గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఈమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని మీకు తెలుసా..ఎవ్వరో చూస్తే షాక్

494

ఈ ఫోటోను చూడండి..గుర్తు పట్టారా..బాగా చూడండి..ఇంకా గుర్తుకు రాలేదా..ఈమె రెండు తెలుగు సినిమాలు చేసింది.అందులో ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇంకా గుర్తుకు రాలేదా..అయితే నేనే చెబుతా వినండి.ఆమె లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ టాక్సీవాలలో నటించిన ప్రియాంక జవాల్కర్.అచ్చ తెలుగమ్మాయి.మరాఠీ ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ అనంతపూర్ లోనే పెరిగింది. ఎన్నో ఏళ్ల క్రితమే వీళ్ళు అనంతపూర్ లో సెటిల్ అయ్యి తెలుగువారిగా మారారు.దీంతో ఆమె తెలుగు చక్కగా మాట్లాడగలదు.

కలవరమాయే అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.. ఈ సినిమా సక్సెస్ కావడంతో ప్రియాంకకి మంచి గుర్తింపు లభించింది.టాక్సీవాలతో హిట్ అందుకుని ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది.ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో ఆమె కాలేజీ రోజుల్లో చదువుకుంటున్నప్పటిది.ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి ఫోటో అది.చాలా తక్కువ సమయంలో ఇంత పాపులర్ అవ్వడం నిజంగానే ఆశ్చర్యకరం.ఈ ఫోటో ఆన్ లైన్ లో దర్శనం ఇవ్వడంతో అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రియాంకను ఇప్పటి ఫొటోలతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.

వెయిట్ లాస్ క్లినిక్ కి ప్రియాంక చక్కటి ఉదాహరణ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం ఫోటోని మార్ఫ్ చేశారని అంటున్నారు. తన ఫోటో లీక్ అవ్వడం ట్రోల్ చెయ్యడం గురించి ఆమె ఈ విధంగా స్పందించింది.”అవును.. ఆ ఫోటోలో ఉన్నది నేనే.ఎవరో ఒక మహానుభావుడు నా కాలేజీ డేస్ ఫోటోను ఎక్కడ పట్టుకున్నాడో కానీ పట్టుకుని పోస్ట్ చేశాడు.. దొరకకూడదని అనుకున్నా.. దొరికిపోయా.నా టైం బాగాలేక దొరికిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా పేజెస్ లో నన్ను బాగా ట్రోల్ చేస్తున్నారు.అవును చబ్బీగా ఉన్నదాన్ని ఇప్పుడు ఫిట్ గా మారాను. అందులో తప్పేముంది. ప్రతి ఒక్కరూ ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటారు. దీనికోసం నన్ను ట్రోల్ చేయాలనుకుంటే చేయండి.. నటిగా ఇవన్నీ నేను భరించాలి” అంటూ చెప్పుకొచ్చింది.