హైద్రాబాద్‌లో ఐకియా ప్రారంభం ఇక్క‌డ ఏం దొరుకుతాయో త‌ప్ప‌క తెలుసుకోండి

566

మ‌ల్టీనేష‌నల్ గూడ్స్ కంపెనీలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిటైల్ మార్కెట్ పై ఫోక‌స్ చేస్తున్నాయి. వ‌న్ ప్లేస్ ఆల్ గూడ్స్ అనే ట్యాగ్ తో ఇప్ప‌టికే ఈశాన్య రాష్ట్రాల నుంచి ద‌క్షిణాది రాష్ట్రాల‌లో ఈ కంపెనీలు వ్యాపారాలు విస్త‌రిస్తున్నాయి.. ఇక ఇతర దేశాల‌కు సంబంధించి కంపెనీలు కూడా మ‌న దేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నాయి.. తాజాగా హైద్రాబాద్‌లో ఐకియా షోరూమ్ వ‌చ్చింది.
హైటెక్ సిటీలో ఐకియా హోం ఫర్నిషింగ్ స్టోర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు..ఈ స్టోర్‌ కోసం సంస్థ 800 కోట్ల రూపాయలు కేటాయించింది.

హైదరాబాదులో పెట్టుబడులకు ఆసక్తి

ఇప్పటికే స్టోర్‌ కోసం 400 మందిని నియమించుకున్నామని, వీరిలో 50 శాతం మంది మహిళలేనని ఐకియా ఉన్నతాధికారి తెలిపారు.స్టోర్‌లో 7,500 ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి… హైదరాబాద్‌ స్టోర్‌ తర్వాత ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లలోని స్టోర్లను ఐకియా ప్రారంభించాలన్న ప్రణాళికలతో ఉంది.షోరూంకు వ‌చ్చే వినియోగ‌దారుల‌ను ఆకట్టుకునేందుకు ఐకియా ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఇంట్లో ఉప‌యోగించే చిన్న వ‌స్తువులు మొద‌లు గ‌ది అలంక‌ర‌ణ‌ సామాగ్రి, ఫ‌ర్నీచ‌ర్,హోం ఫ‌ర్నిషింగ్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌ను అందుబాటు ధ‌ర‌ల్లో ఉంచారు.

రెస్టారెంటు, పిల్లలు ఆడుకునేందుకు స్మాలాండ్

బ‌య‌ట ఫ‌ర్నిచ‌ర్ షాపుల కంటే త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తువులు ల‌భించేలా ఐకియా రాయితీల‌ను ప్ర‌క‌టించింది… వీటిలో వెయ్యికి పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువే.వంట గది, పడక గది, హాలు తదితరాల నమూనాలు ఉంటాయి.కేవ‌లం ఫ‌ర్నిచ‌ర్‌కే ప‌రిమితం కాకుండా ఐకియా సెంట‌ర్‌లో రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 1000 మంది కూర్చొని ఆహారాన్ని తినేందుకు వీలు క‌ల్పించారు… దేశీయ సంస్కృతికి అల‌వాటు ప‌డేలా ఇక్క‌డ పంది, గొడ్డు మాంసాల‌ను లేకుండా చేశారు. చికెన్ మాత్రం అందుబాటులో ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మెనూలో ముఖ్యంగా చికెన్ మెటాబాల్స్, బిర్యానీ, స‌మోసా, దాల్ మ‌ఖానీ, వెజిటేరియ‌న్ హాట్‌డాగ్స్ వంటివి ఉంటాయి.. దేశవ్యాప్తంగా మొత్తం 40 నగరాల్లో ఐకియా స్టోర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు… ప్రాధాన్యత మార్కెట్లుగా గుర్తించిన తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీలో భూమిని కొనుగోలు చేశామని… 2025 నాటికి అహ్మదాబాద్, సూరత్, పూణే, చెన్నై, కోల్‌కతా నగరాల్లో కూడా స్టోర్స్‌ ను ప్రారంభిస్తామని తెలిపారు.ఈ స్టోర్ 365 రోజులు ఉదయం పది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. మ‌రింకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓసారి ఇక్క‌డ ట్రై చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.