తీన్మార్ సావిత్రి రియల్ స్టోరీ

318

శివజ్యోతి..ఈ పేరు అంతలా ఎవరికీ పరిచయం లేదు. కానీ తీన్మార్ సావిత్రి అంటే తెలుగు రాష్టాల్లో తెలియని వారు ఉండరు. వార్తలు అంటే సీరియస్ గా సాగాలి..వాటిని ఒకే రీతిలో చెప్పాలి అనే ధోరణికి పులుస్టాప్ పెట్టి అందరిని నవ్విస్తూ, న్యూస్ ను కొత్తగా చెప్పొచ్చు అని నిరూపించింది. తీన్మార్ వార్తలను ఇష్టపడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ యాస, మాండలికంలో వార్తలు వినిపిస్తున్న అవి వినడానికి తెలంగాణ, ఆంద్ర, రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలవారు ఆసక్తి చూపుతారు. అంతలా తెరమీద సావిత్రి మెప్పిస్తున్నారు. అచ్చ తెలంగాణ ఆడపడచులా కట్టుబొట్టు పెట్టుకుని తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతుంది. మరి ఆమె గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for తీన్మార్ సావిత్రి

బాల్యం, చదువు…
తీన్మార్ సావిత్రి అసలు పేరు శివ జ్యోతి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో యశోద, రాజమల్లేష్ దంపతులకు జన్మించింది. తల్లి బీడీ కార్మికురాలు. తండ్రి ఆర్‌ఎంపీ డాక్టర్. మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది.చిన్న తనం నుండి 7వ తరగతి వరకు నాగంపేటలో చదివింది, తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు రేంజర్లలో చదివింది. పక్క గ్రామమైన రేంజర్లకు వెళ్ళి రావడానికి మొత్తం 8కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్ళేది. ఇంటర్ ఒక సంవత్సరం ఆర్మూర్ లో, ఇంకో సంవత్సరం నిజామాబాద్ లో చదివింది. హైదరబాద్ యశోదలో బి.ఎస్.సి నర్సింగ్ కోర్స్ లో చేరింది. మధ్యలోనే వదిలేసి, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసింది.

Image result for తీన్మార్ సావిత్రి

వ్యక్తిగత జీవితం…
సావిత్రి నాన్న డాక్టర్ కావడంతో కుమార్తెను నర్స్ గా చెయ్యాలని భావించి బి.ఎస్.సి నర్సింగ్ కోర్స్ లో జాయిన్ చేశారు. అయితే అక్కడ చిన్నపిల్లలకు ఇంజక్షన్ చెయ్యాల్సి వచ్చేది. కానీ చిన్నపిల్లలకు ఇంజెక్షన్ చెయ్యడం బాధగా అనిపించి అక్కడి నుంచి వచ్చేసింది. ఆ తర్వాత జ్యోతి గంగూలీని పెళ్లి చేసుకుంది. అలా జ్యోతి కాస్త జ్యోతి గంగూలీ అయ్యింది. పెళ్లి చేసుకున్నా కూడా యాంకర్ గా రాణిస్తూ తన ముద్రను చాటుకుంటుంది.

Image result for తీన్మార్ సావిత్రి

యాంకర్ గా కెరీర్…
నర్సింగ్ మానేసిన తర్వాత యాంకర్ అవ్వాలని అనుకుంది. అందుకే యాంకర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. యాంకర్‌గా రాణించాలనుకున్న జ్యోతి, వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది. అక్కడ తన భాషని, గొంతును, తెలంగాణ యాసను మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అన్నారు. అయినా కానీ ఆమె మార్చుకోలేదు. అలా చాలా ఇబ్బందిపడిన తరువాత ఒకరోజు వి6 ఛానెల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివేవారికోసం అన్వేషిస్తున్నారు అని తెలుసుకొని ఆడిషన్ కు వెళ్ళింది. అక్కడ జ్యోతి ఎంపికైంది. అలా వి6 ఛానల్ లో అవకాశం వచ్చింది. ఇదే సావిత్రి జీవితంలో పెద్ద మార్పు. వి6లో చేరిన తొలిరోజుల్లో సినిమా వార్తలు చదివింది. ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్, వాయిస్ ఓవర్లు చదివింది. రాములమ్మతో కలిసి కొన్ని పోగ్రామ్స్ చేసింది. ఇక బిత్తరి సత్తితో కలిసి చేసిన తీన్మార్ వార్తలు పెద్ద హిట్ అయ్యాయి. బిత్తిరి సత్తి, సావిత్రి కాంబినేషన్ విశేషంగా ఆకట్టుకుంది. జ్యోతి గొంతు డిఫరెంట్‌గా ఉండడం, ఆ గొంతును జనాలు ఆదరించడం, వి6 ఛానల్‌కు రేటింగ్ రావడంతోపాటు జ్యోతి తీన్మార్ సావిత్రిగా పాపులర్ అయింది. ఒక వార్తను సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా చెబుతూనే హాస్యాన్ని అందించడం వీరికి విజయాన్ని చేకూరించింది.

ఈ క్రింది వీడియో ని చూడండి

తెలంగాణ మాండలికంలో మాట్లాడటం సావిత్రికి ప్లస్ అయ్యింది. మన ఇంటి అమ్మాయి మాట్లాడినట్టు ఉండటంలో ఆమెను తెలంగాణ ప్రజలు ఆదరించారు. తీన్మార్ వార్తలలో జ్యోతి వేసుకున్న బుగ్గల జాకెట్ చాలా ఫేమస్, ట్రెండ్ అయింది. కొందరు సావిత్రి జాకెట్లు అని పేరు కూడా పెట్టారు. రాత్రి 9.30 అయ్యింది అంటే చాలు v6 ఛానెల్ ను పెట్టుకుంటున్నారంటే సావిత్రి జనాలను ఎంతలా అట్రాక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. వయసులో సత్తి కన్నా చిన్నధీ అయినా కానీ సొంత అక్కాతమ్ముళ్ల లాగా నటిస్తారు. అక్కాతమ్ముళ్ల లాగా వారు ప్రేమను పంచుకున్నా, సెటైర్స్ వేసుకున్నా ప్రేక్షకులకు ఫన్నిలాగే ఉంటుంది. కేవలం తీన్మార్ వార్తలే కాక ముచ్చట, మదిలో మాట వంటి కార్యక్రమాలతో సినీ రాజకీయ ప్రముఖులను ఇంటర్యూ చేస్తూ వారిని తెలంగాణ యాసలో ప్రశ్నలు అడుగుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ షోకు వెళ్తుంది. అక్కడ కూడా ఆమె ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకోవాలని కోరుకుందాం. అలాగే ఆమె ముందు ముందు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుందాం.