అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి

627

వరదలతో దెబ్బతిన్న కేరళరాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాలు అటువంటి ప‌రిస్దితుల్లోనే ఉన్నాయి.. వ‌ర‌ద‌ల తాకిడికి ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాలు కోలుకోలేకుండామ‌నిషి జాడ క‌నిపించ‌కుండా ఉన్నాయి . కేర‌ళ వ‌ర‌ద‌ల‌ను చూసి అనేక మంది కోట్లాది రూపాయ‌లు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి విరాళాలుగాపంపించారు వెయ్యి కోట్లరూపాయ‌ల పైనే వ‌చ్చింది అని తెలియ‌చేశారు కేర‌ళ సీఎం…భారీ వర్షాలు, వరదల బీభత్సంతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

Image result for kerala

ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రభుత్వ నిధులతో జరిపే అధికారిక వేడుకలన్నింటినీ రద్దు చేసింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధికి మళ్లించాలని పేర్కొంది. కేరళలో వందేళ్ల చరిత్రలోనే కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిధులతో నిర్వహించే అధికారిక వేడుకలు, పలు కార్యక్రమాలను ఏడాది పాటు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఏటా డిసెంబరులో అలప్పుళలో నిర్వహంచే స్కూల్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌, యూనివర్సిటీ ఆర్ట్స్‌ ఫెస్ట్‌, అలాగే బాగా ఫేమ‌స్ అయిన స్టేట్ యూత్ ఫెస్టివల్, ఇతర యూత్‌ ఫెస్టివళ్లతో పాటు అన్ని అధికారిక వేడుకలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ..భారీ వరదల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలు తెరిపినిచ్చివారం రోజులు గడుస్తున్నా.. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. మరోవైపు కలుషిత నీటి కారణంగా ర్యాట్ ఫీవర్ తదితర వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకుని స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లాల‌ని కేబినెట్ నిర్ణయించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వరదల కారణంగా సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు… అలాగే లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్ల రూపాయల విలువైన పంటలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి, కేరళ పునర్మిర్మాణానికి ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది… కేరళ తక్షణ అవసరాలకే రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ఓ అంచ‌నాకి వ‌చ్చింది రాష్ట్ర‌ప్ర‌భుత్వం. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం పై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నా మ‌రికొంద‌రు మాత్రం ఇది స‌రైన‌దే అని అంటున్నారు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.