కేరళ వరదలు తగ్గాక డాబా మీద జరిగిన ఈ విషయం 99% మందికి తెలియదు.

557

కేరళలో వరదలు పూర్తీగా తగ్గిపోయాయి.ప్రజలు సహాయక కేంద్రాల నుంచి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.చాలా మంది ఇల్లులు కూలిపోయి నడిరోడు మీద నిలబడ్డారు.ప్రభుత్వం వారికి సహాయం చేస్తుందని హామీ ఇచ్చింది.అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే కేరళలో వరదలు తగ్గిన తర్వాత ఒక విషయం జరిగింది.ఆ ఘటన గురించి మనలో ఎవరికీ తెలియదు.కానీ ఆ విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో దేశం మొత్తం తెలిసిపోయింది.కానీ మనలో ఇంకా చాలా మందికి తెలియదు.అందుకే ఇప్పుడు నేను మీకు ఆ విషయం చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for kerala flood

మీకు గుర్తుందో లేదో కేరళ వరదలలో ఒక న్యూస్ చూశాం.నిండు గర్బీని డెలివరికి రెండు రోజుల సమయమే ఉంది. హాస్పిటల్ కు వెళ్ళాలని నిర్ణయించుకుంది.నేను తల్లిని కాబోతున్నాను అనే సంతోషంలో ఉంది ఆ తల్లి.వరదలు వచ్చినా వారు భయపడలేదు.ఎందుకంటే వారు ఉండే ఇల్లు మూడంతస్తుల భవనం.వరద నీరు రాదనుకున్నారు.కానీ అంతపెద్ద వానలకు ఎత్తైన బిల్డింగ్స్ కూలిపోయాయి.నీటితో సముద్రాన్ని తలపించాయి.బయటపడడం కష్టం అని ఆమెకు అప్పుడు తెలిసింది.కేరళ వరదలు ఆ తల్లి ఆశలను కాసేపు కకావికలం చేశాయి.దీంతో ఇంట్లోని మగవాళ్ళు ఎలాగోలా బయటకు వచ్చేశారు.తమ వారు ఇంట్లో చిక్కుకుపోయారని ఎమర్జెన్సి నెంబర్ కు కాల్ చేశారు.మా ఇంట్లో నిండు గర్బీని ఉంది అని చెప్పారు.

Image result for kerala flood

పైగా ఆమెకు ఉమ్మ నీరు లీక్ అవుతుంది అని చెప్పారు.చుట్టూ వరద నీరు కావడంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్ళే అవకాశం కూడా లేదు.ఎందుకంటే హాస్పిటల్స్ కూడా నీళ్ళలో మునిగిపోయాయి.కాసేపట్లో డెలివరి చుట్టూ నీళ్ళు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉండగా నేవీ సిబ్బంది స్పందించారు.హెలికాప్టర్ లో లిఫ్ట్ చేస్తాం అంటే అధికారులు వద్దు అన్నారు.ఉమ్మ నీరు ఎక్కువగా పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.కానీ అప్పుడే ఒక హీరో వచ్చాడు.అతను నేవీ అధికారి.పేరు విజయ్ కుమార్.ఆమెకోసం సెపరేట్ గా ఒక బెల్ట్ ను తీసుకున్నాడు.రెండు వరసలలో ఉండే ఆ బెల్ట్ భుజం కింది బాగంలో కట్టి లిఫ్ట్ చెయ్యాలని చెప్పాడు.నడుం కింది బాగంలో కడితే కడుపుకు వత్తుకుంటుంది.నొప్పితో పాటు ఇబ్బంది కూడా కలుగుతుందని సూచించాడు.

