తిరిగివచ్చిన అభినందన్ ను చూసి అతని కొడుకు అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అభినందన్

243

ఇప్పుడు దేశం మొత్తం అభినందన్ గురించే మాట్లాడుకుంటుంది. ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ మిగ్-21లో వెళ్లిన అభినందన్ ఫిబ్రవరి 27న పాక్ సైన్యానికి చిక్కాడు. ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో.. పారాచ్యూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సురక్షితంగా దిగాడు. దీంతో ఆయన్ను వెంబడించి పట్టుకున్న స్థానికులు తీవ్రంగా కొట్టి పాక్ ఆర్మీకి అప్పగించారు. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ అభినందన్‌ను భారత్‌కు పంపించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అభినందన్‌కు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

Image result for abhinandan family

పైలట్‌ను పరీక్షించిన వైద్యులు వెన్నెముకకు గాయమైందని, పదిరోజులు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. మిగ్ 21 విమానం దెబ్బతినడంతో అందులోనుంచి పారా షూట్ సాయంతో దిగేటప్పుడు వెన్నెముక గాయపడినట్లు చెబుతున్నారు. ఇక పాక్ లో అడుగుపెట్టాక అభినందన్ పై అల్లరి మూకలు జరిపిన దాడిలో పక్కటెముకకు గాయం అయినట్లు తెలుస్తోంది. అభినందన్.. 60 గంటలపాటు పాక్ చెరలో తనకు ఎదురైన అనుభవాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. అభినందన్‌పై పాకిస్థాన్ సైన్యం భౌతిక దాడికి దిగలేదు. కానీ నిర్బంధంలో ఉంచిన సమయంలో పాక్ అధికారులు అతణ్ని మానసికంగా తీవ్రంగా వేధింపులకు గురి చేసినట్టు సమాచారం.అన్ని భాదలు పడ్డాడు కాబట్టే ఇప్పుడు ఇండియా మొత్తానికి హీరో అయ్యాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

అభినందన్ ను భారతీయులు ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. అతని కుటుంబంలో ప్రతి ఒక్కరు దేశం కోసం ఇలా భారత జవాన్లుగా మారిన వారే. పెద్ద వాళ్ళు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ చిన్న పిల్లలలో కూడా దేశభక్తి ఉంది. అభినందన్ ను చూసి అతని కొడుకు.. నిన్ను చూసి గర్విస్తున్నా నాన్న.. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నా..నీ ఇన్స్పిరేషన్ తోనే భవిష్యత్ లో నేను కూడా ఇండియన్ ఆర్మీలో చేరుతా అని అభినందన్ దగ్గర అతని కొడుకు అన్నాడు. అప్పటివరకు ఎంతో దైర్యంగా ఉన్న అభినందన్ ఈ మాటలు విని కొంచెం భావోద్వేగానికి గురై కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు.అన్ని రోజులు తానూ పడిన భాద ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది.అతని కుమారుడు అంత పెద్ద మాటలు మాట్లాడాడంటే దేశ ప్రజలు నన్ను ఏ విధంగా తీసుకొని ఉంటారో అని అనుకుని భావోద్వేగానికి గురయ్యాడు.కొడుకు అన్న మాటలు నేను మర్చిపోలేనని, ఈ అనుభూతి జీవితాంతం ఇలాగె ఉంటుందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు అభినందన్. మరి అభినందన్ గురించి అభినందన్ మీద అతని కొడుకు చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.