అమ్మాయిల్లో ఆ టైంలో ఆత్మహత్యా ఆలోచనలు ఎందుకొస్తాయో తెలిస్తే షాక‌వుతారు

93

పీరియడ్లకు ముందు చాలామంది మహిళలను వేధించే సమస్య ప్రి-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్(పీఎంఎస్). నెలసరికి 5-7రోజుల ముందు పీఎంఎస్ మొదలవుతుంది. దీని గురించి చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు మ‌రీ ముఖ్యంగా స‌న్న‌గా ఉన్న అమ్మాయిలు శ‌రీరంలో బ‌లం త‌క్కువ ఉన్న‌వారు ఐరన్ లోపం ఉన్న అమ్మాయిల‌కు ఇది మ‌రింత వేధ‌న‌గా ఉంటుంది.ఈ సమయంలో మహిళలకు కడుపు, వక్షోజాల దగ్గర నొప్పిగా ఉంటుంది. ఉన్నట్టుండి మూడ్ మారిపోతుంది. చికాకు, కోపం, బాధ లాంటి ఉద్వేగాలకు లోనవుతారు. ఉన్నట్టుండి సంతోషం, దు:ఖం తన్నుకొస్తాయి. చిన్న విషయాలకే ఏడుపొస్తుంది. ఏ ప‌ని చెప్పినా చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపించ‌రు అలాగే వారికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఉంటారు. ఏ ప‌ని చేయ‌డానికి స‌హ‌క‌రించ‌రు అలాగే వారికి మూడ్ బ‌ట్టీ తిండి కూడా తినాలి అనిపించ‌దు.

పీఎంఎస్ దశలో హార్మోన్ల విడుదలలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా పొట్ట, వక్షోజాలు, ఇతర రహస్య భాగాలకు రక్తప్రసరణ ఎక్కువై నొప్పిగా అనిపిస్తుంది.నెలసరి సమయంలోనూ ఈ లక్షణాలు కనిపించొచ్చు. నెలసరి ముగిశాక అవి దూరమవుతాయి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే విటమిన్ సప్లిమెంట్లు, పెయిన్ కిల్లర్లను వైద్యులు సిఫార్సు చేస్తారు. అలాగే ఇవి కొంద‌రికి ప‌ని చేస్తాయి మ‌రికొంద‌ర‌కి పనిచేయ‌వు..చాలామందికి ఈ సమస్య గురించి అవగాహన ఉండదు. కాబట్టి, కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల కాస్త ఊరట కలగొచ్చు.

పీఎంఎస్ తీవ్రమైతే అది ప్రి-మెన్‌స్ట్రువల్ డిస్ఫారిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. ఈ దశలో తీవ్రమైన ఒత్తిడి, చికాకు, నిద్ర లేమితో పాటు ప్రతికూల ఆలోచనలూ ఎక్కువవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలూ కలుగుతాయి. కొందరు మహిళలు తమను తామే గాయపరచుకుంటారు. ఈ సమస్యకు చికిత్స అందుబాటులో ఉంది. కౌన్సెలింగ్ ద్వారా కూడా కొంత ఊరట కలుగుతుంది. పీఎంఎస్ ఓ మానసిక రుగ్మత అని చాలామంది భావిస్తారు. అది ఎంతమాత్రం నిజం కాదు. అందుకే ఇలాంటి వ్యాదికాని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ముందు డాక్ట‌ర్ ని సంప్ర‌దించండి దీనిపై అల‌స‌త్వం వ‌ద్దు అనేది గుర్తు ఉంచుకోండి.