జడ్చర్లలో పిల్లాడు స్కూల్ కు వెళ్లలేదని డయల్ 100 కి ఫోన్

177

ఏదైనా ఆపద వస్తే పోలీసులకు ఫోన్ చేయమని చెబుతారు, ఏదైనా చిన్న అపాయం వచ్చినా ఎవరినుంచి ధ్రెట్ ఉంది అని తెలిసినా వెంటనే మనం ఫోన్ చేసేది పోలీసులకే. చాలా ఏళ్ల క్రితం నుంచి చూసుకుంటే, మనకు ల్యాండ్ లైన్ ఫోన్ సౌకర్యం ఉన్న సమయంలో ఈ డయల్ 100 కు రోజూ కొన్ని వేల ఫోన్లు వచ్చేవి. ఇంట్లో చిన్న పిల్లలు తెలియక చేసిన ఫోన్లు చేశారనో, లేకపోతే పొరపాటున వచ్చిందనో ఏవో సిల్లీ రీజన్స్ చెప్పేవారు. ఇలా అనేకసార్లు పొరపాటున 100 కు రోజూ కొన్నివేల ఫోన్ కాల్స్ వచ్చేవి. అని పోలీసు బాస్ లు చెప్పేవారు. కాని ఇప్పుడు అంతా టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆన్ లైన్ లోనే పోలీసులకు కంప్టైంట్స్ ఇస్తున్నారు.. 24 గంటల్లోనే పోలీసులు కూడా దానిని పరిష్కారంచేస్తున్నారు.

Image result for జడ్చర్లలో పిల్లాడు స్కూల్ కు వెళ్లలేదని డయల్ 100 కి ఫోన్

ఆపదలో ఆదుకునే ఆ నంబరును కొందరు అమయాకత్వంతో ఎలా వాడుకుంటున్నారో చెప్పే తాజా ఉదంతం ఇది అని చెప్పుకోవాలి. పోలీసులు కూడా ఇదేమి వింత అని ఆశ్చర్యపోయారు. స్కూలుకు వెళ్లకుండా మారాం చేస్తున్నాడంటూ తన కొడుకు గురించి ఓ మహాతల్లి ఏకంగా 100కు డయల్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. తన కొడుకు సతాయిస్తున్నాడని, తక్షణమే వచ్చి సాయం చేయాలని కోరింది. పెట్రోలింగ్ పోలీసులు ఏం జరిగిందో ఏమోనని హుటాహుటిన అక్కడికి చేరుకుని విషయం తెలుసుకుని తలపట్టుకున్నారు. జడ్చర్ల పట్టణంలో ఈరోజు జరిగిందీ తతంగం. పోలీసులు వచ్చాక వారితో తల్లి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

స్కూలుకు పోకపోతే 100కు కాల్ చేస్తావా?’ అని పోలీసులు అడగ్గా, ‘ఏం చేస్తాం సార్. అస్సలు పోవట్లేదు.. ’ అని తల్లి చెప్పుకొచ్చింది. పోలీసులు మొదట విసుక్కున్నా, తర్వాత నవ్వుకుని అబ్బాయికి నాలుగు మంచి మాటలు చెప్పి బడికి పంపారు. ఈ వీడియోపై బోలెడు జోకులు పేలుతున్నాయి. పోలీసులు ఇలాంటివాటికైనా పనికొస్తున్నందుకు సంతోషంగా ఉందని కొందరు సటైర్లు వేస్తుండగా, విలువైన పోలీసులు సమయాన్ని ఇలా వృథా చేయడం సరికాదని కొందరు అంటున్నారు. అయితే ఆమెకు నిజంగా ఇలాంటి ఆలోచన వచ్చిందా లేదా సరదాగా ఆటపట్టించేందుకు ఇలా చేశారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.పోలే మన దేశంలో ఇలా చేస్తే చేశారు కాని కొన్ని దేశాల్లో ఇలా చిన్న విషయాలకు పోలీసులకి ఫోన్ చేసి విసిగిస్తే వారికి సంవత్సరం పాటు జైలు శిక్ష అట. మన వ్యవస్ధలో ఇలాంటివి ఏమీ లేదు అని చెబుతున్నారు న్యాయనిపుణులు. మరి ఆమె ఆలోచన పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.