1948లో ఇండియా పాకిస్ధాన్ మధ్య జరిగిన పెద్ద తప్పు ఏమిటి చరిత్రలో కొన్ని నిజాలు

199

భారతీయుల స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చాలని నిర్ణయించుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఏక్ట్‌’ కింద దేశాన్ని రెండుగా విడగొట్టింది. 1947 ఆగస్టు 15న భారత్‌, పాకిస్థాన్‌లను స్వతంత్ర దేశాలుగా ప్రకటించింది. దేశంలోని 540 పైచిలుకు సంస్థానాల మాదిరే ఆనాడు జమ్మూ కశ్మీర్‌ కూడా ఓ సంస్థానం. దేశ విభజన సమయంలో ఓ రగులుతున్న రావణకాష్టం. మహరాజా హరిసింగ్‌ దానిపాలకుడు.సర్దార్‌ పటేల్‌ సారథ్యంలో సంస్థానాల విలీనం జరిగినప్పుడు హరిసింగ్‌ పాక్‌లోనూ, భారత్‌లోనూ చేరకుం డా స్వతంత్రంగా ఉండి.. రెండు దేశాలతోనూ స్నేహబంధాన్ని కొనసాగించాలని భావించారు. రెండు దేశాలతో ‘యధాతథ స్థితి ఒప్పందం’ చేసుకుందామని ప్రతిపాదించారు. దీనికి పాక్‌ ఒప్పుకుంది. భారత్‌ మాత్రం చర్చలకు ఓ ప్రతినిధిని ఢిల్లీకి పంపాలని కోరింది. అదే సందర్భంలో కశ్మీర్‌ పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి.

Image result for sardar patel

పష్తూన్‌(పఠాన్‌) గిరిజనులను పాక్‌ రెచ్చగొట్టి శ్రీనగర్‌ను ఆక్రమించుకునేందుకు సాయుధ సామగ్రి తో పంపింది.దీంతో హరిసింగ్‌ భారత సైనిక సాయాన్ని అర్ధించారు. నాటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ సా యం చేసేందుకు మూడు షరతులు విధించా రు. అవి: (1) భారత్‌లో విలీనం కావాలి (2) రాచరికం స్థానే ప్రజాస్వామ్యం నెలకొల్పా లి. అంతర్గత పాలన జరగాలి. ఇందు కోసం మైసూర్‌ తరహాలో కొత్త రాజ్యాంగం రూపొందించాలి (3) ప్రధానితో పాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లాను అన్నిటా బాధ్యు ణ్ని చేయాలి. ఈ మూడు షరతులకూ హరిసింగ్‌ వెం టనే ఒప్పుకున్నారు.

Image result for ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ ఏక్సెషన్‌

భారత్‌లో విలీనానికి అంగీకరిస్తూ 1947 అక్టోబరు 26న ‘ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ ఏక్సెషన్‌’పై సంతకం చేశారు. ఆ మరునాడు అంటే అక్టోబరు 27న ఆఖరి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ అయిన లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ కూడా సంతకం చేశారు. ఆ రకంగా భారత్‌లో జమ్మూకశ్మీర్‌ విలీనమైంది. ఆ రోజే భారత దళాలు విమానాల్లో శ్రీనగర్‌లో దిగా యి. లోయను ఆక్రమించుకుని తిరుగుబా టు చేస్తున్న పఠాన్లను తరిమికొట్టాయి.1948లో జమ్మూకశ్మీర్‌ ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను హరిసింగ్‌ నియమించారు. రాజప్రతినిధిగా తన కుమారుడైన కరణ్‌సింగ్‌ను నియమించారు. 1952 వరకూ రాచరిక సంస్థానంగా కొనసాగాక ఢిల్లీ ఒప్పందం ద్వారా రాజరికం రద్దయి పూర్తి స్థాయి రాష్ట్రంగా మారింది. కరణ్‌ సింగ్‌ రాజ్యాంగ అధిపతి (సదరే రియాసత్‌)గా బాధ్యతలు చేపట్టారు.

