Breaking News:జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ ఆత్మహత్యాయత్నం… షాక్ లో సుధీర్,శ్రీను

475

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అవ్వడంతో తమకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పెడుతున్నారు.అయితే కొందరు సెలెబ్రిటీలు కూడా తమకు సంబందించిన పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు దగ్గర అవుతున్నారు.ఇక మరికొందరు అయితే ఫన్నీ చేస్తూ పెడుతున్న వీడియోలు అయితే అందరికి ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ పెట్టిన ఒక వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.మరి ఆ వీడియో గురించి తెలుసుకుందామా.

ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతూ రోజురోజుకు ,మంచి క్రేజ్ తో దూసుకెళ్ళిపోతున్న షో జబర్దస్త్.తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో ఇంకోటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .ఇక ఈ షో మొదలైన తరువాత తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త కమెడియన్స్ దొరికారు. చాలా మంది ఆర్టిస్ట్ లకి ఈ షో నే లైఫ్ ఇచ్చింది.అయితే ఈ షో ద్వారా పాపులర్ అయినా చాలా మంది మంచి మంచి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఎప్పటికప్పుడు తమ అభిమానులకు దగ్గర అవుతున్నారు.ఇక జబర్దస్త్ లో తన పంచులతో వెనుక వచ్చే ఆటో సౌండ్ తో బాగా పాపులర్ అయినా ఆటో రామ్ ప్రసాద్ తన సోషల్ సైట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రజలను ఆందోళన కలుగజేసింది.పూర్తీ వీడియో చూస్తేగానీ అది ఒక ఫన్నీ వీడియో అని అర్థం కాదు.

రామ్ ప్రసాద్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే…రామ్ ప్రసాద్ కు ఆది నుంచి సుదీర్ నుంచి ఫోన్ వస్తుంది.ఏంటి నేను మళ్ళి స్కిట్స్ రాయాలా.ఇప్పటికే జబర్దస్త్ లో స్కిట్స్ పంచు డైలాగ్స్ రాసి నా పని పూర్తీగా అయిపోయింది.ఇక మరొక స్కిట్ లోకి డైలాగ్స్ రాయాలంటే నా వల్ల కాదు.ఇక నేను బతకలేనని పక్కనే ఉన్న బావిలో దూకుతాడు.అది చుసిన వెంటనే మనకు కొంత భయమేస్తుంది. ఒక 10 సెకండ్స్ తర్వాత చూస్తే అది నిజమైన బావి కాదని అది షూటింగ్ కోసం ఏర్పాటుచేసిన డమ్మీ బావి అని అర్థం అవుతుంది.కెమెరా బావిలోకి చూపించడంతో అందులో రామ్ ప్రసాద్ ఫోన్ వాడుతున్నట్టు కనిపిస్తుంది.ఏరా ఏంట్రా ఇది అంటే…ఏం లేదురా అందరిని ఫన్నీగా నవ్విద్దామని ఇలా ఫన్నీ వీడియో చేశానని చెప్పడంతో అందరు ఊపిరి పీల్చుకుంటారు.ప్రస్తుతం రామ్ ప్రసాద్ పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇలా అప్పుడప్పుడు సెలెబ్రిటీలు ఫన్నీ వీడియోలు పెట్టి అభిమానులకు బాగానే టచ్ లో ఉంటున్నారు.