150 మందిని ఒంటిచేత్తో మట్టికరిపించిన ఈ సైనికుడి గురించి వింటే మీరోమాలు నిక్కబొడుస్తాయి

323

కులం మతం ఆధారంగా ఎవరికీ దేశ భక్తి ఎంత ఉందొ చెప్పడం కష్టం. అయితే ఒక వ్యక్తిలో ఇలాంటి లక్షణాలు ఉంటె అతని వల్ల చాలా మంది స్ఫూర్తి పొందుతారు. అలంటి ఒక గొప్ప వ్యక్తి గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అతని పేరు మహ్మద్ ఉస్మాన్. అతను పుట్టినప్పుడు సగటు భారతీయుడే. కానీ మరణించే నాటికీ భారతీయులలో ఒకేఒక్కడు అనే స్థాయికి ఎదిగాడు.మహ్మద్ ఉస్మాన్ అప్పటి బ్రిటిష్ కాలంలో బీబీపూర్ లో 1912 లో జులైలో జన్మించాడు. ఈయన ఆ కాలంలోనే మంచి చదువు చదివాడు. ఇతను చాల దైర్యం కలవాడు.దేశం కోసం ఏదైనా చెయ్యాలనే తపన చిన్నప్పటినుంచి ఉండేది.అదే అతనిని మిలిటరీ వైపు నడిపించింది. ఆ కాలంలో ప్రతిష్టాత్మకమైన రాయల్ మిలిటరీ అకాడమీలో సీట్ సంపాదించాడు. అంచెలంచెలుగా బ్రిగేడియర్ స్థాయికి ఎదిగాడు. ఇంతలో భారత్ నుంచి పాకిస్థాన్ వేరే దేశంగా వేరుపడింది. నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు. హిందుస్తాన్ హిందువులది. నువ్వు పాకిస్తాన్ ఆర్మీలోకి వచ్చేయ్. నీకు ఆర్మీ చీఫ్ పదవిని ఇస్తాను.

Image result for pulwama

తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ గా చరిత్రలో నిలిచిపోతావు’ ఇదీ మహ్మదలీ జిన్నా నుంచి ఆ సైనికుడికి వచ్చిన ఆహ్వానం. అంతకు ముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతడిని కలిశారు. ఒక ముస్లింగా పాకిస్తాన్ తో చేతులు కలపమని అడిగారు. అది జరిగే పని కాదు అని అతని చిరునవ్వు వాళ్లకి చెప్పింది. బెలూచ్ రెజిమెంట్ లో బ్రిగేడియర్ గా ఉన్న మహ్మద్ ఉస్మాన్ భారత సైన్యంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుని, పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చేశాడు. ఆయనను డోగ్రా రెజిమెంట్ ఎటాచ్ చేశారు. బ్రిగేడియర్ అవివాహితుడు. ఆయన మద్యం ముట్టుకునేవాడు కూడా కాదు. నియమ నిష్టలతో జీవితాన్ని గడిపేవాడు. ఆయన జీతంలో ఎక్కువ భాగం పేద విద్యార్థులను చదివించేందుకే ఖర్చు చేసేవాడు. 1935లో సైన్యంలో చేరిన బ్రిగేడియర్ ఉస్మాన్ రెండో ప్రపంచ యుద్ధంలో బర్మా (మయన్మార్) లో పనిచేశారు. దేశ విభజన తరువాత ఆయనను ముందు డోగ్రా రెజిమెంట్లోని 77వ పారాచ్యూట్ బ్రిగేడ్ కి నాయకత్వం వహించమన్నారు.

Image result for pulwama

1948 లో జమ్మూ కశ్మీర్ పై పాక్ కన్ను పడి, కిరాయి మూకల ముసుగులో పాక్ సైన్యం జమ్మూకశ్మీర్ ను కబళించేందుకు వచ్చినప్పుడు ఆయనకు, ఆయన బ్రిగేడ్ కి జమ్మూ ప్రాంతంలోని నౌషెరా, రంగర్ ప్రాంతాలను కాపాడే బాధ్యతను అప్పగించారు. అప్పుడు నౌషెరా వద్ద జరిగిన పోరాటంలో దాదాపు వెయ్యిమంది పాకిస్తానీలను ఆయన సైన్యం మట్టుపెట్టింది. మరో వెయ్యి మందికి గాయాలయ్యాయి. పాకిస్తాన్ తోకముడిచింది. ఈ మొత్తం పోరాటంలో భారతీయ జవాన్లు కేవలం 30 మంది మాత్రమే చనిపోయారు. దీనితో పట్టరాని కోపంతో పాక్ ప్రభుత్వం నేరుగా సైన్యాన్నే పంపించింది. అది మే 1948. పాక్ సైన్యం అత్యంత కీలకమైన రంగర్, నౌషెరాలను చేజిక్కించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ బ్రిగేడియర్ ఉస్మాన్ నాయకత్వం, పోరాట పటిమల ముందు వారి పాచికలు పారలేదు. మే లో మొదలైన దాడి జూలై వరకూ కొనసాగింది.

ఈ క్రింది వీడియో చూడండి 

1948, జూలై మూడో తేదీన పాకిస్తానీలకు, మన సైన్యానికి నౌషెరాలో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో ఒక ఫిరంగి గుండు నేరుగా బ్రిగేడియర్ ఉస్మాన్ ను తాకింది. ఆ క్షణంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి.. నేను చనిపోతున్నాను, కాని ఒక్క అంగుళం నేల కూడా శత్రువుకి వదలకూడదు, ఆఖరి ఊపిరితో ఆయన అన్న ఈ మాటలు బ్రిగేడియర్ ఉస్మాన్ వ్యక్తిత్వానికి, ధీరోదాత్తతకు నిలువెత్తు నిదర్శనాలు. బ్రిగేడియర్ మాటలు ఆయన సైనికులకు మంత్రాలయ్యాయి. వారు ప్రాణాలొడ్డి పోరాడారు. శత్రువును తరిమికొట్టారు. త్రివర పతాకం రెపరెపలు మన విజయాన్ని సూచించాయి. బ్రిగేడియర్ ఉస్మాన్ కు మహా వీరచక్ర ప్రదానం చేశారు. ఆయన అంతిమ సంసారం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగింది. నేటికీ ఆయన సమాధి అక్కడ ఉంది.చూశారుగా ఈ అమరవీర సైనికుడి గురించి. మరి వీర జవాన్ మహ్మద్ ఉస్మాన్ గురించి ఆయన పోరాట ప్రతిమ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.