హెచ్చరిక: చంద్ర గ్రహణం ఎఫెక్ట్ పడకుండా గర్బీణీలు ఏం చెయ్యాలో చూడండి

320

మరొక చంద్రగ్రహణం మనల్ని కనువిందు చెయ్యడానికి వచ్చింది. ఈ గ్రహణం పేరు ‘సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్’. ఈ పేరుకు తగినట్లే.. ఒకే గ్రహణం మూడు రకాలుగా కనిపిస్తుంది. వివిధ దేశాల కాలమానాల ప్రకారం జనవరి 20, 21 తేదీల్లో ఏర్పడుతుంది. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్, వోల్ఫ్ మూన్‌లు ఒకేసారి ఏర్పడనున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనికి ‘సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్’ అని పేరు పెట్టారు. భారత కాలమానం ప్రకారం పుష్య మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి తిధి రోజున జనవరి 21 సోమవారం ఉదయం 10.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడుతుంది. 62 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణం మొదలై పూర్తికావడానికి సుమారు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది.ప్రపంచం అంతా ఈ గ్రహణాన్ని వీక్షించాలని ఎదురు చూస్తున్నారు.గ్రహగణాలు, వాటి స్థితిగతులను బాగా నమ్మే దేశం మనది.

 

మనుషుల జీవితాలకు, గ్రహాల కదలికలకు సంబంధం వుందని అవే జీవితాల్ని శాసిస్తాయని చెబుతారు. అలాంటి దేశంలో గ్రహణాలపై శ్రద్ధ కాస్త ఎక్కువే.అందుకే రకరకాల నమ్మకాలను పాటిస్తారు. చాలా జాగ్రత్తలు పాటించాలని అంటుంటారు. ఈ గ్రహణ సమయంలోకొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు అంట. గ్రహణం ఉండే సమయంలో పెళ్లి చూపులు, గృహ ప్రవేశాలు,ఉప నయనం,నూతన విగ్రహ ప్రతిష్ట ,నూతన వధువు ప్రవేశం, కొత్త వాహనం కొనుగోలు చెయ్యడం, బావులు బోర్లు లాంటివి తవ్వించడం ,పుట్టు వెంట్రుకలు తీయడం,చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయానికి అరగంట ముందు వరకు కూడా తినవచ్చు,ద్రవ పదార్ధాలు త్రాగవచ్చు.అయితే గ్రహణ సమయంలో చలనం లేకుండా పడుకోవటం మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ప్రశాంతంగా పడుకోవటం కానీ దైవ నామ స్మరణ చేయటం కానీ చేస్తే గర్భిణీ స్త్రీలకు మరియు కడుపులో పెరుగుతున్న శిశువుకు చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు అనవసరంగా తిరగకూడదు, అనవసరంగా ఆహార పదార్ధలను తినకూడదు,అనవసరంగా పనికిరాని విషయాలను మాట్లాడకూడదు.అలా చేస్తే విపరీతమైన చర్యలు,బుద్ది కలిగిన వారు పుట్టే అవకాశం ఉంది. అందువల్ల గ్రహణ సమయంలో తిరగకుండా ప్రశాంతంగా ఉంటే పుట్టే సంతానం బాగుంటుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో ఎవరైనా సరే గ్రహణాన్ని చూడకూడదు.చూస్తే వివిధ రకాల దోషాలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి గ్రహణాన్ని చూడకుండా ఉంటె మంచిది. కాబట్టి గర్బీని స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. రేపు వచ్చే చంద్రగ్రహణం గురించి అలాగే గర్బీణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.