చిన్నవయసులోనే అమ్మాయిలు రజస్వల అయితే ఏమవుతుంది

300

సాధికి ఇంట్లో ఫుడ్‌ అస్సలు ఇష్టం ఉండదు. స్కూలుకు వెళ్తున్నప్పుడు, వస్తున్నపుడు ఫాస్ట్‌పుడ్‌లో కేకులు, బర్గర్లు, పిజ్జాలు తింటుంది. రాత్రి ఇంటికి వచ్చాక ఇంకేమీ తినకుండానే పడుకుంటుంది. తల్లి ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఆమె అలవాటు మానుకోలేదు. దీంతో సాధి 10 సంవత్సరాలకే మెచ్యూర్‌ అయ్యింది. తల్లి కంగారుకు అంతులేదు. ఇలా ఎందుకు జరిగిందని గైనిక్‌ డాక్టర్‌ను కలిస్తే, కారణం ఆమె ఫాస్ట్‌పుడ్‌ అలవాటేనని చెప్పింది. నిజమే ఫాస్ట్‌పుడ్‌, కాలుష్యం, అధిక ఒత్తిడి ఇవన్నీ ఆడపిల్లల్లో తీవ్రప్రభావాలు చూపుతున్నాయి.

Tamil Painting - Dravidian Beauty by Vishalandra Dakur

ఈరోజుల్లో అమ్మాయిలు త్వరగా మెచ్యూర్‌ అవ్ఞతున్నారు. త్వరగానే మెనోపాజ్‌కి చేరుకుంటున్నారు. పదమూడేళ్లకు అటుఇటుగా ఉండే ఈ వయసు ఇప్పుడు మరింత తగ్గిపోయింది. కొంతమంది మరీ చిన్నతనంలోనే అంటే తొమ్మిది, పదేళ్లకు కూడా రజస్వల అవుతున్నారు. ఇలాంటి పిల్లలు, వీరి తల్లిదండ్రులు కొన్నాళ్లపాటు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవటం మామూలే. ఈ పిల్లల విషయంలో తల్లిదండ్రులు గుర్తుంచుకుని పాటించాల్సిన కొన్ని సూచనలు-
రజస్వల అయిన సమయంలో, ఆ తరువాత పీరియడ్స్‌లోనూ నొప్పి, అధికరక్తస్రావం వంటి సమస్యలు ఉంటే ఈ పిల్లల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లలకు ఏమాత్రం అలాంటి విషయాల పట్ల అవగాహనలేని వయసులో మెచ్యూర్‌ కావటం వారిలో అయోమయం, కంగారు, భయాలకు గురిచేస్తుంది. అంతేకాదు ఒకలాంటి ఒంటరితనం దిగులు వారిని ఆవరించే ప్రమాదమూ ఉంది. మరీ తొమ్మిది, పదేళ్ల వయసులోనే మెచ్యూర్‌ అయిన పిల్లలకు ఈ మార్పులు తట్టుకునే శక్తి ఉండదు. నిన్నటివరకు ఎగురుకుంటూ వెళ్లి నాన్న ఒళ్లో కూర్చున్న చిట్టితల్లి ఒక్కసారిగా పెద్దదానిలా ప్రవర్తించాలంటే కుదరదు కదా. తల్లిదండ్రులు చదువుకున్నవారయి, ఈ తరుణంలో పాటించే పాత సిద్ధాంతాల పట్ల నమ్మకంలేని ఇళ్లలో అయితే పరవాలేదు.

