విజయదేవరకొండ నోటా మూవీ రివ్యూ..హిట్టా పట్టా.?

261

దక్షిణాది సినిమాలో విజయ్ దేవరకొండ ఇప్పుడొక సెన్సేషన్. కేవలం తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ ఇలా ప్రతి సినిమా పరిశ్రమలోనూ విజయ్ అంటే ఓ ఆసక్తి పెరిగిపోయింది. దీనికి కారణం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా తరవాత చాలా మంది పరభాషా దర్శకులు విజయ్‌తో సినిమా చేయాలని ప్రయత్నించారు. మొత్తానికి తమిళ దర్శకుడు, ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ విజయ్‌ను తన కథతో మెప్పించగలిచారు. విజయ్‌తో ద్విభాషా చిత్రం చేయాలని ప్రయత్నిస్తోన్న ప్రముఖ నిర్మాత కె.ఈ.జ్ఞానవేల్ రాజా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. దీంతో ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన విజయ్.. ఇప్పుడు ‘నోటా’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు.మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.

‘నోటా’ సినిమా ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ మాత్రం అస్సలు బాగాలేదనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. మొత్తం మీద ఇది బిలో యావరేజ్ మూవీ అని తేల్చేస్తున్నారు. తమిళ ప్రజలకు కాస్తో కూస్తో నచ్చినా తెలుగు ప్రజలకు మాత్రం నచ్చదట. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే పొలిటికల్ సీన్స్, విజయ్ దేవరకొండ మాస్ పొలిటికల్ ప్రెస్ మీట్ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుందని అంటున్నారు. ఇదే ఊపు సెకండాఫ్‌లో కొనసాగి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదట. ఆనంద్ శంకర్ సెకండాఫ్‌ను మరీ బోరింగ్‌గా తెరకెక్కించారని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎప్పటిలానే తన రౌడీ నటనతో మెప్పించారట. అయితే సత్యరాజ్, విజయ్ మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘లీడర్’ సినిమాను గుర్తుచేస్తున్నాయని చెబుతున్నారు.ఇక హీరోయిన్ విషయానికి వస్తే అంత గుర్తింపు పెట్టుకోవాల్సిన పాత్ర అయితే ఏమి కాదు.హీరోయిన్ ఉండాలంటే ఉంది అన్నట్టు ఉంది.

ఇక సాంగ్స్ విషయానికి వస్తే అంత అట్రాక్ గా ఏమి లేవు.పొలిటికల్ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జనాలను ఆకట్టుకుంటుంది.ఇక డైలాగ్స్ విషయానికి వస్తే పొలిటికల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి.ప్రజలను ఆలోచించేలా ఉన్నాయి.అసలు ఓటు వాల్యూ ఏమిటో చుపించాలనుకున్నారు కానీ దానిని తెరకెక్కిన విధానం ఎంత మందికి నచ్చుతుందన్న అంశం మీదనే విజయం ఆధారపడి ఉంది.ఇక విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.యంగ్ పొలిటికల్ లీడర్ గా ఆయన ఒదిగిపోయాడు.కానీ కొంతమంది పొలిటికల్ లీడర్స్ ను కాపీ చేసినట్టు అనిపించింది.కానీ అతని రౌడీ నటన ప్రేక్షకులకు తెగ నచ్చుతుంది.మొత్తమ్మీద సినిమా గురించి చెప్పాలంటే ఆలోచించాల్సిన సినిమా అనే చెప్పుకోవాలి.మరి ఈ సినిమాను జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.