కులం తక్కువని తల్లి శవాన్ని ఏం చేశారో తెలిస్తే ప్రతీ కొడుక్కి రక్తం మరిగిపోతుంది

272

 

ఇంకా మ‌న దేశంలో కులాలు క‌ట్టుబాట్లు చాలా మందిని చంపేస్తున్నాయి.. చంపేయ‌డ‌మే కాదు చ‌నిపోయిన వారిని కూడా ఈకులాల కంపు వ‌ద‌లడం లేదు.. త‌క్కువ కులం ఎక్కువ కులం అనే విభేదాలు జాతిని ఏకంగా దూరం చేస్తూనే ఉన్నాయి, చ‌దువులు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నాస‌రే ఇంకా ఇలాంటి అనేక క‌ట్టుబాట్లు మ‌నుషుల‌ని మ‌రింత దిగ‌జారుస్తున్నాయి అని చెప్పాలి.

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మృతి చెందితే ఆ గ్రామానికి చెందిన ఏ ఒక్కరు ఆమె దగ్గరకు రాలేదు. కారణం ఆమె తక్కువ కులానికి చెందిన మహిళ కావడమే. చివరకు ఆమె కుమారుడు ఒక్కడే సైకిల్‌పై తన తల్లి శవాన్ని తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు. ఈ హృదయ విదారకర ఘటన ఒడిశాలోని కర్పాబహాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జాంకి సిన్హానియా తన కుమారుడు సరోజ్ తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త గత కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు… దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి ఆమె మృతి చెందింది.

 

తన తల్లి అంత్యక్రియలకు సహకరించాలని సరోజ్‌ గ్రామస్తులను కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి గ్రామానికి దాదాపు 6కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఖననం చేశాడు. అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని సరోజ్‌ తెలిపారు… తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని వాపోయారు. నిజంగా ఆ త‌ల్లి చ‌నిపోయినందుకు ఎంత బాధ ఉందో కాని ఆమె చివ‌రి అంతిమ సంస్కారాల‌కు ఎవ‌రూ రాక‌పోవ‌డం ఆ వ్య‌క్తిని మ‌రింత కుంగ‌తీసింది, మ‌నుషుల ర‌క్తం లో కులాల రంగు కూడా ఎర్ర‌గా క‌లిసిపోయింది అందుకే ఇలాంటి మాన‌వ‌త్వం లేని ప‌నులు కొంద‌రు చేస్తున్నారు అని అంటున్నారు మేధావులు.. నిజంగా స‌మాజంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా చూడాలి, మ‌రి చూశారుగా మ‌న‌మైనా మాన‌వ‌త్వంతో ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని కోరుకుందాం.