విరాట్ కోహ్లీ ఒక్క రోజు తిండికి ఎంత ఖర్చు పెడతాడో తెలిస్తే షాక్ అవుతారు

410

విరాట్ కోహ్లి. చేజింగ్ వీరుడు. ఇండియ‌న్స్‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా కూడా విరాట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలుసు. అటు మైదానంలోనే కాదు, బ‌యటి ప్ర‌పంచంలో త‌న ప్రేయ‌సి అనుష్క శ‌ర్మ‌తో ఉంటూ విరాట్ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటాడు.అయితే ఇంత‌కీ ఇప్పుడు విష‌యం ఏమిటంటే… మైదానంలో బాగా యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్ ప‌రంగా కూడా కేక పుట్టించే విరాట్ కోహ్లి అస‌లు డైట్ ఏమిటో తెలుసా..? నిత్యం కోహ్లి బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, డిన్న‌ర్‌ల‌లో ఎలాంటి ఆహారం తీసుకుంటాడు, అత‌ని ఫిట్‌నెస్ కు కార‌ణ‌మైన డైట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లి బ్రేక్‌ఫాస్ట్‌ను ఆమ్లెట్‌తో మొద‌లు పెడ‌తాడు. అది కూడా కోడిగుడ్ల‌కు చెందిన 3 తెల్ల‌ని సొన‌లు, ఒక పూర్తి ఎగ్ క‌లిపి తయారు చేసిన పెద్ద ఆమ్లెట్‌ను అత‌ను తింటాడు. ఆ త‌రువాత న‌ల్ల‌మిరియాలు, చీజ్‌ల‌ను క‌లిపి వండిన పాల‌కూర తింటాడు. అనంత‌రం స్మోక్డ్ సాల్మ‌న్ (చేప వంట‌కం), గ్రిల్డ్ బేక‌న్ (మాంసం వంట‌కం) తింటాడు. అనంత‌రం బొప్పాయి పండు, పుచ్చ‌కాయ‌, డ్రాగ‌న్ ఫ్రూట్స్ తింటాడు. ఆ త‌రువాత చీజ్ ను మ‌ళ్లీ కొంత విడిగా తింటాడు. అనంత‌రం గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ తీసుకుంటాడు. అది కూడా పీన‌ట్ బ‌ట‌ర్‌తో. దాని త‌రువాత నిమ్మ‌ర‌సం పిండిన గ్రీన్ టీ తాగుతాడు. దీంతో బ్రేక్‌ఫాస్ట్ ముగుస్తుంది.

ఇక మ‌ధ్యాహ్నం లంచ్ విష‌యానికి వ‌స్తే కోహ్లి గ్రిల్డ్ చికెన్‌, మాష్డ్ పొటాటోస్‌, పాల‌కూర‌, ఇత‌ర కూర‌గాయ‌ల‌ను తింటాడు. మ‌ధ్యాహ్నం భోజ‌నాన్ని చాలా సింపుల్‌గా కానిచ్చేస్తాడు కోహ్లి. ఇక రాత్రి డిన్న‌ర్‌లో కేవ‌లం సీఫుడ్ మాత్ర‌మే తింటాడు. అది కూడా త‌న‌కు ప‌ట్టినంత తింటాడు. అందులో మొహ‌మాటం ఏమీ ఉండ‌దు. చేప‌లు, రొయ్య‌లు, పీత‌లు ఇలా అన్ని ర‌కాల సీ ఫుడ్ ను కోహ్లి రాత్రి పూట డిన్న‌ర్‌లో తింటాడు. ఇక అప్పుడ‌ప్పుడు చీట్ డే అని పాటిస్తాడు కోహ్లి. ఆ రోజున ఆహారంలో డైట్ పాటించ‌డు. ఏది తినాల‌నుకుంటే అది తినేస్తాడు కోహ్లి. కొవ్వు, క్యాల‌రీలు అని చూడ‌డు. అందులో భాగంగానే చీట్ డే రోజున కోహ్లి త‌న‌కెంతో ఇష్టమైన చోళే మ‌సాలా తింటాడు. అది కూడా పూరీల‌తో..ఇదీ విరాట్ కోహ్లి డైట్‌..ఇంత మొత్తాన్ని కోహ్లీ ఒక్కరోజులోనే ఖర్చు చేస్తాడంటే ఆయన సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సంవత్సరానికి ఆయన ఆదాయం అన్ని విధాలా లెక్కగడితే 116 కోట్లు ఉంటుందట. ఆదాయం వస్తుంది కదా అని ఆటను మాత్రం అశ్రద్ధ చేయడు కోహ్లీ. ఆ తపనే అతడ్ని ఈ తరంలో తిరుగులేని బ్యాట్స్ మన్‌గా నిలుపుతోందని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. విరాట్ కోహ్లీ గురించి అలాగే ఆయన డైట్ లో తినే ఆహార పదార్థాల కోసం అయ్యే ఖర్చు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.