బస్సులో 100రూపాయలకి చిల్లర ఇవ్వలేదని ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు

282

సమాజములో చాలా మంది పిరికివాళ్ళు ఉన్నారు.వాళ్ళ పిరికితనం చూసి చాలా మంది రకాలుగా భయపెడతారు. భాదపెడతారు. ఈ కాలం అమ్మాయిలలో అక్కడక్కడా దైర్యం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ 100 శాతం అమ్మాయిలలో 70 శాతం అమ్మాయిలు ఎవరు ఏమన్నా భయపడుతున్నారు. ఎదిరించి మాట్లాడటానికి భయం. ధైర్యాన్ని కోల్పోతారు. కానీ ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి గురించి తెలుసుకుంటే అలా పిరికిపందల్లా ఉండే అమ్మాయిలలో దైర్యం రావడం ఖాయం. ఈ అమ్మాయి చేసిన సాహసం గురించి తప్పకతెలుసుకోవాల్సిందే. మరి ఆ అమ్మాయి ఎవరు ఏం చేసిందో పూర్తీగా తెలుసుకుందామా.

ఈ అమ్మాయి పేరు రజని. రజని ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తుంది. అయితే ఈమె రోజు బస్సులోనే ఆఫీస్ కు వస్తుంది. రోజు సరిపడే చిల్లర పెట్టుకుని టికెట్ తీసుకుని కండక్టర్ కు చిల్లర సమస్య లేకుండా చేస్తుంది. అయితే మొన్న ఒకరోజు చిల్లర లేదు.అయినా సరే కండక్టర్ ఇస్తాడులే అని బస్సు ఎక్కింది.టికెట్ కోసం వచ్చిన కండక్టర్ టికెట్ అడిగాడు. ఆమె దిగాల్సిన స్టాప్ పేరు చెప్పి టికెట్ ఇవ్వమని 100 రూపాయలు ఇచ్చింది. అయితే 10 రూపాయల టికెట్ కు 100 రూపాయలు ఇస్తే నేను చిల్లర ఎక్కడినుంచి తీసుకురావాలి. అయినా చిల్లర లేకుండా బస్సు ఎందుకు ఎక్కావు. చిల్లర ఉందొ లేదో ముందే చూసుకోవా..10 రూపాయల టికెట్ కు 100 రూపాయల చిల్లర ఇవ్వాలా అని కసురుకున్నాడు. అంతటితో ఆగకుండా 10 రూపాయల టికెట్ కు 100 రూపాయలు తేవడం అందరికి అలవాటైపోయింది అని అనరాని మాటలు అన్ని అన్నాడు.

నాతో చిల్లర లేదు దిగిపో అని ఆమె బస్సు స్టాప్ రాకముందే మధ్యలోనే దింపేశాడు. ఇలా అందరి ముందు ఆమెను అవమానించాడు. ఇలా అవమానించిన కండక్టర్ మీద రజనికి కోపం వచ్చింది.ఎలాగైనా ఆ కండక్టర్ కు బుద్ధి చెప్పాలని బాగా అలోచించి నేరుగా కలెక్టర్ ఆఫీస్ కు పోయింది.జరిగిందంతా చెప్పి ఆ కండక్టర్ మీద పిర్యాదు చేసింది. అలా మధ్యలో దింపేస్తే మేము ఎక్కడికి పోవాలి.పోనీ మధ్యలో వేరే బస్సు ఎక్కుదాం అనుకుంటే వెనకాల వచ్చే బస్సులు మేము ఉన్నచోట ఆపరు. అది బస్సు స్టాప్ అయితే ఆపుతారు. కానీ బస్సు స్టాప్ కాదు కదా. కాబట్టి ఎవరు బస్సు ఆపకుండా వెళ్తారు. అయినా నేను 100 రూపాయలు ఇస్తే అన్ని మాటలు అనాలా అని కలెక్టర్ ముందు కన్నీరు కార్చింది.ఇప్పుడు ఆ కండక్టర్ మీద చర్యలు తీసుకునే పనిలో ఉన్నాడు కలెక్టర్. చూశారుగా ఈ అమ్మాయి దైర్యంగా తనను అవమానించిన కండక్టర్ మీద ఎలా చర్యలు తీసుకుందో. కాబట్టి అందరు ఇలా దైర్యంగా వాళ్లను ఎవరైనా అవమానిస్తే ఎదురుతిరగండి . మరి కండక్టర్ మీద కసి తీర్చుకున్న ఈ అమ్మాయి ఘటన గురించి అలాగే ఇలా దైర్యంగా ఉండే అమ్మాయిల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.