పడక గదిలో ప్రయోగాలు ఇబ్బందిగా ఉన్నాయి ఏం చేయాలి?

659

భార్యాభర్తల మధ్య జరిగే గొప్ప క్రియ రతిక్రియ.స్త్రీ పురుషుల మధ్య జరిగే శృంగార క్రియ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఇద్దరు సుఖపడుతూ మరొక జీవికి ప్రాణాన్ని ఇచ్చే ప్రక్రియ శృంగారం.మంచి సంతృప్తితో పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం.అయితే శృంగారంలో పాల్గొనేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ముందుగా శృంగారం చెయ్యాలనే ఆసక్తి ఇద్దరికీ ఉండాలి.అయితే కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి పట్టించుకోకుండా వారికి ఎలా చెయ్యాలనిపిస్తే అలా శృంగారం చేస్తారు.ముఖ్యంగా వారికి వివిధ భంగిమలలో చెయ్యాలని ఉంటుంది.దాంతో భాగస్వామిని అడగకుండానే అలా కానిచ్చేస్తుంటారు.అయితే ఇవన్నీ ఆడవారికి ఇబ్బందిగా ఉంటుంది.మరి అలాంటి వాళ్ళు ఏమి చెయ్యాలి.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for lovers

అనేక మంది దంపతులు తమ దాంపత్య జీవితాన్ని తమకు తోచినవిధంగా ఎంజాయ్ చేస్తుంటారు.ముఖ్యంగా శృంగారాన్ని ఇష్టం ఉన్నట్టు చేస్తుంటారు.భాగస్వామి ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకోరు. ఇలా ఎంజాయ్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా చాలామంది మహిళలు పడక గదిలో విచ్చలవిడిగా శృంగారానికి అంగీకరించరు. కానీ, భర్త మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ కోర్కె తీర్చుకునేందుకు వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ మొరటుగా ప్రవర్తిస్తుంటారు. ఈ ప్రయోగాలు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు.చాలామంది పురుషులు ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా పడక గదిలో మొరటుగా ప్రవర్తిస్తుంటారు. ఈ మొరటు ప్రవర్తన అసౌకర్యం కలిగిస్తుంటే ఆ విషయాన్ని కూడా తెలియజేయడం మంచిది. పడక గదిలో ఎలా ఉంటే ఇష్టమో, ఎలాంటి చర్యలు ఆనందం కలిగిస్తాయో స్పష్టంగా చెప్పాలి.

అలాగే మీకు నొప్పి కలగని శృంగార భంగిమ గురించి వివరించిండి.ఆ భంగిమలోనే శృంగారం చెయ్యమని మీ భర్తను ఒప్పించండి.అతను ఒప్పుకోకున్నా సరే ప్రేమతో నచ్చజెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించండి. ఆ భంగిమలోనే శారీరకంగా కలుసుకునేందుకు ఆసక్తి చూపించండి.పైగా, ఇద్దరూ ఒకరికొకరు కంఫర్టబుల్‌గా తయారయ్యాక నెమ్మదిగా వేర్వేరు శృంగార భంగిమల్లో ప్రయోగాల గురించి ఓపెన్‌గా డిస్కస్‌ చేసుకోండి. పైగా, ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనవి కావడం వల్ల భార్యాభర్తలిద్దరూ పడక గదిలో మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా మంచిది. ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా సంబంధిత విభాగం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.అప్పుడు అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి అలా చేసి మీ భర్తను మార్చుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం గురించి అలాగే పడక గదిలో భార్య ఇబ్బందిని కూడా పట్టించుకోకుండా ప్రయోగాలు చేసే భర్తల గురించి ఆ సమయంలో ఆడవాళ్ళూ పడే భాధ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.