మరో మహిళ మోజులో విడాకులివ్వాలనుకున్నాడు..కానీ భార్య పెట్టిన షరతుకు మనోడికి దిమ్మతిరిగిపోయింది..అదేంటో తెలుసా.?

760

ఇద్దరు భార్యాభర్తలు తమ పడక గదిలో మాట్లాడుకుంటున్నారు.అయితే భర్త మాట్లాడుతూ మాట్లాడుతూ భార్యకు ఒక విషయం చెప్పాడు.నాకు నీతో విడాకులు కావలి అని కోరాడు.అందుకే ఆమె ఎందుకు అని అడిగింది.నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా..నాకు నువ్వు వద్దు అన్నాడు.దానికి ఆ భార్య నవ్వింది.ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆమె ఏం చెప్పలేదు.మరుసటి రోజు ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది.

ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తనతో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమెని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది.అప్పుడు అతడు ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు.వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.

మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది.రెండవ రోజున , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది.ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది..తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు.మూడవ రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అమ్మాయితోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.నాల్గవ రోజు మరియు ఐదవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు.అయితే వీళ్ళను ఇలా చూసి వాళ్ళ కొడుకు తెగ ఆనందపడేవాడు.ఎందుకంటే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నట్టు ఆ పిల్లాడికి తెలియదు.ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది.అయితే ప్రతి రోజు తన భార్య పట్ల తన అభిప్రాయం మారుతూ వచ్చింది.ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అని ఆలోచించడం మొదలుపెట్టాడు.అతనికి తెలియకుండానే ఆమె మీద ప్రేమ పెరిగింది.చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది.ఆ తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆఫీస్ కు వెళ్ళినా కూడా భార్య గురించే ఆలోచించాడు.నేను చేస్తుంది తప్పు అని తెలుసుకున్నాడు.వెంటనే భార్యను కలవాలి అనుకున్నాడు.

అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే తీసుకెళ్ళాడు.తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.అప్పటికే ఆమె చనిపోయింది. ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్.. తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది.ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి.మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది.చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చూసి అయిన కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.