నిమ్మ‌కాయ బాబా గుప్త‌నిధుల కోసం ఏం చేశాడో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

398

కొంద‌రు మాయ‌గాళ్లు అమాయ‌క ప్ర‌జ‌ల‌ను ఈసీగా త‌మ బుట్ట‌లో వేసుకుంటారు.. అమాయ‌క ప్ర‌జ‌ల‌ను వారి ఇంద్ర‌జాలం మాయాజాలంతో సులువుగా త‌మ ట్రాప్ లోకి ప‌డేస్తారు.. ఇక వారు చెప్పిన మాట వింటే వారిలా మ‌నం కూడా మారిపోతాం, మాయాజాలం ఇంద్ర‌జాలం చేస్తూ కొంద‌రు బురిడీ కొట్టించే ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల మ‌రింత పెరిగిపోయాయి.. ఇప్పుడు ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో కొంద‌రు బురిడీ కొట్టించే విధానం మార్చుకుంటున్నారు…చిత్తూరు జిల్లాలో తాజాగా నిమ్మ‌కాయ బాబా బ‌య‌ట‌ప‌డ్డాడు,నిమ్మ‌కాయ‌తో స‌రికొత్త లీల‌లు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. మ‌రి క్షుద్ర‌పూజ‌లు చేస్తూ బురిడి కొట్టిస్తున్న ఇత‌గాడి చ‌ర్య‌లు చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. ఇప్పుడు అత‌గాడి నిమ్మ‌కాయ విద్య‌లు తెలుసుకుందాం.

చిత్తూరు జిల్లా త‌ల‌కోన అడ‌వుల్లో క్షుద్ర‌పూజ‌లు అంటూ హ‌డావుడి చేస్తున్నాడు ఈ మాయ‌గాడు, అలాగే ఇత‌గాడి ఇంద్ర‌జాలం తెలిస్తే షాక‌వుతారు, ప‌ల్లెటూరు కావ‌డంతో ఇక్క‌డ కొంద‌రిని త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో బురిడికొట్టించాల‌ని అనుకున్నాడు.. ఊట‌బావుల ప‌ల్లి ప్ర‌జ‌లు
గుప్త‌నిధుల కోసం క్షుద్ర‌పూజ‌లు చేస్తున్న ముఠాని ప‌ట్టుకుని పోలీసుల‌కు క‌బురుపంపారు చివ‌ర‌కు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

నేల‌పై ముగ్గు వెయ్య‌డం, అందులో ప‌సుపు కుంకుమ వేసి గాజులు నిమ్మ‌కాయ‌లు ఉంచ‌టం, ఆక‌ర్ష ఉటో ఉటో అంటూ ప‌దే ప‌దే అంటాడు ఈ స‌మ‌యంలో నిమ్మ‌కాయ పైకి గాలిలోకి లేస్తుంది, ఇక్క‌డ నుంచి త‌న క‌నిక‌ట్టు విద్య‌ని ప్ర‌ద‌ర్శిస్తూ అంద‌ర్ని ఆక‌ర్షిస్తాడు, అలా మ‌ళ్లీ డౌన్ డౌన్ అంటూ అరుస్తాడు.. ఆ స‌మ‌యంలో నిమ్మ‌కాయ కింద ప‌డిపోతుంది. ఈ క్షుద్ర‌పూజ‌లు చేస్తున్న వ్య‌క్తిని తిరుప‌తికి చెందిన ప‌ట్టాభిరెడ్డిగా గుర్తించారు. ఇత‌ను ఇలాగే ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి గుప్త‌నిధులు ఉన్న ప్రాంతాలు చెబుతాను అని పూజ‌లు చేస్తున్నాడు, తాజాగా
ఎర్రవారి పాలెం ద‌గ్గ‌ర పొలాల్లో నెర‌వాడు దేవారం గ‌ట్టు వెంక‌న్న ఆల‌యంలో క్షుద్ర‌పూజ‌లుచేశాడు.వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో గుప్త‌నిధులు కోసం త‌వ్వ‌కాలు జ‌రిపారు. ఇది గ‌మ‌నించిన గ్రామ‌స్తులు పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌డంతో వెంట‌నే పోలీసులు వీరిని ప‌ట్టుకున్నారు.. ఐదుగురు గుంపుగా ఉన్న వీరిలో ముగ్గురు పారిపొయారు. ఇద్ద‌రు మాత్ర‌మే పోలీసుల‌కు దొరికారు అని తెలుస్తోంది. వీరి నుంచి రాగి చెంబు, కుంకుమ భ‌రిణి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌తాయి అని చెప్పేవారితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని పోలీసులు చెబుతున్నారు. నిజంగా ఇలాంటి విద్యలు తెలిస్తే ఆ గుప్త‌నిధులు ఆ వ్య‌క్తి సంపాదించుకుంటాడు క‌దా, ఈ చిన్న‌లాజిక్ మిస్ అవుతున్నారు ప్ర‌జ‌లు, ఇది గుర్తించండి ఇలాంటి వారికి దూరంగా ఉండండి.