పెళ్లి పీటలపై అన్నను పక్కకి తోసి వధువుకు తాళి కట్టిన పెళ్ళికొడుకు తమ్ముడు.. తర్వాత ఏమైందో తెలిస్తే

622

పెళ్లి అనేది ఒక మధుర ఘట్టం.ఆ క్షణం కోసం 25 ఏళ్ల నుంచి వెయిట్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు.పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అందరు భావిస్తారు.అయితే కొన్ని పెళ్లిళ్లు పెళ్ళిపీటల వరకు వచ్చి ఆగిపోతాయి.ఆ సమయంలో పెళ్లి కొడుకు గానీ పెళ్లి కూతురు గానీ పడే బాధ అంతాఇంతా కాదు.అయితే అలా పెళ్లి ఆగిపోడానికి కారణం ఎవరో అయితే భాద ఎక్కువగా ఉండదు.కానీ సొంత వాళ్ళ వల్లనే పెళ్లి ఆగిపోతే ఆ బాధ పడేవాళ్ళకే తెలుస్తుంది.ఇప్పుడు ఇలాంటి భాదనే ఒక పెళ్లి కొడుకుకు వచ్చింది.సొంత తమ్ముడి వలనే అన్నయ్య పెళ్లి ఆగిపోయింది.అంతేనా ఇక్కడ ఒక భయంకరమైన షాకింగ్ విషయం ఉంది.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for wedding images

తమిళనాడులోని వెల్లురు జిల్లా తిరుపత్తూరు తాలుకా సెల్లరపట్టి గ్రామానికి చెందిన కామరాజ్‌ కు ముగ్గురు కుమారులు రంజిత్, రాజేష్, వినోద్‌ ఉన్నారు. వీరిలో రాజేష్, వినోద్‌ తిరుప్పూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.పెద్ద కొడుకు రంజిత్ కు ఇప్పటికే పెళ్లయింది. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్‌కు మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు.ఇరు కుటుంబాలలో పెళ్ళికి ఎవరికీ అభ్యంతరం లేదు.ఇక పెళ్లి సమయం దగ్గర పడటంతో పెళ్లి పనులన్నీ కంప్లీట్ చేశారు.అన్నయ్య పెళ్లి కదా అని తమ్ముడు కూడా పెళ్లి పనులు చాలా హుషారుగా చేశాడు.ఇక అందరు అనుకున్న ముహూర్తం వచ్చింది.గురువారం ఉదయం దగ్గరలోని మురుగన్‌ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు చేసారి ఇరు కుటుంబాలు.పెళ్లి సమయం ఆసన్నమైంది.బంధువులు అందరు వచ్చారు.ఇక తనకు పెళ్లవుతుందని రాజేష్ లోపలలోపల మురిసిపోతున్నాడు.అయితే ఆ మురిపం ఎక్కువసేపు ఉండదని రాజేష్ గ్రహించలేకపోయాడు.తన సంతోషాన్ని తన తమ్ముడే దూరం చేస్తాడని అస్సలు అనుకోలేదు.పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో తాళి కట్టమని పంతులు చెప్పడంతో పెళ్లి పీటలపై కూర్చున్న రాజేష్ వధువు మెడలో మంగళ సూత్రం కట్టడానికి లేస్తుండగా పక్కనే ఉన్న అతని తమ్ముడు వినోద్‌, అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు.దీంతో అక్కడున్నవారంత అవాక్యయ్యారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అసలు ఏమైందో ఒక్క క్షణం ఎవరికీ అర్థం కాలేదు.పెళ్లి కొడుకు తమ్ముడే ఇలా చెయ్యడం అందరిని షాక్ కు గురి చేసింది.వెంటనే కోపోద్రికులు అయినా వధువు బంధువులు వినోద్‌పై దాడిచేసి పిడిగుద్దులు కురిపించారు.అయితే అందరి కోపం తీరాకా తల్లితండ్రులు అసలు విషయం కనుక్కోగా రాజేష్‌కు పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడే తనకు వధువు పరిచయం అయ్యిందని, అప్పటి నుండి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపాడు వినోద్. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది.ఈ పెళ్లి ఆ అమ్మాయికి కూడా ఇష్టం లేదని పారిపోయి పెళ్లి చేసుకోవడం మాకిష్టం లేదని అందుకే ఇప్పుడు ఇలా చేశామని వినోద్ చెప్పాడు. దీంతో పెళ్లి పీటలపై ఉన్న పెళ్లి కుమార్తెను చితక బాదారు. వరుడు రాజేష్‌ ఆవేదనకు గురై కంటతడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.చివరికి చేసేదేమిలేక ఆ ఇద్దరు నవదంపతులు ఆశిర్వదించారు.ఈ ఘటన ఒక్క తమిళనాడులోనే కాదు దేశం మొత్తం వైరల్ అయ్యింది.విన్నవాళ్ళు ఇదేమి చోద్యంరా నాయనా అని అనుకుంటున్నారు.ఈ వార్త విన్నాకా మీకు కూడా అలాగే అనిపించింది కదా.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.అన్నాను నెట్టేసి వధువు మెడలో తాళి కట్టిన తమ్ముడి ఘటన గురించి అలాగే అన్న కోసం చుసిన అమ్మాయిని ప్రేమించి అన్న సంతోషంలో నిప్పులు పోసిన ఆ తమ్ముడి గురించి అలాగే ఇలా పెళ్లి మండపంలో షాక్ లు ఇచ్చే పెళ్లి కొడుకు పెళ్లి కూతుళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.