ప్రముఖ గాయని భర్త మృతి..షాక్ లో బాలసుబ్రహ్మణ్యం

416

సినీ పరిశ్రమలో ఈ మధ్య విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.చాలా మంది ప్రముఖులు చనిపోయారు.హరికృష్ణ,బి.జయ,కెప్టెన్ రాజు ప్రముఖ బెంగాలీ నటి పాయల్ చక్రవర్తి,బాలీవుడ్ దర్శకురాలు కల్పనాజీ లాంటి చాలా మంది ప్రముఖులు చనిపోయారు.అయితే ఇప్పుడు ఒక ఫెమస్ సింగర్ భర్త చనిపోయాడు.దాంతో తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.మరి ఆ సింగర్ ఎవరు ఆమె భర్త ఎలా చనిపోయాడా తెలుసుకుందామా.

తెలుగు నేలను పులకింప చేసిన గానకోకిలల్లో వాణీ జయరామ్ బాణీ ప్రత్యేకమైనది… ఆ గాత్రంలోని మధురామృతం తెలుగువారికి నిత్యనూతనం.దక్షిణాదిన జన్మించిన వాణీ జయరామ్ తొలుత ఉత్తరాదిన చిత్రసీమలో వసంతం చూశారు. తొలుత హిందీ చిత్రం ‘గుడ్డి’ (1971)తో గాయనిగా ఎంట్రీ ఇచ్చారు. ఆమె గాత్రంలోని మాధుర్యాన్ని, మహిమనూ పసికట్టిన పలువురు ప్రముఖ సంగీతదర్శకులు వాణీ గానంతో పలు హిందీ చిత్రాలు విజయయాత్ర చేశాయి.అయితే ఇప్పుడు ఈమె శోకసంద్రంలో ఉంది.

వాణి జయరామ్‌ భర్త జయరామ్‌ అనారోగ్యంతో చెన్నైలో సోమవారం కన్ను మూశారు. వేలూరు జిల్లాకు చెందిన వాణి జయరామ్‌ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. కలైవాణి అనే తన పేరును జయరామ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత వాణి జయరామ్‌గా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత దంపతులు ముంబయిలో స్థిరపడ్డారు. తర్వాత మళ్లీ చెన్నై వచ్చేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.ఈయన మృతి పట్ల సింగర్స్ అందరు షాక్ అయ్యారు.తమకు ఎంతో ఇష్టమైన వాణీ జయరాం ఇప్పుడు శోకసంద్రంలో ఉండడంతో అందరు సింగర్స్ బాధపడుతున్నారు.బాలసుబ్రమణ్యం జానకి సుశీల శైలజ మనో లాంటి సింగర్స్ ఆమెను ఓదార్చడానికి ముంబై వెళ్తున్నారు.జయరామ్ మృతికి వీళ్ళు ఆల్రెడీ తమ సంతాపాన్ని తెలియజేశారు.