వివేకానంద‌రెడ్డి మ‌ర్డ‌ర్ కేసు పోలీసుల అదుపులో న‌లుగురు

236

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి సోదరులు ఆదివారం పులివెందులలోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ..’పోలీసులు పిలిస్తే డీఎస్పీ కార్యాలయానికి వచ్చాం. పోలీసులకు అన్నివిధాల సహకరిస్తాం. హత్య జరిగిన వెంటనే మేమంతా అక్కడికి వెళ్లాం. అక్కడ ఏమి జరిగిందనే అంశంపై ఆరా తీశారు. కేసులో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అన్యాయంగా వివేకాను చంపేశారు. ఆయన చాలా మంచివ్యక్తి’ అని అన్నారు.

Image result for ys vivekananda reddy

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కారు డ్రైవర్‌ ప్రసాద్‌ భార్య కృప చెప్పారు. వివేకా నివాసం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి తమ కుటుంబానికి ఎంతో సహాయం చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.గురువారం రాత్రి 11.45 గంటలకు తన భర్త ఇంటికొచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం వైఎస్‌ వివేకానందరెడ్డి అల్లుడు ఫోన్‌ చేసి సార్‌కు బాగాలేదు.. ఇంటి దగ్గరకు వెళ్లాలని చెప్పడంతో వెంటనే వెళ్లాడని ఆమె తెలిపారు. అంతేతప్ప.. లెటర్‌కు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌ రెడ్డి కూడా డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాగా ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారు, రక్తాన్ని తుడిచి వేయడం, మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూంకి ఎందుకు తెచ్చారు అనే కోణంలో ప్రశ్నించిన పోలీసులు…వీరందరి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఇక దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకోసం 12 బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి 

రాత్రి నుంచి ఉదయం 5.30 గంటల్లోపు ఏం జరిగి ఉంటుందనే దానిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు ఎస్పీ. ఇక ఆయ‌న మొబైల్ కు వ‌చ్చిన మెసేజ్ లు అలాగే కాల్స్ ప‌రిశీలిస్తున్నారు ఇంటి ప‌నిమ‌నుషులు డ్రైవ‌ర్ ప్ర‌సాద్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మ‌రో న‌లుగురిని అదుపులోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి విచార‌ణ జ‌రుపుతున్నారు అని తెలుస్తోంది. ఈ న‌లుగురు అనుమానితులు ప‌నిమ‌నిషి, ఆమె కుమారుడు, డ్రైవ‌ర్, పీఏని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట‌, దీనిపై అన్నికోణాల్లో విచార‌ణ జ‌రిపిన తర్వాత పూర్తి విష‌యాలు తెలియాల్సి ఉంది.