700 కోట్లు ఇవ్వట్లేదు.. కేరళ బాధితులకు షాకిచ్చిన దుబాయ్ రాజులు

493

కేరళ పరిస్థితి ఇప్పుడిప్పుడే ఒక కోలుక్కి వస్తుంది.కొన్ని లక్షల మంది ఆసరా లేక దీన స్థితిలో ఉన్నారు.ఎవరు సహాయం చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.అందుకే దేశ నలుమూలల నుంచి వారికి సహాయం చెయ్యడానికి సిద్దపడుతున్నారు.చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వారికి తోచినంత సహాయం అందిస్తున్నారు.అయితే గత రెండు రోజుల క్రితం కేరళ వరద బాదితుల కోసం యుఏఈ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ప్రకటించింది అని వార్తలు వచ్చాయి.దీనికి మోడీ థాంక్స్ కూడా చెప్పినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్త నిజమేనా.నిజంగానే వారు 700 కోట్లు ఇస్తున్నారా.ఇదులో నిజమెంత.ఆ విషయం గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for dubai kings

కేరళ రాష్ట్రానికి రూ.700 కోట్ల సాయం ప్రకటనను యూఏఈ ఖండించింది. కేరళకు నిర్ధిష్ట సాయం చేస్తామని తాము ఎక్కడా ప్రకటించలేదని తెలిపింది. అసలు కేరళకు సాయం ఎంత అనేది కూడా తాము నిర్ణయించలేదని చెప్పింది. కేరళకు సాయం విషయంలో మేం అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని చెప్పారు.ఈ మేరకు యూఏఈ అంబాసిడర్ అహ్మద్ అల్బన్నా శుక్రవారం ప్రకటన చేశారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడి రూ.700 కోట్ల సాయం ప్రకటనను ఖండించారు.కేరళకు సాయంపై తాము ఎలాంటి సహాయం ప్రకటన చేయలేదని ఆయన చెప్పారు. కేరళలో వరద సాయంపై అంచనా కొనసాగుతోందని తెలిపారు. ఆర్థిక సాయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. యూఏఈ రూ.700 కోట్ల మొత్తాన్ని కేరళకు సహాయంగా ప్రకటించలేదా అని ప్రశ్నిస్తే.. ‘అవును, అది నిజం, దాని పైన మేం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అసలు మేం దానిని ప్రకటించలేదు’ అని చెప్పారు.

యూఏఈ అంబాసిడర్ వ్యాఖ్యలు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు, ఇతరులకు పెద్ద షాక్ అని అంటున్నారు. గత ప్రభుత్వాలు కూడా విదేశీ సహాయాన్ని తీసుకోలేదు. భారతదేశం సౌలభ్యం దృష్ట్యా మోడీ ప్రభుత్వం కూడా అదే పరంపరను కొనసాగిస్తోంది. అయితే, రూ.700 కోట్లను యూఏఈ ప్రకటించిందని కేరళ సీఎం చెప్పడం, దానిని అంగీకరించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, ఆయనకు పలువురు వంత పాడటం జరిగింది. వారందరికీ ఇది పెద్ద షాక్ అంటున్నారు.ముఖ్యంగా ఆ రాష్ట ప్రజలకు కూడా ఇదొక పెద్ద షాక్.ఎందుకంటే ఇంత పెద్ద విరాళం వస్తుందని తమకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకున్నారు.కానీ ఇప్పుడు అది నిజం కాదని తెలిసి అందరు దిగ్బంతి చెందారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళకు వచ్చిన భారీ విరాళం అబద్దం అన్న విషయం మీద అలాగే అబద్దం అయిన ఈ వార్త ఇంతలా స్ప్రెడ్ అవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.