రాత్రి పూట నాఇంట్లో పడుకోవాలంటే భయమేస్తుంది..133 ఏళ్ళుగా ఉన్న దెయ్యం గురించి షాకింగ్ నిజాలు చెప్పిన కలెక్టర్

414

దెయ్యాలు ఉన్నాయా ? అంటే కొందరు అవును అంటారు… మరికొందరు లేవంటారు… ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కోలా ఉంటుంది. అయితే బాగా చ‌దువుకున్న వాళ్లు మాత్రం ఈదెయ్యాలు భూతాలు అంటే నాన్సెన్స్ ట్రాష్ అని కొట్టిపారేస్తారు… కాని తెలంగాణ‌లో అధికారుల్లో వణుకు పుట్టించే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కూడా ఈ దెయ్యాల బాధితురాలు అని ఆమె తాజాగా తెలియ‌చేశారు.. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా
ఈ విష‌యం కాస్త ఇంట్ర‌స్టింగ్ గా ఉంది అనే చెప్పాలి.

అస‌లు విష‌యం ఏమిటి అంటే కలెక్టర్ ఆమ్రపాలి మాత్రం తన ఇంట్లో దెయ్యం ఉందని చెబుతున్నారు. కలెక్టర్ ఇలా చెప్పడమేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం… అసలేం జరిగిందంటే…ఆగష్టు 10తో వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది రాయి వేసి 133 సంవత్సరాలు పూర్తయ్యాయట. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ తాను నివసిస్తున్న చారిత్రాత్మక భవనానికి అప్పట్లో జార్జ్ పామర్ అనే వ్యక్తి భార్య శంకుస్థాపన చేశారట. అయితే జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఆమ్రపాలి కలిగిందట. వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో అప్పట్లో జార్జ్ పామర్ ఒక గొప్ప ఇంజనీర్ అని తెలిసిందట. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారట.

అయితే ఇంతకుముందు అక్కడ పనిచేసిన కలెక్టర్లు ఈ భవనంలో మొదటి అంతస్థులో దెయ్యం ఉందని తనతో చెప్పారని, తాను కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాక చిందరవందరగా ఉన్న మొదటి అంతస్తులోని ఆ గదిని సర్ది పెట్టించానని ఆమ్రపాలి పేర్కొన్నారు. అయినా కూడా తనకు అక్కడ దెయ్యం ఉందనే భయం పోకపోవడంతో అక్కడ నిద్రించడానికి సాహసం చేయడం లేదని నవ్వుతూ తెలిపారు. అయితే ఇప్పుడు దెయ్యం ఉందంటూ ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే , ఆమె ఇక్కడికి కలెక్టర్‌గా వచ్చినప్పుడు.. త‌న‌కంటే ముందు పనిచేసిన కలెక్టర్లు ఫోన్ చేసి ఆమెని అభినందిస్తూ.. బంగ్లాలోని మొదటి అంతస్థులో దెయ్యం ఉందని చెప్పారట‌. అయితే, రాత్రిళ్లు పడుకోవాలంటేనే భయం వేసేద‌ని ఆమె తెలిపారు. బంగ్లా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, సమీపంలో పచ్చని బయళ్లు, ఉద్యానవనాలతో పాటు బంగ్లాలో దెయ్యాలు కూడా ఉండటం ఆనందంగా ఉందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆమె నిజంగా భ‌య‌ప‌డుతూ చెప్పారా, లేదా స‌రదాగా ఈ విష‌యాన్ని సంభాషించారో తెలియ‌దు కాని, ఆమె చేసిన వ్యాఖ్య‌లు మాత్రం వైర‌ల్ అవుతున్నాయి.