విశాల్ కాబోయే భార్యకు ఘోర అవమానం విశాల్ ను పెళ్లి చేసుకుంటునందుకు ఎలా తిడుతున్నారో తెలిస్తే షాక్

431

హీరో విశాల్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. హైదరాబాదీ అమ్మాయి అనిషా ఆళ్ల రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్టు హీరో విశాల్ ప్రకటించాడు.వీరి పెళ్లి మీద మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. కొందరు అభినందనలు తెలుపగా, మరికొందరు తమ నోటిదురుసును చేతివాటంతో ప్రదర్శించారు. పెళ్లి మీద రకరకాల కామెంట్స్ చేశారు. విశాల్‌తో పెళ్లి గురించి తప్పుడు కూతలు కూసిన నెటిజన్లపై అనిషా ధీటుగా సమాధానం ఇచ్చింది.మరి నెటిజన్లు ఏమన్నారు.. వారికి అనిషా ఏం సమాధానం ఇచ్చిందో తెలుసుకుందామా.

 

విశాల్‌తో ఎంగేజ్‌మెంట్ తర్వాత అనిషా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పెట్టింది. నా జీవితానికి సరైన మార్గాన్ని చూపించే వ్యక్తి లభించాడు. నిజమైన ప్రేమ, అనురాగంతో విశాల్‌ను కోరుకొన్నాను. స్వచ్చమైన ఆయన హృదయంలో చోటు సంపాదించుకోవాలని ఎదురుచూస్తున్నాను అని తన పోస్టులో అనిషా పేర్కొన్నది. ఇలా అనిషా పెట్టిన పోస్ట్ కు ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. నీవు డబ్బుతో ఎలాంటి బిచ్చగాడినైనా కొనుకోవచ్చు. విశాల్‌ను వదిలేసేయ్. అలాంటి హీరోను డబ్బు ఆశజూపి పెళ్లి చేసుకోవడం సిగ్గులేదా అని దారుణంగా ట్రోల్ చేశాడు. దాంతో అనిషాకు చేదు అనుభవం ఎదురైంది. తమ పెళ్లిపై వచ్చిన దారుణమైన కామెంట్‌పై అనిషా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. డబ్బు కోసం నా ప్రేమలో పడ్డారని నువ్వు అనుకోవడం దారుణం. విశాల్‌పై దారుణంగా కామెంట్స్ చేయడం చూస్తే నీకు ఆయనపై గౌరవం లేదు. జీవితంపై కొన్నిసార్లైనా నమ్మకం పెంచుకో. మా బంధం చిరకాలం సాగుతుంది. నీవు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకో అని అనిషా అన్నారు.

అనిషాపై దారుణమైన కామెంట్లు చేయడంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని ఊహించలేదు. విశాల్‌కు సమస్య లేనప్పుడు నీ బాధ ఏంటి? ఒకరిని మరొకరు ఇష్టపడ్డి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. నీకు అలాంటి కామెంట్లు చేయడానికి నీకున్న అర్హత ఏంటి అని ఓ నెటిజన్ నిలదీశాడు. విశాల్, అనిషా జంటపై మరో నెటిజన్ నోరు పారేసుకొన్నాడు. మీ ఇద్దరి జంట చూడటానికి దారుణంగా ఉంది. నీకు విశాల్ సూట్ కాడు. నీవంటే నాకు అసలు ఇష్టం లేదు. ఐ హేట్ యూ అంటూ నెటిజన్ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించాడు. అందుకు సమాధానంగా అనిషా థాంక్యూ అంటూ కామెంట్ చేసింది. ఇలా పెళ్ళికి ముందే విశాల్ అభిమానుల నుంచి అనీషాకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చూడాలి మరి ఈ మాటల యుద్ధం ఎక్కడికి వెళ్తుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. విశాల్ అనిషా పెళ్లి గురించి అలాగే అనీషాకు ఎదురవుతున్న అవమానాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.