మన అభినందన్‌ను తిరిగి పంపారు… వాళ్ల పైలెట్‌ను కొట్టి చంపారు

267

కోట్లాది మంది భారతీయ గుండెలు ఆనందంతో ఉప్పొంగుతుండగా.. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్.. భారత గడ్డపై సగర్వంగా అడుగుపెట్టారు. శుక్రవారం (మార్చి 1) రాత్రి 9.15 గంటల సమయంలో ఆయన పాక్ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పంజాబ్‌లోని వాఘా-అట్టారీ సరిహద్దు వద్ద భారతీయుల జయజయ ధ్వానాల మధ్య భారత గడ్డపై అభినందన్ కాలుమోపారు. అభినందన్‌ వెంట ఆయన సతీమణి తన్వీ ఉన్నారు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, ధీరత్వంతో అభినందన్ తన మాతృ గడ్డపై అడుగు పెట్టారు. మన జవాన్ ను అయితే భద్రంగా కాపాడి పంపించారు కానీ వాళ్ళ జవాన్ నే కాపాడుకోలేకపోయింది పాకిస్తాన్.

Image result for pak jawan

పాకిస్థాన్ ఫైటర్ జెట్ F16ను కూల్చిన భారతీయ వింగ్ కమాండర్ పారాచ్యూట్ సాయంతో పాకిస్థాన్‌లో దిగినా బతికి బట్టకట్టాడు. కానీ పాక్ ఫైటర్ జెట్ F16 కమాండర్ కూడా పాక్‌లోనే పారాచ్యూట్ సాయంతో దిగాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నౌషిరా సెక్టర్‌ చేరుకున్నాడు. అయితే స్వదేశంలో పడినా ఆయనకు ప్రాణాలు మాత్రం దక్కలేదు. భారత జవాన్ అనుకుంటూ పాక్ వింగ్ కమాండర్ షహజుద్దీన్‌ను అక్కడున్న ప్రజలు తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్రగాయాల పాలైన షహజుద్దీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అభినందన్, షహజుద్దీన్‌ కొన్ని పరస్పర పోలికలు ఉన్నాయి. భారత వింగ్ కమాండర్ అభినందన్ అయితే…. పాకిస్థాన్ వింగ్ కమాండ్ షహజుద్దీన్, భారత యుద్ధ విమానం మిగ్-21ను నడిపితే అభినందన్… పాక్ ఫైటర్ జెట్ F-16ను నడిపేది షహజుద్దీన్. అంతే కాదు ఈ ఇద్దరు కూడా ఆర్మీ కుటుంబాల నుంచి వచ్చిన వారే. అభినందన్ తండ్రి ఎస్. వర్ధమాన్ ఎయిర్ మార్షల్‌గా పనిచేస్తే… పాకిస్థాన్ వింగ్ కమాండర్ షహజుద్దీన్ తండరి వసీమఉద్దీన్ కూడా ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్ మార్షల్‌గానే పనిచేశారు. ఆయన ఎఫ్ 16తో పాటు మిరేజ్ యుద్ధ విమానాలు కూడా నడిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే పాకిస్థాన్ వింగ్ కమాండర్ షహజుద్దీన్‌ను మాత్రం సొంత దేశస్థులే పొట్టన పెట్టుకున్నారు. తమ చేతులారా తమ సైనికుడ్ని చంపుకున్నారు. పాక్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానం కూలిన వార్త ముందుగా లండన్‌లో ఉన్న లాయర్ వకీల్ ఖాలీద్ అహ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సన్నిహితుల ద్వారా ఈ సమాచారం ఆయనకు అందంది. అయితే ఈ ఘటనలో పాక్ ఫైటర్ షహజుద్దీన్ పారాచ్యూట్ సాయంతో సేఫ్‌గా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దక్షిణం వైపు ఉన్న లామ్ వ్యాలీలో దిగారు. అయితే అక్కడ షహజుద్దీన్ దిగగానే జనం అతడ్ని చుట్టుముట్టారు. భారత ఫైలట్ అనుకొని చావబాదారు. జనం కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇంటర్నెల్ బ్లీడింగ్ ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ షహజుద్దీన్ ప్రాణాలు వదిలేశాడు. అయితే ఎఫ్16 కూలిపోలేదని బుకా ఇస్తున్న పాకిస్తాన్ ఈ విషయాన్ని కూడా దాచి పెట్టింది. . ఇంతవరకు షహజుద్దీన్ మృతి పట్ల ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి పాక్ జవాన్ ను కొట్టి చంపినా ఘటన గురించి అలాగే ఆ విషయాన్నీ ఇప్పటికి కూడా పాక్ ప్రకటన చెయ్యకపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.