40 ఏళ్ళు దాటినవారు మాత్రమే ఈ వీడియో చూడండి

667

నలబై ఏళ్లు రాగానే ఆందోళన మొదలవుతుంది. ఇది చాలా సహజం. ఎందుకో అలసట, నిరుత్సాహం, దిగులు. ఇందుకు మానసిక సమస్యలే కారణమనుకునే చాలా మంది అభిప్రాయం. వాస్తవానికి మానసిక సమస్యలేవీ లేకున్నాఇది తప్పదు. అయితే 40 ఏళ్ళు దాటినా తర్వాత మనం కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా శృంగారం విషయంలో. మరి ఏం చెయ్యాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for girls

శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లోపాలు పురుషులను, ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ లోపాలు స్త్రీలను సతమతం చేస్తాయి.ఈ హార్మోన్లన్నీ శరీరంలో తయారయ్యే రసాయనాలే. ఇవి లైంగిక హార్మోన్లు. టెస్టోస్టిరాన్లు పురుష లక్షణాలను కలిగిస్తే, ఈస్ర్టోజన్‌ హార్మోన్లు స్త్రీ లక్షణాలను కలిగిస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరమంతా వ్యాపిస్తాయి. పురుషుల అంగ స్తంభనలకు, వీర్యకణాల ఉత్పత్తికీ ఈ హార్మోన్లే మూలం. అలాగే ప్రోస్టేట్‌ కణాల ఉత్పత్తిలో కూడా ఈ హార్మోన్ల పాత్ర ఉంది. ఎముకలు, కండరాల దృఢత్వానికి ఈ హార్మోన్లే ఆధారం.శృంగార వాంఛను కలిగించేవి ఈ హార్మోన్లే. అయితే ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయినప్పుడే సమస్యలు మొదలవుతాయి.ఇలా తగ్గడాన్ని హైపోగొనాడిజం అంటారు. 40 ఏళ్ల తరువాత క్రమంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతూ వెళుతుంది.

యేటా ఒక శాతం ఉత్పత్తి తగ్గుతూ 70 యేళ్లు వచ్చేసరికి ఈ ఉత్పత్తి 30 శాతానికి పడిపోతుంది. ఇందుకు భిన్నంగా కొందరిలో ఉత్పత్తి చాలా వేగంగా తగ్గిపోతుంది.దీని వల్ల లైంగిక సామర్థ్యం, వాంఛ వేగంగా తగ్గడంతో పాటు నీరసం, అలసట, దిగులు, ఆందోళన, జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రతా లోపాలు తలెత్తుతాయి. చికాకు, కోపం, మొదలవుతాయి. నిద్రలేమితో పాటు కీళ్ల నొప్పులు మొదలవుతాయి.ఈస్ట్రోజన్‌ హార్మోన్లు తగ్గిపోవడం వలన ఆడవాళ్ళూ పలు సమస్యలకు గురవుతాయి.. రుతు సంబంధ సమస్యలతో పాటు, కీళ్లనొప్పులు తరచూ వేధిస్తాయి. వీటికి తోడు నిరంతరం దిగులూ ఆందోళనకు లోనవుతారు. అయితే, వీటన్నిటికీ కుటుంబ సమస్యలే కారణమనుకుని చాలా మంది వైద్యులను సంప్రదించరు. దీని వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుంది.

 

క్యాల్షియం మోతాదు తగ్గి, ఎముకలు పెళుసుబారిపోతాయి. అతి చిన్న ప్రమాదానికి కూడా ఎముకలు విరిగే ప్రమాదం ఏర్పడుతుంది. హార్మోన్‌ సప్లిమెంట్లుగా మాత్రలు, ఇంజెక్షన్లు, చర్మం మీద అతికించుకునే బిళ్లలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.అయితే ఈ సమస్యల బారినుంచి బయటపడాలంటే కొన్ని ఆహార నియమానాలు పాటిస్తే చాలు… క్రమం తప్పని వ్యాయామం, అవసరమైన పోషకాలు, క్యాల్షియం తీసుకుంటే కండరాలు, ఎముకలు జీవితాంతం దృఢంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. అథిరోస్‌క్లిరోసిస్‌ అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులను అదుపు చేయయగలిగితే హార్మోన్‌ సమస్యలను నివారించవచ్చు.కాబట్టి ఇలా చేసి సమస్యల బారి నుంచి తప్పించుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో మనం ఏమేమి చెయ్యాలో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.