అక్కడ తొలిరాత్రి కన్యత్వ పరీక్ష..ఆమెకు ర‌క్తం రాక‌పోతే ఏం చేస్తారో తెలిస్తే షాకవుతారు

2334

మ‌న దేశంలో సంప్ర‌దాయాలు విలువ‌లకు క‌ట్టుబాట్ల‌కు పెద్ద పీట వేస్తాం.. అనేక మ‌తాలు కులాలు వారి క‌ట్టుబాట్ల ప్ర‌కారం వారి జీవ‌నం చేస్తూ ఉంటారు. ఇక ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా చేసే ప్ర‌తీ ప‌నిని ఆలోచించి చేస్తాం. ఇక పెళ్లి అయిన త‌ర్వాత అనేక‌చోట్ల వారి ఆచారాల ప్ర‌కారం మొద‌టిరాత్రి జ‌రుగుతుంది.. కొంద‌రు నాలుగుగోడ‌ల మ‌ధ్య చేసుకుంటూ ఉంటే మరికొంద‌రు ఇరుకుటుంబ స‌భ్యుల‌ స‌మ‌క్షంలో చేసుకునే వారు కొంద‌రు ఉంటారు… ఇలాంటి కొన్ని తెగ‌లు వారి సంస్కృతి ఆచారాల్లో భాగంగా ఇంకా పాటిస్తూ ఉంటారు. అయితే మహారాష్ట్రలోని ఓ సంచార జాతి పాటిస్తున్న ఈ అనాగ‌రిక ఆచారానికి ముగింపు కావాల‌ని కోరుతున్నారు ఓ సారి ఆ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం.

Image result for virgin test for female at home

మహారాష్ట్రలోని ఓ సంచార జాతిలో నూతన వధువులకు ‘కన్యత్వ’ పరీక్షలు చేసే అనాగ‌రిక ఆచారం జ‌రుగుతోంది… మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కంజర్భట్ వర్గంలోని ఏ మహిళ అయినా ఈ అనాగ‌రిక ప‌రీక్ష‌ను ఎదుర్కొన్నాము అని చెబ‌తారు….పెళ్లైన తొలిరోజే శీలవతా? కాదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బలవంతంగా కన్యత్వ పరీక్ష ను ఇక్క‌డ ఎదుర్కుంటున్నారు…ఈ వర్గంలోని ప్రతి మహిళ పెళ్లైన రోజున ఈ పరీక్ష ఎదుర్కోవాల్సిందే. అది గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే జరుగుతుంది.వివాహం అయిన రోజే కొత్త దంపతులకు తెల్లని వస్త్రం బెడ్ షీట్ ఇచ్చి ఓ హోటల్ గదిలోకి పంపిస్తారు. ఆ గది అద్దెను గ్రామ పంచాయతీ లేదా అమ్మాయి, అబ్బాయి కుటుంబాలు చెల్లిస్తాయి….గదిలో కొత్త దంపతులు శృంగారంలో పాల్గొని బయటకు వచ్చేవరకు ఇరువురి కుటుంబ సభ్యులు.. గ్రామ పంచాయతీ సభ్యులు బయటే వేచిచూస్తుంటారు…సంభోగం సమయంలో వధువుకు రక్తస్రావం అయితే ఆమెను కన్యగా పరిగణిస్తారు, లేదంటే ఆమె తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

Image result for virgin test for female at home

తన భార్య కన్యత్వాన్ని నిరూపించుకోలేకపోయింది అంటూ పురుషులు తమ వివాహాలను రద్దు చేసుకుంటారు.. ఇలా చాలా జ‌రిగాయి….అంతేకాదు.. ఆ మహిళను బహిరంగంగానే చిత్రహింసలకు గురిచేస్తారు. హేయమైన ప్రశ్నలు వేసి మానసికంగా హింసిస్తారు. తమ ‘పరువు’ తీశావంటూ కుటుంబ సభ్యులు కొడతారు. ఇక్క‌డ ఎంద‌రు వ‌చ్చి ఇది అంతా అపోహ అని చెప్పినా వారు ప‌ట్టించుకోవ‌డం లేదు.. తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళలకు రక్తస్రావం తప్పనిసరిగా అవుతుందన్నది అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.శృంగార అనుభవం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. తొలిరాత్రి రక్తస్రావం అయితేనే ఆమె కన్య అని చెప్పడం పూర్తిగా మూఢనమ్మకమే ఇది గుర్తు ఉంచుకోవాలి.

తొలి రాత్రి గ్రామ పంచాయతీ పెద్దల ముందు ఆమె భర్తని ప‌లు ప్ర‌శ్న‌లు అడుగుతారు.. తెల్ల‌టి వ‌స్త్రం చూపించ‌మ‌ని అడుగుతారు.. భ‌ర్త‌ తెల్లటి వస్త్రాన్ని చూపిస్తారు.. దానికి రక్త‌పు మ‌ర‌క‌లు ఉంటే ఆమె క‌న్య అని, లేక‌పోతే ఆమె క‌న్య కాదు అని అక్క‌డ గ్రామ‌పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకుని ఆమెకు శిక్ష విధిస్తారు.. భ‌ర్త ఇష్టం ఉంటే ఏలుకోవ‌చ్చు లేక‌పోతే విడిపోవ‌చ్చు. ఇక ఆమెను ఏ పేరంటానికి ఏ కార్య‌క్ర‌మానికి ఏ పెళ్లికి పిల‌వ‌రు.. ఆమె ఇంటికి ఎవ‌రూ వెళ్ల‌రు…ఆ కులస్థులు ఎవ‌రూఆమెతో మాట్లాడ‌రు. చూశారుగా ఇలాంటి దారుణ‌మైన ఆచారాలు పాటించేవారు ఉన్నారు. వీటిని ఎట్టిప‌రిస్దితుల్లో హ‌ర్షించకూడ‌దు… ఈ దురాచారం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.