పురుషులు కనిపిస్తే చాలు.. సుబాబుల్ తోటల్లోకి పిలుస్తున్నారు

789

కాపుకాసి.. కాజేసి..విచ్చలవిడిగా వ్యభిచారంలారీ డ్రైవర్లు, యువకులే లక్ష్యంవాహనాలు ఆపి పిలుస్తున్న మహిళలుఆపై తోటల్లోకి తీసుకెళ్లి దోపిడీకొరవడి పోలీసుల నిఘా నామ్‌రోడ్డు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారింది. వ్యభిచారం, దోపిడీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వ్యభిచారం మాటున మహిళలు చోరీలకు పాల్పడుతున్నారు. వాహనాలను ఆపి డ్రైవర్లను, యువకులను ఆకర్షిస్తున్నారు. వారిని తోటల్లోకి తీసుకెళ్లి నగదు, బంగారం దోచుకుని పంపిస్తున్నారు. విషయం బయటపడితే పరువుపోతుందని బాధితులు మిన్నకుంటున్నారు. నామ్‌ రోడ్డుపై పోలీసు నిఘా కొరవడటంతో ఈ చర్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Image result for roadside prostitutes in india

రెండు దశాబ్దాల క్రితం జాతీయ రహదారి అడ్డాగా వ్యభిచారం యథేచ్ఛగా సాగేది. ఈ క్రమంలో రోడ్డును ఆనుకుని పలు గ్రామాల్లో 3 దశాబ్దాల కాలంలో ఎయిడ్స్‌ వ్యాధిన పడి వందల మంది మృతి చెందారు. కానీ గత దశాబ్దకాలంగా పోలీసులు హైవేపై ప్రత్యేక నిఘా పెట్టడంతో వ్యభిచారం తగ్గుముఖం పట్టింది. కానీ రెండు, మూడు సంవత్సరాల నుంచి నామ్‌ రోడ్డుకు వ్యభిచారం పాకింది. అదే సమయంలో గత ఏడాదిగా జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం జోరందుకుంది. ప్రస్తుతం నామ్‌ రోడ్డు, జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో చీకటి పడితే జన సంచారం లేని స్థలాల్లో మహిళలు రోడ్డు పైకి వచ్చి వాహనాలు ఆపుతున్నారు. లారీ డ్రైవర్‌‌లతో పాటు పలువురు యువకులు మహిళలను చూసి వాహనాలను నిలపుతున్నారు. వారికి ఎర వేసి సమీపంలో ఉన్న సుబాబుల్‌ తోటల్లో తీసుకెళుతున్నారు.

Related image
అప్పటికే అక్కడ కాపు కాసి ఉండే వ్యక్తులు లారీ డ్రైవర్‌ల పై దాడి చేసి వారి వద్ద ఉన్న మొత్తాన్ని లాక్కొని పంపిస్తున్నారు. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని ఎవరికి వారే దొంగకు తేలు కుట్టినట్లు మిన్నకుంటున్నారు. ప్రధానంగా నామ్‌ రోడ్డుపై మేదరమెట్ల – అద్దంకి మధ్య బొడ్డువానిపాలెం, కొంగపాడు డొంక ప్రాంతాల్లో, చక్రాయపాలెం-శాంతినగర్‌ వద్ద, చినకొత్తపల్లి డొంక, వి.కొప్పెరపాడు, ఏల్చూరు-కొమ్మాలపాడు వద్ద రాత్రి సమయాలలో మహిళలు రోడ్డుపైకి వచ్చి వాహనాలను ఆపుతూ తారసపడుతున్నారు. తరచూ దోపిడీలు కూడా అదే ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి.

Related imageఇక జాతీయ రహదారిపై వెంకటాపురం, పి.గుడిపాడు, అలవలపాడు క్రాస్‌ రోడ్డు, బొల్లాపల్లి కాలువ సమీపంలో కాపు కాసి ఉంటున్నారు. వెంకటాపురం పరిసర ప్రాంతాలలో ఉదయం సమయంలో కూడా రోడ్డు వెంబడి వ్యభిచారం నిర్వహించే మహిళలు తారసపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో సుబాబుల్‌ తోటలు అడ్డాగా వ్యభిచారం జరుగుతోంది. దీంతో ఆయా గ్రామాల్లో పొలాలకు వెళ్లే మహిళలు కూడా ఇబ్బందిపడే పరస్థితి నెలకొంది. పలు సందర్భాల్లో అల వాటు పడిన లారీ డ్రైవర్లు ఆయా ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. నామ్‌ రోడ్డు, హై వే రోడ్డుపై హైవేపై ట్రోలింగ్‌, పోలీస్‌ అధికారుల నిఘా తగ్గడంతో అసాంఘిక కార్యకలాపాలతో పాటు దోపిడీలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుమార్జిన్‌లో వాహనాలు నిలుపుకొని నిద్రించాలన్నా భయపడాల్సిన పరస్థితి ఉందని పలువురు డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల్లో వాహనాలు నిలిపి నిద్రిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్‌ అధికారులు నిఘా పెంచి అసాంఘిక కార్యకలాపాలతో పాటు దోపిడీలు నిరోధించాలని వాహనచోదకులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


గత ఏడాది నామ్‌ రోడ్డులో వి.కొప్పెరపాడుకు చెందిన యువకులు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా చక్రాయపాలెం దాటిన తరువాత ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదం జరిగిందని తమ వారికి గాయాలయ్యాయని మోటార్‌ సైకిల్‌ ఆపారు. వెంటనే సమీపంలో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి జేబులు ఖాళీ చేసి పంపించారు.వెంపరాలకు చెందిన ఓ యువకుడు అద్దంకి నుంచి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మహిళలను ఎరవేసి పొలాల్లోకి తీసుకెళ్లి నగదును దోచుకున్నాడు.గత ఏడాది కొంగపాడు డొంక వద్ద రోడ్డుపై ఉన్న థర్డ్‌ జెండర్‌ మహిళలు లారీని ఆపి, అందులో ఉన్న వారి నుంచి నగుదును డిమాండ్‌ చేశారు.
ఇక రెండు రోజుల క్రితం కొంగపాడు డొంక వద్ద మహిళలు లారీని ఆపి డ్రైవర్‌ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అతని వద్ద ఉన్న నగదు, బంగారపు ఉంగరం దోచుకున్నారు. ఇంకా బయటకు తెలియకుండా జరుగుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.అధికారులమని చెప్పి వాహనచోదకులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా నామ్‌ రోడ్డుపై జరుగుతునే ఉన్నాయి. ఇక హైవేపై మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద గత ఏడాది ఎక్కువగా దోపిడీలు జగరడంతో సివిల్‌ డ్రస్‌లో ఉన్న ఎస్సై పై కూడా దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇలా అటు మహిళలు వ్యభిచారం వల విసిరి, దోపిడి దొంగలు దారి కాచి చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు.