రోజూ భర్త అదే పనిగా చేస్తున్నాడు అని..అక్కడ కరెంట్ షాక్ పెట్టి దారుణంగా ఏం చేసిందో తెలిస్తే భార్య ను నరికేస్తారు

1107

సమాజం రోజురోజుకు ఎక్కడికి పోతుందో అర్థం కావడంలేదు.కొన్ని కొన్ని సంఘటనలు వింటుంటే ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు.ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు కూడా ఇదే మాట అంటారు.సమాజంలో రోజురోజుకు కట్టుకున్న భర్తలను చంపుతున్న ఆడవాళ్ళు ఎక్కువవుతున్నారు.అక్రమ సంబంధం కోసం కొందరు,భర్త పెట్టె చిత్ర హింసలకు తట్టుకోలేక కొందరు..ఇలా వివిధ కారణాల వలన చంపుతున్నారు.ఇప్పుడు మరొక భార్య తన భర్తను తన చేతులతోనే చంపేసింది.మరి ఎందుకు చంపింది ఎలా చంపిందో పూర్తీగా తెలుసుకుందామా.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని పెద్దనాగారం శివారు వస్రాంతండ పాశం బోడు గుట్టలో ఈనెల 10న గుర్తు తెలియని మృతదేహ అస్తి పంజరం వెలుగు చూసిన విషయం మనకు తెలిసిందే. కాగా, విచారణలో భాగంగా వరంగల్‌ ఫోరెన్సిక్‌ అధికారులు ఇచ్చిన క్లూస్‌ ఆధారంగా హత్య కేసు మిస్టరీని పోలీసులు 10 రోజుల్లో ఛేదించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం నిందితులను విలకేకరుల ఎదుట చూపించి వివరాలు వెల్లడించారు. నర్సింహులపేట మండలం ముంగిమడుగు శివారు లాలీతండాకు చెందిన గుగులోతు సురేష్‌(40) తో పెద్దనాగారం పరిధిలోని వస్రాతండాకు చెందిన సరితతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు అమ్ములు, అఖిల ఉన్నారు. కొన్ని రోజలు నుంచి సురేష్ భార్య సరితతోపాటు పిల్లలను చితకబాదడం, తాగిన మైకంలో కొన్ని సార్లు చంపడానికి ప్రయత్నించేవాడు.ఈ క్రమంలో ఎలాగైనా తాగుబోతు భర్త సురేష్‌ను హతమార్చాలని భావించిన సరిత మరిపెడ మండలంలోని వీరారం గ్రామానికి చెందిన జేర్పుల సుమన్‌, కురవి మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన బానోతు గణేష్ తో కలిసి పథకం రూపొందించుకున్నది. ఈ నెల 8న వస్రాంతండాకు సురేష్‌ను తీసుకువచ్చి ఫుల్‌గా మద్యం తాగించారు. విద్యుదాఘాతానికి గురిచేశారు. బండ రాళ్లతో తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం సమీపంలోని పాశంబోడు గుట్టల్లోకి మృతదేహాన్ని తీసుకువచ్చి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. తర్వాత సరిత ఇంటికి వెళ్లి యథావిథిగా పనులు చేసుకుంటోంది. మిగిలిన ఇద్దరు పరారయ్యారు.

సురేష్‌ తల్లిదండ్రులు కుమారుడి ఆచూకీ కోసం సరితను అడుగడంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానితులపై నిఘా పెట్టారు. ఈక్రమంలో మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద అనుమానితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఎస్సై సంతోష్ రావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. హత్య సమయంలో వాడిన ఇసుర్రాయి, బండరాయి, పెట్రోల్‌ బాటిల్‌, తాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో తొర్రూరు డీఎస్పీ రాజారత్నం, సీఐ చేరాలు, ఎస్సై బియ్యాన సంతోష్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.