ఐదునెలల పిండం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆ యువ‌తి ఏం చేసిందో తెలిస్తే ఖంగుతింటారు

559

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓ యువ‌తి చేసిన ప‌నికి, పోలీసులు, అక్క‌డ ప్రాంతంలో నివ‌సించే వారు, ఓ గంట పాటు ఎటువంటి మాట మాట్లాడ‌లేక నిల‌బ‌డిపోయారు.. ఇంతకి ఆ యువ‌తి చేసిన ప‌ని ఏమిటో తెలిస్తే మీరు అలాగే షాక్ కు గురి అవుతారు….ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ ప్రాంతానికి చెందిన ఈ యువతి గత ఆర్నెళ్లుగా ఓ యువకుడితో సహజీవనం చేస్తోంది.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా కలవడంతో యువతి గర్భం దాల్చింది.. అయితే గ‌ర్బం రావ‌డంతో ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని ఆ యువ‌తి భ‌య‌ప‌డింది.. ఇక అత‌న్ని పెళ్లి చేసుకోవాలి అని కోరింది.. దీనికి ఆ యువ‌కుడు ఓ కండిష‌న్ పెట్టాడు.. ఇప్పుడు నువ్వు గ‌ర్బం తీయించుకో త‌ర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.

Image result for women went to police station with 5 months fetal

దీంతో ఆ యువ‌కుడి మాట‌లు ఆమె న‌మ్మింది.. ఆమెకు గ‌ర్బనిరోధ‌క మాత్ర‌లు ఇచ్చి ఆమెను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి అబార్ష‌న్ చేయించాడు ఆ యువ‌కుడు..ఇదంతా అయిపోయిన తర్వాత కూడా తనను పెళ్లి చేసుకోవాలని కోరగా యువకుడు పట్టించుకోకపోగా.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు… ఇక త‌న‌ని ఆ యువ‌కుడు మోసం చేశాడు అని తెలుసుకుంది… ఇక త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేక‌పోయింది.. ఏమీ పాలుపోక అత‌ను చేసిన ప‌నికి ఆమె కుంగిపోయింది.

Image result for women went to police station with 5 months fetal

దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ యువతి అబార్షన్ చేసి తీసిన ఐదు నెలల పిండంను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది… బాధితురాలు సంచికి తీసుకొని రావడంతో అందులో ఏముందని ఓపెన్ చేయగా పిండంను చూసి పోలీసులు కంగుతిన్నారు… ఇలా చేసినందుకు ముందు ఆమెకు చివాట్లు పెట్టారు.. ఇలా మోసం చేసిన వాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాల‌ని ఇలా అబార్ష‌న్ చేయించుకోవ‌డం పై పోలీసులు ఆమెను నిల‌దీశారు… ఇక ఆ యువ‌తి త‌న‌ని న‌మ్మ‌రు అనే ఉద్దేశ్యంతో ఇలా పిండం తీసుకువ‌చ్చాను అని, త‌ల్లిదండ్రులు చెప్పిన‌ట్లు ఇంకో పెళ్లి చేసుకోవ‌డానికి ఆయువ‌కుడు రెడీ అవుతున్నాడు అని పోలీసుల‌కు తెలియ‌చేసింది.

 

దీంతో వెంట‌నే పోలీసులు ఆ యువ‌కుడిపై కేసు న‌మోదుచేశారు.. ఇక ఆమెకు మ‌హిళా సంఘాలు కూడా తోడ‌య్యాయి ఆమెకు న్యాయం చేయాలని, ఆ బాధితురాలికి యువ‌కుడికి పెళ్లి చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు…. ఇక ఆ యువ‌కుడు ఇప్ప‌టికే ప‌రార‌య్యాడు.. అత‌న్ని వెత‌క‌డానికి పోలీసులు రంగంలోకి దిగారు…..ఈ ఏడాది ప్రారంభంలో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి దారుణమే జ‌రిగింది… ఓ మహిళ ఇలాగే తనను కిడ్నాప్ చేసి రేప్ చేశారని పిండంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది… ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రగ‌డం పై అమ్మాయిలు జ‌ర‌జాగ్రత్త‌గా ఉండాలి అని ఓ హెచ్చ‌రిక‌లుగా భావించాలి.. చూశారుగా ఇలాంటి వారి నుంచి జాగ్ర‌త్త‌..