తల్లిదండ్రులకు హెచ్చరిక… బాత్ రూమ్ లోకి ఒంటరిగా వెళ్లిన ఈ పిల్లాడికి ఏమైందో తెలిస్తే షాక్..

205

చిన్నపిల్లలు ఏమి తెలియని అమాయకులు.వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు.అది చేస్తే ప్రమాదం వస్తుందని దానివలన ప్రాణాలు పోతాయని కూడా వాళ్లకు తెలియదు.అందుకే పిల్లలకు ఏమి అవసరం ఉన్నా తల్లిదండ్రులే చూసుకోవాలి.వారి తిండి నుంచి ఆడుకునే ఆటల వరకు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే వాళ్లకు ఏమైనా అవ్వొచ్చు.ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు హెచ్చరిక.ఈ ఘటన విన్నాక అయినా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని ఆశిస్తూన్నాం.మరి ఏం జరిగిందో తెలుసుకుందామా.

Image result for parents and children

చైనాలో ఓ పిల్లాడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. సుమారు గంటకు పైగా టాయిలెట్‌లోనే కూర్చుని మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చున్న పిల్లాడు పైకి లేద్దామనుకునే సరికి లేవలేకపోయాడు. దీంతో తాను ఇరుక్కుపోయానన్న విషయం అర్థమైంది. ఆ పిల్లాడు గట్టిగా కేకలు వేయడంతో చివరకు తల్లి వచ్చి అతడిని బయటకు లాగే ప్రయత్నం చేసింది. పిల్లాడు పూర్తిగా టాయిలెట్‌ ఇరుక్కుపోవడంతో ఆమె వల్ల కాలేదు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసింది. ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ పిల్లాడిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు.మొదట చిన్న కత్తితో టాయిలెట్ పై సీటు కట్ చేశారు. ఆ తర్వాత ఇతర వస్తువులు వాడి టాయిలెట్‌ కమోడ్‌ను కట్ చేసి పిల్లాడిని బయటకు తీశారు. అయితే, చిన్న చిన్న గాయాలతోనే బుడతడు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో ఆ తల్లి ఊపిరిపీల్చుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి 

తాను వద్దు అని చెబుతున్నా వినకుండా పిల్లాడు మొబైల్ ఫోన్ టాయిలెట్‌లోకి తీసుకెళ్లాడని తల్లి చెప్పింది. సుమారు గంటసేపు అలా టాయిలెట్ మీద కూర్చుని ఆటలో నిమగ్నం అయిపోవడంతో టాయిలెట్‌లో ఇరుక్కుపోయిన విషయాన్ని కూడా గ్రహించలేకపోయాడు. ఎలాగోలా బయటపడడంతో ఆ తల్లి సంతోషం వ్యక్తం చేసింది. అయితే, టాయిలెట్‌లో నుంచి పిల్లాడిని రక్షించే సీన్ ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లాడు ఉన్నాడేమో చెక్ చేసుకోండి అంటూ ఫైర్ ఫైటర్లు స్థానికులకు సూచిస్తున్నారు.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అప్రమత్తతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. చూశారుగా ఈ బాలుడికి ఏం జరిగిందో.అందుకే ప్రతి తల్లిదండ్రి జాగ్రత్తగా ఉండండి.మీ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి.లేకుంటే మీ ఇంట్లో కూడా ఇలాగే జరగొచ్చు.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు. టాయిలెట్‌లో ఇరుక్కుపోయిన ఈ బాలుడి ఘటన గురించి అలాగే చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.