యుద్దంలో గెలిచిన తర్వాత కొత్త భర్తతో పడక సుఖం.. ఆమె భర్తల సంఖ్యను ఎవరూ తేల్చనే లేదు

236

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం రాచరికపు పాలన కొనసాగింది. రాచరికపు పాలన సందర్బంగా ఒక రాజ్యంపైకి మరో రాజ్యం రాజు దండెత్తడం చాలా కామన్‌గా జరిగే విషయం. చిన్న రాజ్యాలను తమ ఆధీనంలో తీసుకుని పాలించాలనేది పెద్ద రాజ్యాల రాజుల ప్రయత్నాలుగా ఉండేవి..అలా ఎంతో మంది రాజులు వందల కొద్ది యుద్దాలు చేశారు. కొన్ని రాజ్యాల్లో సంవత్సరంలో రెండు మూడు యుద్దాలు జరిగి వేలాది మంది చనిపోయే వారు. మనం ఎక్కువగా యుద్దాలు చేసిన రాజులు పురుషులుగానే చదువుకున్నాం.కాని ఆఫ్రికాకు చెందిన రాణి అమీనా ఎన్నో యుద్దాలు చేసింది.

తన రాజ్య విస్తరణ కోసం అమీనా రాణి వారు చేసిన యుద్దాలు మరే రాణి చేసి ఉండదు. యుద్దాలు చేసే సమయంలో ఆమెలోని వీర నారిని చూశాం అంటూ స్థానికులు ఇప్పటికి చెబుతూ ఉంటారు. అమీనా గురించి ఆఫ్రికన్‌ చరిత్ర చాలా గొప్పగా చెబుతుంది.కాని ఆమెలోని చిన్న మైనస్‌ విషయాన్ని మాత్రం చాలా మంది పరిగణలోకి తీసుకోకుండా ఆమెను గొప్ప నాయకురాలుగా, వీర వనితగా భావిస్తూ ఉంటారు. రాజ్యంను ఎలా పెంచుకుంటూ పోవాలని ఆమెకు పిచ్చి ఉందో అలాగే శృంగార పిచ్చి కూడా ఆమెకు చాలానే ఉంది. ఆమె యుద్దం చేస్తున్నన్ని రోజులు ఆ విషయాల గురించి ఆలోచించదు..

ఈ క్రింది వీడియో చూడండి

ఎప్పుడైతే యుద్దం పూర్తి అవుతుందో అప్పుడు పెళ్లి చేసుకుంటుంది.పెళ్లి చేసుకున్న వ్యక్తితో కొన్ని రోజుల పాటు సంసారం చేసి ఆ తర్వాత అతడిని చంపిస్తుంది. అలా అమీనా ఎన్ని యుద్దాలు చేసిందో అంత మంది భర్తలు ఆమెకు ఉన్నారంటూ చరిత్రకారులు చెప్పడం జరిగింది. అయితే ఆమెను అభిమానించే వారు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోరు.ఒకప్పుడు 20 వేల మంది సైన్యంతో ఆఫ్రికాలోనే అతి పెద్ద సైన్యంను ఏర్పాటు చేసుకున్న అమీనా అలా శృంగార పిచ్చిదాని మాదిరిగా ప్రవర్తించింది అంటే ఎలా నమ్మడం అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం అంటూ చరిత్రకారులు అంటున్నారు.