ఫేస్ బుక్ లో త‌న‌ కూతురిపై అస‌భ్య పోస్టులు పెట్టాడ‌ని అమ్మాయి త‌ల్లి ఏం చేసిందో చూస్తే మ‌తిపోవ‌డం ఖాయం

337

సోష‌ల్ మీడియాలో త‌మ భావాలు చెప్ప‌డం అనేది ఈ రోజుల్లో కామ‌న్ అయిపోయింది.. అయితే అవ‌త‌ల వారి మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే విధంగా ఉంటే పోలీసు స్టేష‌న్ల వ‌ర‌కూ కూడా వెళుతున్నాయి అలాంటి కామెంట్లు.. తాజాగా ఇలాంటి ఓ ఘ‌ట‌న చిత్తూరులో క‌ల‌క‌లం రేపింది.చిత్తూరులో ఫేస్ బుక్‌లో అశ్లీల పోస్టు చేసినందుకు గొడవపడిన కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు పోలీసులు… చిత్తూరు పట్టణములో సాధిక్ అనే అబ్బాయిని మిట్టూరులో నివాసముంటున్న ఒక మహిళ ఆమె కుమారుడు ఫేస్ బుక్‌లో ఒక అమ్మాయి గురించి అశ్లీల పోస్టులు చేసినందుకు ఇంటికి పిలిపించి తీవ్రంగా కొట్టారు… ఆ తరువాత ఆమె కుమారుడు, అతని మిత్రులు మిట్టూ లోని ఒక కళ్యాణ మండపం వద్దకు తీసుకొని వెళ్లి చితకబాదారు.

Image result for fb

ఈ కేసు విషయంలో చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయింది.. ఈ కేసుకు సంబంధించిన 9 మందిలో ఏడు గురినిపోలీసులు అరెస్ట్ చేశారు.. అందులో ముగ్గ‌రు మేజర్లు ఉండడం వలన JFCM కోర్టులో హాజరుపరిచారు.. వీరిలో మిగిలిన నలుగురు మైనర్లు కావడం వలన తిరుపతిలో ఉన్న జువెనైల్ హోంకు తరలించారు. నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ రెండు వైపులా పదునైన కత్తి.

సాంకేతికతో ఎంత మంచి జరుగుతుందో చెడు కూడా అంతే జరిగే ఆస్కారం ఉంది…. తల్లితండ్రులు తమ పిల్లల పెంపకంపైన సరైన పర్యవేక్షణ లేనప్పుడే ఇలాంటి గొడవలకి ఆస్కారం పుంటుంది. కాబట్టి తల్లదండ్రులు తమ పిల్లల పట్ల సరైన దృక్పధంతో తరచూ వారి అలవాట్లను, ఆన్లైన్‌లో వారు చేసే కార్యకలాపాలను గమనిస్తూ ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ వారిని సభ్యసమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే దిశలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ‌రి ఇలా చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వాలి అని చెబుతున్నారు పెద్ద‌లు.