మెగా అల్లుడు కాబోతున్న విజయ్ దేవరకొండ…. నిహారికతో పెళ్లి ఫిక్స్.?

754

విజయ్ దేవరకొండ…టాలీవుడ్ లో ఇప్పుడు భారీ డిమాండ్ ఉన్న హీరో.అర్జున్ రెడ్డి చిత్రంతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ మధ్యనే విడుదల అయినా టాక్సీవాలా కూడా హిట్ అవ్వడంతో మనోడికి అదృష్టం గమ్ పట్టినట్టు పట్టింది అని అనుకుంటున్నారు.. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.విజయ్ దేవరకొండ తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు.నోటా సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చాడు.వరుస విజయాలతో దూసుకుపోతు అగ్ర హీరోల టాప్ టెన్ లో విజ‌య్ స్థానం ద‌క్కించుకున్నాడు. యూత్ లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న న‌టుడ‌య్యాడు. అభిమానుల బ‌లం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ యంగ్ హీరో తో భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించ‌డానికి నిర్మాత‌లు ముందుకొస్తున్నారు.ఇవన్నీ పక్కన పెడితే విజయ్ దేవరకొండ త్వరలో మెగా అల్లుడు కాబోతున్నాడు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

తెలంగాణ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన హీరో.న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కూ అంతా దేవ‌ర‌కొండ‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాయ‌డం మొద‌లు పెట్టారు. అటు మెగా ఫ్యామిలీ అండ‌దండ‌లు విజ‌య్ కు ఉన్నాయి. భ‌విష్య‌త్ లో పెద్ద స్టార్ అవుతాడ‌ని ఇండ‌స్ర్టీ బ‌లంగా న‌మ్ముతోంది. అయితే ఈ న‌యా హీరోతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ బంధుత్వం క‌లుపుకోవ‌డానికి చూస్తోంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.నాగ‌బాబు త‌న‌యురాలు, హీరోయిన్ నిహారిక‌ను విజ‌య్ కిచ్చి వివాహం చేయాల‌ని చూస్తున్న‌ట్లు ఉప్పందింది. ఓ సంద‌ర్భంలో మెగాస్టార్ చిరంజీవి కుర్రాడు మంచోడు..బాగున్నాడుని తన సన్నిహితుల వ‌ద్ద అన్న ఓ మాట ఇప్పుడు ఫిలిం స‌ర్కిల్స్ లో జోర‌గా వైర‌ల్ అవుతోంది. ఈ మధ్య జరిగిన ఒక సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ఇచ్చిన ఓ పార్టీలో ఆ టాపిక్ గురించి కొంద‌రు ముచ్చ‌టించుకోవ‌డం గ‌మ‌నార్హం.

పొద్దుట లేచి మెగా ఫ్యామిలీకి భ‌జ‌న చేసే భ‌జ‌న కారుల నుంచే ఈ మాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. కేవ‌లం ఈ మాట‌ మీడియా స‌ర్కిల్స్ లో వైర‌ల్ గా మార‌డానికి కార‌ణ‌మైంది. దీంతో రూమ‌ర్ గా ప‌రిగ‌ణించ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. అయితే విజ‌య్ ,అర‌వింద్ భార్య త‌రుపు బంధువు అవుతాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ కు అర‌వింద్ భ‌రోసా ఇచ్చాడన్నారు.అలాగే నాగ‌శౌర్య‌- నిహారిక ప్రేమించుకున్నార‌ని..పెళ్లి చేసుకుంటారని..అందుకే చిరంజీవి నాగ‌శౌర్య సినిమా `ఛలో` ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వ‌చ్చార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. కానీ వీటిని నాగ‌శౌర్య‌-నిహారిక కొట్టి పారేసారు. అయితే ఇందులో మ‌రో విష‌యం కూడా ఉంద‌ట‌. నాగ‌శౌర్య కుటుంబ‌మే మెగా ఫ్యామిలీతో బంధుత్వం వ‌ద్ద‌నుకుంద‌ట‌. ఉద‌య్ కిర‌ణ్ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఏమైనా మ‌ళ్లీ రిపీట్ అయితే బిడ్డ భ‌విష్య‌త్ ఏంట‌ని? నాగ‌శౌర్య త‌ల్లి ఉషా వెన‌క‌డుగు వేసిందంటున్నారు.ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.