స్త్రీ లలో వచ్చే రుతుచక్ర సమస్యలు

132

స్త్రీలలో రుతుక్రమం చక్కటి ఆరోగ్యానికి నిదర్శనం. అలాంటిది నేటి కాలంలో ప్రతి 10 మందిలో స్త్రీలలో 9 మంది వరకు తమ జీవితకాలంలో ఏదో ఒక రుతుచక్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటి వలన మానసిక ఆందోళన, నీరసం, పని మీద ఏక్రాగత కోల్పోవడం జరుగుతుంది. సాధారణంగా రుతుచక్రంలో మార్పులు- రజస్వల, ప్రెగ్నెన్సీ, ప్రసవం, రుతుచక్రం ఆగిపోయే సమయం వరకూ కనిపిస్తాయి. వీటన్నిటికీ ఎలాంటి వైద్యం అవసరం లేదు. కానీ ఇవి కాకుండా అనేక కారణాల వల్ల రుతుచక్ర సమస్యలు వస్తూంటాయి. రుతుచక్ర సమస్యలో కొన్ని రకాలు ఉన్నాయి. వాటి గురించి, ఆ సమస్యకు పరిష్కారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for girls in periods

ముందు రుతుచక్ర సమస్యల విషయానికి వస్తే…

  1. అమినోరియా : స్ర్తీలలో రుతుక్రమం రాకపోవడాన్ని అమినోరియా అంటారు. ఇది రెండు రకాలు
  • ప్రైమరీ అమినోరియా : స్ర్తీలు యుక్త వయసుకు వచ్చినప్పటికీ అంటే 16 సంవత్సరాలు తరువాత కూడా రుతుచక్రం ప్రారంభం కాకపోవడాన్ని ప్రైమరీ అమినోరియా అంటారు. దీనికి కారణాలు ఏమిటంటే… క్రోమోజోమల్‌ లేదా జన్యుపరమైన సమస్యలు ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌, గర్భాశయలోపాలు, గర్భాశయ ఇన్‌ఫెక్షన్లు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, కుషింగ్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు, హార్మోన్‌ ల సమస్యలు, ముఖ్యంగా ఎడ్రినల్‌ గ్రంధి సమస్యలు, కేన్సర్‌ నివారణ ట్యాబ్ లెట్స్ , యాంటీ డిప్రెసివ్‌ ట్యాబ్ లెట్స్ కారణమవుతాయి.
  • సెకండరీ అమినోరియా : బహిష్టు ప్రాసెస్ కరెక్ట్ గా ఉండి, సంతానోత్పత్తి దశలో స్ర్తీలలో 3 నెలల వరకు బహిష్టు కాకపోవడాన్ని సెకండరీ అమినోరియా అంటారు. దీనికి కారణాలు ఏమిటంటే… పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాదు. దీనికోసం ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు. పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్‌ సమస్యలు, గర్భనిరోదక ట్యాబ్ లెట్స్ , కొన్ని రకాల యాంటీ డిప్రెషన్‌ మందులు వాడటం, పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌, శక్తికి మించి వ్యాయామం చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు కారణమవుతాయి.

ఈ క్రింద వీడియో చూడండి

  1. ఆలిగోమెనోరియా : 35-40 రోజుల కంటే ఎక్కువ రోజులకు రుతుస్రావం రావడం లేదా నెలసరి సమయంలో 30 మిల్లిలీటర్ల కంటే తక్కువ రుతుస్రావం కావడాన్ని అలిగోమెనోరియా అంటారు. దీనికి కారణాలు ఏమిటంటే… పీసీఓడీ, పిట్యుటరీ గ్రంధిలో కణతులు ఏర్పడటం, నెలసరి ఆగిపోయే సమయంలోనూ వచ్చే అవకాశం ఉంది.
  2. మెట్రోరేజియా : రెండు రుతుచక్రాల మధ్యలో రుతుస్రావం కనబడటాన్ని మెట్రోరెజియో అంటారు. ముఖ్యంగా అండం విడుదల సమయంలో ఈ మెట్రోరేజియో కనిపించే అవకాశం ఉంది. దీనికి కారణాలు ఏమిటంటే… అడినోమస్‌, ఎండోమెట్రియాసిస్‌, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ, హార్మోన్ల సమస్య, గర్భ నిరోధక డివైసెస్ (ఐయూడీ), గర్భనిరోధక మాత్రల వల్ల కూడా మెట్రోరెజియో ఉంటుంది.
  3. మెనోరేజియా : సాధారణం కంటే ఎక్కువ రోజులు రుతుస్రావం కావడాన్ని మెనోరేజియో అంటారు. దీనికి కారణాలు ఏమిటంటే… గర్భాశయంలో కణుతులు, పీసీఓడీ, థైరాయిడ్‌ సమస్యలు, ఎండోమెట్రియాసిస్‌, గర్భాశయంలో కేన్సర్‌ వంటి కారణాలు మెనోరేజియాకు దారి తీస్తాయి.
  4. డిస్మెనోరియా : స్త్రీకి నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి రావడాన్ని డిస్మెనోరియా అంటారు. ఇది నెలసరికి కొద్ది రోజుల ముందు కానీ లేదా నెలసరి ప్రారంభమైన మొదటి రోజు నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు. దీనికి కారణాలు ఏమిటంటే…ఎండోమెట్రియోసిస్‌, గర్భసంచికలో కణుతులు, అండాశయంలో వాటర్ కిస్ట్స్ ఏర్పడటం, హార్మోన్‌ అసమతుల్యతలు డిస్మెనోరియాకు దారి తీస్తాయి.
Related image

ఇలా స్త్రీలలో కొన్ని రకాల రుతుచక్ర సమస్యలు ఉంటాయి. ఇక ఈ సమస్యలన్నిటిని తగ్గించుకోడానికి నిర్ధారణ పరీక్షల విషయానికి వస్తే : రక్త పరీక్షలు – సీబీపీ, ఈఎస్‌ఆర్‌, హార్మోన్‌ పరీక్షలు- ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, ఎస్‌ ప్రోలాక్టిన్‌, థైరాయిడ్‌ ప్రోఫిక్‌, అల్ట్రాసౌండ్‌, సిటి స్కాన్‌ అబ్డామిన్‌ ద్వారా రుతుచక్ర సమస్యలకు గల కారణాన్ని గుర్తించవచ్చు. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ జెనటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ పద్ధతిలో జరుపబడే చికిత్స ద్వారా రుతుచక్ర సమస్యలకు కారణమైన హార్మోన్ల అసమతుల్యతను, పీసీఓడీ, గర్భాశయంలోని ఇతర సమస్యలను సరిచేసి, గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేసి రుతుచక్ర సమస్యలు సంపూర్ణంగా, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా దూరం చేయవచ్చు.

ఇలా చేసి మీ రుతుచక్ర సమస్యలను దూరం చేసుకోండి. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.