Image result for kerala flood

హెలికాప్టర్ ను తీసుకుని ఆ ఇంటి రూఫ్ మీదకు చేరుకున్నాడు.తాను చాపర్ ను కదలకుండా ఉంచుతాను.వీలైనంత కిందికి తీసుకొస్తాను అని చెప్పాడు.అలాగే సాద్యమైనంత కిందికి తీసుకెళ్ళాడు.ఇంకా కిందికి వెళ్ళే చాన్స్ లేదు.ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి.ఇంకా కిందికి అంటే సమస్య వస్తుందని చెప్పాడు.చాపర్ ను ఇంచు కూడా కదలకుండా ఎలా చెయ్యాలో విజయ్ వర్మకు బాగా తెలుసు.ఆమె భయపడుతున్నా సరే హెలికాప్టర్ నుంచే దైర్యం చెప్ప్పాడు.ఆమె కోసం చాపర్ ను కదలకుండా దగ్గర దగ్గర 30 నిమిషాలు ఉంచాడు.రూఫ్ మీద అలాగే కూర్చోమని చెప్పి ఆమె బిపి పెరగకుండా దైర్యం చెప్పాడు.మీరేం భయపడకండి మీ ప్రాణానికి మీ పాప ప్రాణానికి నాది పూచీ అని చెప్పాడు.

Image result for kerala flood

ఇక విజయ్ వర్మ ఫ్రెండ్ ను కిందికి పంపించి ఆమెకు బెల్ట్ లు కట్టించాడు.అంతే 15 సెకండ్స్ లలో ఆమెను చాపర్ లోకి లాగేశారు.అయితే ఇక్కడే విజయ్ వర్మ తెలివి ఏమిటో అందరికి అర్థం అయ్యింది.ఆ మహిళను పైకి లాగే ముందు ఇద్దరు మహిళలను పైకి లాగాడు.ఎందుకంటే ముందే ఆమెను పైకి లాగితే ఖచ్చితంగా ఆమె భయపడుతుంది.ఏదో జరిగిపోతుందని అనుకుంటుంది.దీంతో ఆమెకు ఆమె బిడ్డకు ప్రమాదం.అందుకే ముందు ఇద్దరు మహిళలను పైకి లాగాడు.ఇది చూసి ఆ మహిళా ఇంతేనా అని భయపడకుండా ఉంటుందని విజయ్ ఊహించాడు.ఇక ఆమె ఎక్కినా తర్వాత క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా సహాయక కేంద్రానికి తీసుకెళ్ళాడు.అక్కడ డాక్టర్స్ ను రెడీగా ఉంచి అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు అంబులెన్స్ లలో తీసుకెళ్ళారు.ఇక హాస్పిటల్ కు వెళ్ళిన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఈ విషయం దేశం మొత్తం పాకిపోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

విజయ్ వర్మ హీరో అయిపోయాడు.ఇప్పుడు వర్షాలు తగ్గిపోవడంతో ఆమె తన ఇంటికి చేరుకుంది.అయితే ఇంటికి వెళ్ళిన ఆమె విజయ్ వర్మకు నేవీ అధికారులకు థాంక్స్ చెబుతూ ఇంటి డాబా మీద థాంక్స్ అంటూ పెద్ద అక్షరాలతో తనే రాసింది.వైట్ పెయింట్ తో తన బిడ్డను ఎత్తుకుని థాంక్స్ అని రాసింది.ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీరికి ఇప్పుడు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుంది.ఇక ఇంకొక గర్వించాల్సిన విషయం ఏమిటి అంటే ఆ పుట్టిన బిడ్డకు విజయ్ వర్మ అనే పేరు పెట్టారు.దీంతో కామాండర్ విజయ్ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది.వింటుంటే మనకు కూడా సెల్యూట్ కొత్తలనిపిస్తుంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆ విజయ్ వర్మ గురించి అలాగే అతను సాహసం చేసి ఆ తల్లి బిడ్డలను కాపాడిన విధానం గురించి అతను చేసిన సాయం మర్చిపోకుండా పుట్టిన బిడ్డకు అతని పేరు పెట్టిన ఆ తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.