Image result for ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ ఏక్సెషన్‌

ఎందుకు ప్రత్యేక రాజ్యాంగం?
దేశంలోని అన్ని సంస్థానాల విలీనం 1935నాటి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చట్ట ప్రాతిపదికన అప్పటికున్న రాజకీయ సరిహద్దులతో జరిగింది. రాష్ట్రాల పునర్విభజన నిమి త్తం 1948లో ఏర్పాటు చేసిన ధార్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం తదనంతరం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగిం ది. కానీ జమ్మూ కశ్మీర్‌కు మాత్రం ప్రత్యేక హో దా, ప్రతిపత్తి, రాజ్యాం గం ఇచ్చారు. ఎందుకు? దీనికి చారిత్రక కారణాలున్నాయి. జమ్మూకశ్మీర్‌ ‘‘భారత్‌తో కలిసి ఉండాలని’’ (ఏక్సెషన్‌) నిర్ణయించిందా లేక ‘విలీనమా’’ (మెర్జర్‌) అన్నది ఇప్పటికీ వివాదమే.

Image result for ఎందుకు ప్రత్యేక రాజ్యాంగం?

దీనిపై ఎంతో చర్చ సాగుతూనే ఉంది. ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ ఏక్సెషన్‌(ఐవోఏ) అనేది భారత ప్రభుత్వానికి పరిమిత అధికారాలే ఇచ్చింది. రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్ల వ్యవహారాలను మాత్రమే భారత ప్ర భుత్వం చూసుకోవాలి. హరిసింగ్‌ సంతకం చేసిన ఈ కలయిక ఒప్పందం వల్ల తన రాజకీయ ఆశలు నెరవేరవని షేక్‌ అబ్దుల్లా భావించినట్లు, కశ్మీరీల (అంటే ప్రస్తుత శ్రీనగర్‌, కశ్మీర్‌ లోయలోని ప్రజల) ఆకాంక్షలు సాగాలంటే పూర్తి విలీనానికి అంగీకరించకుండా ప్రత్యేక ప్రతిపత్తిని సాధించడమే మేలని నిర్ణయించుకున్నట్లు చరిత్రకారులు చెబుతారు.ఈ దృష్టితోనే షేక్‌ అబ్దుల్లా తనకు స్నేహితుడైన జవహర్‌లాల్‌ నెహ్రూ (ఈయన కూడా కశ్మీరీ పండిటే)తో ఆంతరంగిక ఒప్పందానికి వచ్చినట్లు, పాక్‌ను దూరంగా ఉంచేందుకు నెహ్రూ కూడా ఆయన సూచనలకు అంగీకరించినట్లు ఇప్పటికీ ఓ వర్గ చరిత్రకారుల అభిప్రాయం. కారణాలేవైతేనేం, ఢిల్లీతో విజయవంతంగా ఓ అవగాహనకు వచ్చి ఆర్టికల్‌ 306 రూపేణా(ఇదే తుది రాజ్యాంగంలో 370 అధికరణంగా మారింది) కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని సాధించగలిగారు. రాజ్యాంగ సభ కూడా దీన్ని ఆమోదించింది. ఈ అధికరణం కింద ఆర్థిక, విదేశీ, రక్షణ, కమ్యూనికేషన్లు మినహా మిగిలిన అన్ని అంశాల్లో అంతర్గత స్వయం ప్రతిపత్తి ఉంటుంది.

