వాట్సప్ వల్ల ఈ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది..ఎలానో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

512

టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యింది.ఎవరు చుసిన ఉదయం లేచినప్పటినుంచి సోషల్ మీడియాలోనే ఉంటున్నారు.ముఖ్యంగా వాట్సాప్ పేస్ బుక్ అంటూ 24 గంటలు వాటితోనే గడుపుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా వాట్సప్ ను వ్యసనంలా వాడుతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది.ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోడానికి వాట్సాప్ కారణం అయ్యింది.పెళ్లి ఇక దగ్గరలోనే ఉంది అనగా వాట్సాప్ ఆ అమ్మాయి పెళ్లిని ఆపేసింది.వాట్సాప్ ఎలా ఆపేసింది అనేగా మీ అనుమానం.అయితే పూర్తీగా చెబుతా వినండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడితో నౌగాన్ సాదత్ ప్రాంతానికి చెందిన వధువుకు వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ నెల 5న పెండ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.పెళ్లి మీద ఆ పెళ్లికూతురు చాలా ఆశలు పెట్టుకుంది.జీవితంలోకి అడుగుపెడుతున్న అన్న ఆనందంలో ఆ యువతీ ఉంది.మంచి అబ్బాయి దొరికాడని ఆ యువతీ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.పెళ్లి పనులన్నీ పూర్తీ చేశారు.పెండ్లి సమయం దగ్గరపడడంతో అంతా వరుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు.కానీ ఇంతలోనే ఫోన్‌చేసిన వరుడి తండ్రి ఈ పెండ్లి తమకు ఇష్టంలేదని తేల్చిచెప్పారు.ఆ ఒక్కమాటతో పెళ్లికూతురు కుటుంబం షాక్ అయ్యింది.ఎందుకు ఏమైందో కూడా వారికి అర్థం కాలేదు.పెళ్లి ఎందుకు వద్దంటున్నారో కూడా అర్థం అవ్వలేదు.ఎందుకు వద్దంటున్నారని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అవ్వడం అమ్మాయి తరపు వాళ్ళ వంతు అయ్యింది.ఇంతకు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా..

వధువు ఎక్కువగా వాట్సాప్‌ను వినియోగించడం తమకు నచ్చలేదని, ఇలాంటి యువతి పెండ్లి అయ్యాక తమనేం పట్టించుకుంటుందని చెప్పారు.24 గంటలు ఫోన్ నే చూస్తుంటే ఇక సంసారం ఏం చేస్తుంది.మా కొడుకును సంతోషంగా ఎలా చూసుకుంటుందని వాళ్ళ ఆరోపణ.ఈ సమాధానం విని షాక్ కు గురయిన వధువు కుటుంబసభ్యులు ఈ ఆరోపణలను ఖండించారు. కట్నం కోసం డిమాండ్ చేసేందుకే చివరి నిమిషంలో పెండ్లి వద్దన్నారని పేర్కొన్నారు. అదీకూడా తాను ఫోన్ చేస్తేనే చెప్పారని, కట్నంగా రూ.65 లక్షలు డిమాండ్ చేశారని పెండ్లి కుమార్తె తండ్రి ఉరోజ్ మెహందీ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడి కుటుంబసభ్యులపై కేసు నమోదుచేశారు.అయితే వాళ్ళు పోలీసుల దగ్గర కూడా ఇదే చెప్పారు.ఎవరికీ న్యాయం చెయ్యాలో పోలీసులకు కూడా అర్థం అవ్వడం లేదు.