విజయశాంతికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం… ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ శ్రేణులు

231

దేశంలో ఎలక్షన్స్ హడావిడి మొదలయ్యింది.ఇంకొక నెల తర్వాత ఎలక్షన్స్ జరగనున్నాయి.అయితే ప్రచారంలో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి.ఇప్పటికే చాలా పార్టీలు తమ టికెట్స్ ఇచ్చేశాయి.అందుకే గెలుపు కోసం అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి.అయితే పార్టీలో ఉండే పెద్ద పెద్ద లీడర్స్ ను తీసుకుని ప్రచారం మొదలుపెడుతున్నారు.అలా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఆ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ప్రచారానికి వెళ్తున్నారు.తెలంగాణాలో కాంగ్రెస్ నాయకులను గెలిపించే భాద్యత మన రాములమ్మ విజయశాంతి తీసుకుంది.ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తుంది.అయితే ఇప్పుడు ఆమెకు ఒక పెను ప్రమాదం తప్పింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఎన్నికల వేడి మొదలయ్యింది.మమ్మల్ని గెలిపించండి అంటే మమ్మల్ని గెలిపించండి అంటూ లీడర్స్ ప్రజల వెంట పడుతున్నారు.కాంగ్రెస్ లీడర్స్ కోసం అక్క విజయశాంతి రంగంలోకి దిగారు.ఊరువాడా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు.ప్రస్తుతం ఆమె మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో పర్యటించారు.అయితే అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. పార్టీ నేతలు విజయశాంతి, మల్లు భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య తదితర నాయకులకు ప్రమాదం తప్పింది.ప్రచార వేదికపై పార్టీ ముఖ్య నాయకులంతా ఆశీనులై ఉన్నారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.

అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు రాములమ్మను పైకి లేపారు. ఈ ఘటనలో కాంగ్రెస్‌ నేతలంతా క్షేమంగా బయటపడ్డారు. విజయశాంతితో పాటు పార్టీ నేతలందరినీ సురక్షితంగా అక్కడ నుంచి తరలించారు.వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం, నేతలంతా ఒక్కసారిగా వేదికపైకి చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.