Image result for jammu and kashmir

ఆ తరువాత 1956లో జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక రాజ్యాంగాన్ని అక్కడి ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రాదేశికంగా జమ్మూ-కశ్మీర్‌ అనేది భారత్‌లో అంతర్భాగమే. కానీ చట్టబద్ధ విలీనం (లీగల్‌ ఇంటెగ్రేషన్‌) మాత్రం ఇప్పటికీ జరగలేదు!! షేక్‌ అబ్దుల్లా స్వప్నం జమ్మూకశ్మీర్‌కు తిరుగులేని నేతగా చక్రం తిప్పడం. కొంతమేర ఆయన దానిని సాధించారు. అయితే రాష్ట్రం పూర్తిస్థాయిలో భారత్‌లో విలీనం కావాలని జమ్మూ, లద్దాఖ్‌ ప్రాంత ప్రజానీకం నాటి నుంచి కోరుకుంటూనే ఉన్నారు. ఇది నేటికీ జరగలేదు.

వివాదం ఏంటి?
తిరుగుబాటుదారుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న సమయంలో హరిసింగ్‌ మొదట లార్డ్‌ మౌంట్‌బాటన్‌ను సంప్రదించారు. ‘‘మొదట శాంతి భద్రతల సమస్య పరిష్కారమయ్యాక విలీనం సంగతిని ప్రజల అభీష్టానాకి అనుగుణంగా చూడవచ్చని’’ మౌంట్‌బాటన్‌ ఆయనకు బదులిచ్చారు. ‘‘ప్రజల అభీష్టానికి అనుగుణంగా’’ అన్న పదం కశ్మీర్‌ చిచ్చుకు, రాజకీయ వివాదానికి కారణమయ్యింది. మౌంట్‌బాటన్‌ సలహా మేరకు కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ (ఇండియాలో ఉంటారా, లేక పాక్‌లో ఉంటారా..) నిర్వహించడానికి భారత్‌ ప్రయత్నించింది.

కానీ విలీనాన్ని ప్రశ్నించిన పాక్‌ , కశ్మీర్లోని ఓ వర్గం భారత్‌ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణను నమ్మబోమని ప్రకటించాయి. ఒత్తిడికి తలొగ్గి హరిసింగ్‌ విలీనాన్ని అంగీకరించారని ఆరోపించాయి. ఇప్పటికీ పాక్‌, కశ్మీర్‌లోని వేర్పాటువాదులు ‘ప్లెబిసైట్‌’ (ప్రజాభిప్రాయసేకరణ)కు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు.

పటేల్‌ ప్రతిపాదన.. నెహ్రూ నో!
దేశ విభజన సమయంలో దాదాపు 14 లక్షల మంది భారత్‌కు వలస వచ్చేశారు. ఇందులో అత్యధికులు హిందువులు, సిక్కులు. పాకిస్థాన్‌ ఇక ముస్లిం దేశంగా మారుతోందని, తమకు భద్రత ఉండదని భావించి భయంతో రాత్రికి రాత్రి ప్రాణాలరచేత పట్టుకుని భారత్‌ వచ్చేశారు. వీరందరికీ ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో కాకుండా కశ్మీర్‌ లోయలోనో, సరిహద్దుల్లోనో ఆవాసం కల్పిస్తే వారు (ఆగ్రహంతో) పాక్‌ను నిలువరించడానికి సాయపడతారని ఆనాడు సర్దార్‌ పటేల్‌ అభిప్రాయపడ్డట్లు వార్తలు వెలువడ్డాయి.

Image result for patel and nehru

కానీ ఈ ప్రతిపాదనకు నెహ్రూ ఒప్పుకోలేదని, ఎవరికి నచ్చినచోట వారు సెటిల్‌ కావడానికి అవకాశం ఇవ్వాలని ఆయన పేర్కొన్నట్లూ కొన్ని కథనాలు వచ్చాయి. జనాభా నిష్పత్తిని మారిస్తే- అంటే కేవలం ముస్లిం ఆధిపత్యమే కాకుండా హిందువులు కూడా తగినంత మంది ఉంటే జమ్మూ కశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత అధీనంలోకి తెచ్చుకోవచ్చని ఆనాడు పటేల్‌ ప్ర