ఈ క్రింది వీడియో ని చూడండి

కానీ గ్రామీణ వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు అయితే తప్పకుండా ఈ మార్పుని త్వరగా జీర్ణం చేసుకోవాల్సిందే. అమ్మమ్మ, నాన్నమ్మల మధ్య పెరుగుతున్న పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుతూపాడుతూ తిరగకుండా కట్టడి చేయటం మరింత ఎక్కువగా ఉంటుంది.ఒక సహజ శారీరక పరిణామక్రమమైన ఈ పెరుగుదల అంతే సహజంగా ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించాలంటే ఆమెకు ఈ విషయాల పట్ల ఆరోగ్యకరమైన, శాస్త్రీయపరమైన అవగాహనని కల్పించడం అత్యవసరం. పాఠశాలల్లో లైంగిక విద్యాబోధన గురించి ఇంకా తర్జన భర్జనలు, మంచిదా, కాదా అనే భిన్నాభిప్రాయాలు మనచుట్టూ ఉన్నాయి. అయితే ఈ విషయంమీద అమ్మాయిలకు సరైన అవగాహనను కల్పించాల్సిన మొదటి బాధ్యత తల్లిమీద ఉంటుంది.

Related image

తల్లికి ఈ విషయం పట్ల ఉన్న దృక్పథమే ఆమె పిల్లల్లోనూ పెరుగుతుంది. మనలో చాలా వరకు దీనిని యవ్వనానికి సూచనగా తీసుకుంటారు కానీ వయసురీత్యా జరిగే శారీరక ప్రక్రియల్లో భాగంగా తీసుకోరు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సమయంలో ఇంట్లోకి రాకుండా దూరంగా ఉండేవారు ఉన్నారు. దీనిని అసహజంగా తీసుకుంటూ ఆ మూడురోజుల్ని చాలా ఇబ్బందికరంగా ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనే భావంతో ఎదుర్కొనేవారూ ఉన్నారు. శారీరక ఇబ్బందుల రీత్యా అయితే ఫరవాలేదు, మానసికంగా ఈ పరిస్థితిని ఇబ్బందిగా భావించడం మాత్రం మంచి ఎదుగుదలగా చెప్పలేము.

Related image

శరీరాన్ని, దాని సహజ ధర్మాలను అర్థం చేసుకోవటం, వాటికి విలువ నివ్వటం, గౌరవించడం ఇవన్నీ ఆడపిల్ల ఆత్మగౌరవంలో భాగాలే అవుతాయి. అపుడే వాళ్లకు తమని తాము గౌరవించుకోవటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం- ఇవన్నీ అలవాటు అవుతాయి. ఈ కాలంలో చాలా త్వరగా ఆడపిల్లలు రజస్వల అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని తల్లులు గుర్తుంచుకోవాలి. అందుకు అనుగుణంగా వారు పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలి.

Related image

చాలామంది ఆడపిల్లలు శరీరంలో చోటుచేసుకునే మార్పులు, హర్మోన్ల ప్రభావం కారణంగా చిన్నవయసులోనే రజస్వల అవుతుంటారు. ఇది మంచిదే అయినప్పటికీ.. పెళ్ళయిన తర్వాత జెస్టినేషనల్ డయాబెటీస్ అంటే గర్భందాల్చే సమయంలో చక్కెరవ్యాధిబారినపడే అవకాశం ఉదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలికాలంలో ఈ తరహా మధుమేహ రోగగ్రస్థుల సంఖ్య పెరుగుతోందని, ఈ వ్యాధి వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకురాలు డేనియెల్లి స్కోయెనేకర్ వెల్లడించారు.

Related image

ఈపరిశోధన కోసం సుమారు నాలుగున్నర వేల మంది మహిళలను ఎంపిక చేసి ప్రశ్నించారు. వీరిలో అనేక మంది 11 యేళ్ళ వయసులో రజస్వల అయ్యామని, వివాహం తర్వాత మధుమేహం బారినపడినట్టు వెల్లడించారని పరిశోధకురాలు వెల్లడించారు.చిన్న వయసులోనే రజస్వల అయ్యే బాలికలకు మైగ్రేన్‌(తలనొప్పి) వచ్చే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. కౌమార దశ బాలికల్లో రుతుక్రమం సమయంలో తరుచూ మైగ్రేన్‌ వస్తుందని గత అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కానీ.. యుక్త వయసు ప్రారంభ దశలోనే రజస్వల అయ్యే అమ్మాయిలకు ఈ ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పాఠశాల వయసులోనే 10 శాతం మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అమెరికన్‌ హెడేక్‌ సొసైటీ పేర్కొంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..