చైనాలో పెళ్లి కాని యువతులు చేస్తున్న ఈ పని గురించి తెలిస్తే షాక్..

728

ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది.కానీ దానికంటూ ఒక వయసు రావాలి.అయితే వయసు వస్తున్నా కూడా పెళ్లి కాకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి.అమ్మాయి అందంగా ఉండాలని కొందరు కట్నం ఎక్కువగా ఉండాలని కొందరు లేదా తల్లిదండ్రులకు నచ్చలేదు అని కొందరి పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి.ఈ సమస్య ప్రతి దేశంలో ఉంటుంది.అన్ని దేశాలలో ఉన్నట్టే ఈ సమస్య చైనాలో కూడా ఉంది.అందుకే పెళ్లి కాని యువతులు అందరు అక్కడ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for china girls

చైనాలోని షాంఘై నగరంలో ఉన్న పీపుల్స్ పార్క్‌కు కొందరు రోడ్డుకు ఇరువైపులా నిలబడితే, ఇంకొందరు కూర్చున్నారు. మరికొందరు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.వాళ్లందరి దగ్గర గొడుగులు ఉన్నాయి. నేలపై పెట్టిన గొడుగులపై కొన్ని పేపర్లు కనిపిస్తున్నాయి. వర్షానికి తడవకుండా ఆ పేపర్లను ప్లాస్టిక్ కవర్లలో పెట్టారు. గొడుగులపైనే కాదు మొక్కలపైన, నేలపైన, గోడలపైన కూడా కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ఇంతకు ఆ కాగితంలో ఏమున్నాయి అనుకుంటున్నారా..ఆ కాగితాల్లో అమ్మాయి లేదా అబ్బాయిల వివరాలు ఉన్నాయి. వయస్సు, వార్షికాదాయం, విద్యార్హతలు, పుట్టిన తేదీలు, రాశులు.. ఇలాంటివన్నీ పేర్కొన్నారు.ఇదంతా ఏమిటా అనుకుంటున్నారా..ఇదంతా పెళ్లిళ్ల సంతలో జరిగే తంతు. 2005వ సంవత్సరం నుంచి షాంఘై నగరంలో ప్రతి వారాంతంలోనూ ఈ సంత జరుగుతోంది. తొలినాళ్లలో ఈ పార్కుకు ప్రజలు నడక, వ్యాయామం కోసం వచ్చేవాళ్లు. తర్వాత తమ పిల్లల పెళ్లి సంబంధాల కోసం వస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చైనాలో ధరలు పెరిగిపోయాయి. అదే రీతిలో వరుడు, వధువు కోసం తల్లిదండ్రుల డిమాండ్లు కూడా పెరిగాయి.దీంతో ఇక్కడ యువతకు చాలా ఆలస్యంగా పెళ్లి అవుతోంది.కొంతమందికి అయితే అసలు పెళ్లిళ్లే కావట్లేదు. అంతేకాదు, పెళ్లిళ్లు ఆలస్యం కావటం లేదా కాకపోవటం వల్ల వివాహం పట్ల చైనా యువత ఆలోచనా ధోరణే మారిపోతోంది.చైనీస్ అకాడెమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ గణాంకాల ప్రకారం 2020 నాటికి దేశంలో 3 కోట్ల మంది పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు.అందుకే ఈ వినూత్న సంతను ఏర్పాటు చేసుకున్నారు.ఇలా చైనా అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.ప్రతివారం ఇక్కడ అమ్మాయిల సంత జరుగుతుంది.మరి ఈ సంత గురించి మీరేమంటారు.ఈ సంత గురించి అక్కడ అమ్మాయిల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.