముంచెత్తాయి… సుమారు 500 మందికి పైగా త‌మ విలువైన ప్రాణాల‌ను కోల్పోయారు.. ఈ దారుణ‌మైన సంఘ‌ట‌న కేర‌ళ ప్రాంత వాసుల‌ని ఇప్పుడు అప్పుడే కొలుకునేలా క‌నిపించ‌డం లేదు.. ఇక్క‌డ అంతా మాములు ప్రాంతంగా మారాలి అంటే మ‌రో మూడు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది అని అంటున్నారు. ఇక కేర‌ళ‌లో చాలా మంది ధ‌న‌వంతులు ఎంతో ఇష్టంగా క‌ట్టుకున్న‌ఫామ్ హౌస్ లు చాలా వ‌ర‌కూ వ‌ర‌దల్లో కొట్టుకుపోయాయి…. మ‌మ్ముట్టి – మోహ‌న్ లాల్ ఫామ్ హౌస్ లు అలాగే కేర‌ళ‌లో ప్ర‌ముఖ జ్యూవెల‌రీ మార్ట‌గేజ్ సంస్ద‌లకు చెందిన రెండు ఫామ్ హౌస్ లు ఇప్ప‌టికీ నీటిలోనే ఉన్నాయి.

తాజాగా ఓ స్టార్ కిక్రెటర్ కు సంబంధించిన క్రీడాకారుడు ఫామ్ హౌస్ మొత్తం వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయింది అని తెలుస్తోంది… జార్జ్ కంపెనీకి చెందిన ఫామ్ హౌస్ ప‌క్క‌న శ్రీశాంత్ ఫామ్ హౌస్ ఉంద‌ని తెలుస్తోంది…ఇది కొండ‌చ‌రియ‌ల‌కు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని స‌మాచారం… తాజాగా వ‌చ్చిన వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌కు ఈ ఫామ్ హౌస్ రూపులేకుండా పోయింది అట‌.. శ్రీశాంత్ ఎంతో ఇష్టంతో క‌ట్టుకున్న ఈ ఫామ్ హౌస్ నేల‌మ‌ట్టం అయింద‌ని తెలుస్తోంది. కోధ‌మంగ‌ళం ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ ఉంద‌ని, అయితే ఇది తన సొంత ఊరు కావ‌డంతో ఇక్క‌డ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు శ్రీశాంత్. గ‌తంలో శ్రీశాంత్ ఇక్క‌డ ఫామ్ హౌస్ నిర్మించుకుందామ‌ని అనుకున్నా స్ద‌లం దొర‌క‌లేద‌ని, త‌ర్వాత శ్రీశాంత్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడ‌ని అత‌న్ని స‌న్నిహితులు చెబుతున్నారు.

ఎనిమిది సంవ‌త్స‌రాల క్రితం నిర్మించిన ఈ ఫామ్ హౌస్ కొండ‌చ‌రియ‌ల‌కు ద‌గ్గ‌ర్లో ఉండ‌టంతో ప్ర‌కృతి విల‌య‌తాండ‌వానికి నాశ‌నం అయింది అని అంటున్నారు.ఒక‌ప్పుడు భార‌త జ‌ట్టుకు కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఆది నుంచీ దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు. మైదానంలో ఏమాత్రం ఆవేశం ఆపుకోలేని తత్వంతో వివాదాస్పదంగా మారాడు. కేరళ తరఫున రంజీల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన శ్రీ అనవసరంగా ఉద్రేకపడే స్వభావంతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు. ఇక ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో ఇరుక్కుని డిల్లీపోలీసుల విచార‌ణ‌లో దోషి అయ్యి జీవిత కాలం క్రికెట్ కు దూరం అయ్యాడు… ఇటు కెరియర్ తో పాటు ఇప్పుడు త‌న‌కుఎంతో ఇష్ట‌మైన ఇళ్లు ఫామ్ హౌస్ వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని త‌న‌కు కాకుండా పోయిందని ఎంతో బాధ‌ఫ‌డుతున్నాడు. మ‌రోప‌క్క సినిమా షూటింగుల‌కు ఇచ్చే ఏడు ఫామ్ హౌస్ లు, పెద్ద పెద్ద బండ‌రాళ్లు ప‌డ‌టంతో కుప్ప‌కూలిపోయాయ‌ని, ఇవి ప్ర‌ముఖ ఫైవ్ స్టార్ హూట‌ల్ కుమారుడివి అని తెలుస్తోంది…. మొత్తానికి కేర‌ళ‌లో వ‌చ్చిన విల‌య తాండ‌వం వందేళ్ల‌ల్లో క‌నీవినీ ఎరుగ‌ని ప్ర‌ళ‌యం అనే చెప్పాలి..