ఆ ఊరిలో చివరికి ఇద్దరే మిగిలారు..కారణం ఏమిటో తెలిస్తే కన్నీళ్ళే.?

607

మన రాష్టంలో ఎన్నో కరువు ప్రాంతాలు ఉన్నాయని మనకు తెలుసు.వాన చుక్క లేక నీటి ప్రాజెక్ట్ లు లేక వ్యవసాయాన్నే నముకున్న రైతులు పడే బాధలు ఎన్నో.వేసిన పంటలు ఎండిపోయి వారి జీవనం ఎంత దిగజారి ఉంటుందో మనకు తెలుసు.ఊర్లో బతకాలా వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో రైతులు ఉంటారు.అలాంటి ఒక కరువు ప్రాంతం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.ఇద్దరు ఉండే దానిని ఇల్లు అంటారు తప్పా వీధి అని కూడా అనరు.అలాంటిది ఇద్దరు మాత్రమే ఉంటున్న ఒక ఊరు ఉందని మీకు తెలుసా..ఆ ఊరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

అది అనంతపురం జిల్లాలోని ఒడిసి మండలంలో బోడిగుండ్లపల్లి గ్రామం.ఈ ఊరిలో ఇద్దరే నివసిస్తారంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం.ఒకప్పుడు పాడి పంటలతో పశు సంపదతో ఊరు నిండుగా జనంతో కళకళలాడిన ఆ ఊరు ఇప్పుడు బోసిపోయింది.కారణం కరువు.కరువు రావడంతో ఆ ఊరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.శ్రీమంతుడు సినిమాలో చూపించిన విదంగా ఒకరి తర్వాత ఒకరు ఊరు వదిలివెళ్లిపోవడంతో ఊరు బోసిపోయింది.కరువు దెబ్బకు ఊరు మొత్తం ఖాళీ అయ్యింది.తాళాలు వేసిన ద్వారాలు మొండి గోడలు బతికి బతకని వీధి కుక్కలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

చుట్టూ పొలాలు మద్యలో ఊరు.ఈ గ్రామానికి సంబంధించి సుమారు 500 ఎకరాల భూమి ఉంది.ఇదంతా వర్శదారం కింద సాగు అయ్యే భూమి.వేరుశెనగ పంటను పండించేవారు. ఎనిమిదేళ్ళుగా కరువు వస్తుంది.వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతన్నకు ఇప్పటివరకు వరుణదేవుడు కరుణించలేదు. పంటసాగుపై ఆశలు పెట్టుకున్న రైతన్న ఆశలు ఆవిరయ్యాయి.వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోయాయి.దాంతో ఏం చెయ్యాలో తెలియక ఊరిని వదిలేసి పోయారు.అయితే ఊరు మొత్తం ఖాళీ చేసిన కూడా ఇద్దరు దంపతులు మాత్రం ఊరిని విడిచిపెట్టలేదు.

సొంత ఊరిని పొలాన్ని వదిలిపెట్టిపోవడం ఇష్టం లేక ఇంకా ఆ ఊరిలోనే జీవిస్తున్నారు.వారు ఎవరో కాదు నరసింహ రెడ్డి దంపతులు.ఇంత ఖాళీగా ఉన్న ఊరిలో రాత్రిపూట ఉండాలంటే భయం వేస్తుందని ఆ దంపతులు చెబుతున్నారు.కొన్నిసార్లు భయపడ్డాం.అందుకే రాత్రి అయితే చాలా పక్క ఊరిలో ఉన్న బందువుల ఇంటికి వెళ్లి పడుకుంటాం.మళ్ళి తెల్లారకా వచ్చి మా గ్రామంలో ఉంటాం.వ్యవసాయం చేసుకుంటాం అని అంటున్నారు.ఈ గ్రామానికి రోడు రవాణా సౌకర్యం లేదు.కరెంట్ లేదు.ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ ఊరి సైడు చూడడు అని ఆ దంపతులు చెబుతున్నారు.విన్నారుగా ఈ కరువు ప్రాంతం గురించి.మరీ ఈ ఊరికి వచ్చిన కష్టం గురించి ఆ ఊరినే నమ్ముకుని ఉంటున్న ఆ దంపతుల గురించి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇప్పటికి ఇలాంటి కరువు గ్రామాలు ఉండడం గురించి మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.