అల‌నాటి అందాల తార మీనా ఇప్పుడు ఏంచేస్తుందో తెలిస్తే షాక‌వుతారు

626

సీతారామయ్య గారి మనవరాలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా బాలనటిగా చాలా సినిమాలు చేసింది. 1975సెప్టెంబర్ 16న చెన్నైలో జన్మించిన మీనా దక్షిణాది భాషలన్నిటిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పాలి. సౌత్ ఇండ‌స్ట్రీలో మంచి పాత్ర‌లు చేసింది మీనా… ఆమె తండ్రి దురైరాజు టీచర్ గా పనిచేసారు. ఇక ఆమె తల్లి రాజమల్లిక ఒకనాటి తమిళ నాట హీరోయిన్. అలాగే మలయాళం లో కూడా నటిగా రాణించింది. సినీ అనుభవం గల రాజమల్లిక తనకూతురు మీనాను హీరోయిన్ గా చేయడానికి ఎంతో కష్టపడింది. జెమిని గణేష్ ఓ పార్టీలో మీనాను చూసి,బోలెడు భవిష్యత్తు ఉందని అఫర్ ఇచ్చారట. ఇక రాజమల్లిక మరో అడుగువేసి,నిర్మాత ఏ ఎం రత్నం దగ్గరకు తీసుకెళ్లగా ఆయన కూడా ఛాన్స్ ఇచ్చాడు.

Image result for meena

మొత్తం మీద మీనా బాలనటిగా సిరివెన్నెల,రెండు రెళ్ళు ఆరు మూవీలతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా అవతారం ఎత్తాక తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో హీరోయిన్ గా రాణించింది. తెలుగులో చంటి,సుందరకాండ,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం,అల్లరి మొగుడు చిత్రాలతో టాప్ హీరోయిన్ అయింది. సినిమా ఛాన్స్ ల కారణంగా 8వ తరగతి నుంచే స్కూల్ నుంచి దూరమైన మీనా ప్రేవైట్ గా ఎం ఏ పూర్తిచేసింది. మీనా అన్ని భాషా చిత్రాల్లో నటించడమే కాదు, ఆ భాషలను కూడా సులువుగా మాట్లాడ్డం విశేషం.

ఈ క్రింది వీడియో చూడండి 

1991నుంచి 2000సంవత్సరం వరకూ తెలుగు, తమిళ చిత్ర రంగాల్లో అగ్ర నాయికగా నిల్చింది. ఇక ఓసారి మీనా షూటింగ్ కోసం కాకినాడ సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి వచ్చింది. అది బాలయ్య నటించే బొబ్బిలి సింహం మూవీ. అందులో మీనా హీరోయిన్. అయితే మీనా మేకప్ మాన్ అక్కడికి రాలేకపోతే,మీనాకు ఆమె తల్లి రాజమల్లిక మేకప్ వేసింది. త‌ర్వాత కొద్ది రోజుల‌కు సినిమా ఛాన్స్ లు తగ్గాయని తెల్సి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో మీనా పెళ్లిచేసుకుంది.