కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఈ తల్లి ఎంతటి ఘోరం చేసిందో తెలిస్తే షాక్…

639

ప్రేమ అనేది గొప్పది.అందులో ఎలాంటి సందేహం లేదు.కానీ ప్రేమ కోసం కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.అది చాల పెద్ద తప్పు.ప్రేమికులు తొందరపడి చేసే కొన్ని పనుల వలన చాలా మంది జీవితాలు తారుమారు అవుతాయి.ముఖ్యంగా తల్లిదండ్రుల జీవితం.ఇప్పుడు ఇద్దరు ప్రేమికులు చేసిన ఒక పనికి అమ్మాయి తల్లి చెయ్యకుడని పని చేసింది.చివరికి వాళ్ళ జీవితం కూడా నాశనం అయ్యింది.మరి ఏం జరిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

Related image

కర్ణాటక లోని తుమ్మకూర్ జిల్లాని హలలూర్ కు చెందిన శాంతమ్మకు దివ్య అనే కూతురు ఉంది.అయితే దివ్య అదే గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తిని ప్రేమించింది.అయితే కొంతకాలం చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు.అయితే ఈ మద్యనే వీళ్ళ ప్రేమ గురించి ఇంట్లో తెలిసింది.ఇద్దరి ఇళ్ళలో వీళ్ళ ప్రేమను అంగీకరించలేదు.గొడవలు అయ్యాయి.ఇక వారి ప్రేమను పెద్దలు అంగీకరించరు అని నిర్దారించుకుని వేణు దివ్య ఊరి నుంచి పారిపోయి కగ్గలిపురలో శశి అనే స్నేహితుడి ఇంట్లో తల దాచుకున్నారు.అక్కడే ఉన్న ఆలయంలో ప్రేమ వివాహంచేసుకున్నారు.ఈ విషయాన్ని ఇద్దరి తల్లిదండ్రులకు ఫోన్ ధ్వారా సమాచారం ఇచ్చారు.ఈ విషయం తెలిసి దివ్య తల్లి శాంతమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Image result for indian lady suicide

చికిత్స పొందుతూ శాంతమ్మ మృతి చెందింది.మృత దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.వేణు ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి శాంతమ్మ బంధువులు ఆందోళన చేశారు.ఈ విషయం తెలుసుకున్న వేణు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో హలలూర్ సీఐ అక్కడికి చేరుకొని శాంతింప జేశారు. ఈసందర్భంగా సీఐకి, బాధితురాలి బంధువులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని సీఐ హమీనివ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా అసుపత్రికి తరలించారు. పోలిసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తన చావుకు కారణం వీళ్ళే అని పలువురి పేర్లను సూసైడ్ నోట్‌లో రాసి శాంతమ్మ బలవన్మరణానికి పాల్పడింది. నా చావుకు కారణం నా కూతురు వేణు అలాగే వాళ్ళకు షెల్టర్ ఇచ్చిన శశి అని రాసి చనిపోయింది.అయితే తల్లి మరణ వార్త విన్న దివ్య తట్టుకోలేపోయింది.అర్థం చేసుకుంటారేమో అనుకున్నాం కానీ ఇలా చనిపోతుంది అనుకోలేదు అని భర్త వేణు దగ్గర ఏడ్చింది.ఇద్దరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.అయితే బంధువులు వాళ్ళను ఏమైనా చేస్తారేమో అని భయపడి ఈ నవ దంపతులు ఇద్దరు శశి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోద్ చేశారు.విన్నారుగా తొందరపడి పారిపోయి పెళ్లి చేసుకుని తల్లిని బలి తీసుకున్నారు.చివరికి వాళ్ళు చనిపోయారు.ఒక్క పని వలన ఎంతటి అనార్ధం జరిగిందో.కాబట్టి ప్రేమికులు ఏదైనా చేసే ముందు ఆలోచించండి.మరి ఈ ఘటన గురించి అలాగే ప్రేమికులు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడుతున్న బాధల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.