హిజ్రాగా మారిన భారత మాజీ క్రికెటర్ గంభీర్ ఎందుకో తెలిస్తే శభాష్ అంటారు

421

భారత క్రికెట్ లో అతను ఒక స్టార్.అతని ఆటను అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.అంతర్జాతీయ మ్యాచ్ ఆడక చాలా రోజులయింది.అయినా కానీ అతని ఆట నచ్చనివాళ్ళు ఉండరు.అతనెవరా అని ఆలోచిస్తున్నారా.అతనెవరో కాదు గౌతమ్ గంభీర్.అయితే గంభీర్ ఇప్పుడు వార్తలో నిలిచాడు.హిజ్రా అంటేనే మన సమాజంలో నీచంగా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.వారిని దగ్గరికి కూడా రానివ్వని మనుషులు ఉంటారు.అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా హిజ్రాగా మారిపోయాడు.గంభీర్ ఏంటి హిజ్రాగా మారిపోవడం అనుకుంటున్నారా..దాని వెనుక ఒక కథ ఉంది.మరి అదేమిటో తెలుసుకుందామా.

gautam gambhir

భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ హిజ్రాగా మారిపోయాడు. అచ్చం హిజ్రాల్లాగానే చీరకొట్టి.బొట్టుపెట్టి తానుకూడా హిజ్రాలకు ఏం తీసిపోనని నిరూపించాడు. అసలు గౌతం గంభీర్ ఏంటి.. హిజ్రా మారిపోవడం ఏంటనే కదా మీ సందేహం.సామాజిక సేవలోనే కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో గౌతం గంభీర్ ఎపుడూ ముందువరుసలో ఉంటాడు. అంతేకాక సమాజంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ఇతర ఘటనల గురించి సోషల్‌మీడియా వేదికగా అతను గళమెత్తుతూ ఉంటాడు.అయితే సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు.

Image result for gambhir

ఇందుకు నాందిగా ఈ యేడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. తాజాగా గంభీర్ మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు. ఢిల్లీలో హిజ్రాల‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో అత‌ను బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు ధ‌రించాడు.ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తన స్థాయిని పక్కన పెట్టి హిజ్రాల కోసం ఇలాంటి పని చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ సోషల్‌మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.నిజంగా గంభీర్ చేస్తున్న ఈ మంచి పనిని అధినందించకుండా ఉండలేకపోతున్నాం కదా.మరి మనం కూడా గంభీర్ ను అభినందిద్దాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హిజ్రాల మీద మన సమాజంలో ఉన్న చిన్న చూపు గురించి అలాగే హిజ్రాల కోసం గంభీర్ చేస్తున్న ఈ మంచి పని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.