300 ఎన్‌కౌంటర్లు చేసిన స్పెషలిస్ట్ పోలీసు ఇన్‌స్పెక్టరు ఉద్యోగానికి రాజీనామా అస‌లు ఏమి జ‌రిగింది

107

ఎన్ కౌంట‌ర్ ఈ పేరువింటే చాలా మంది పోలీసు ఆఫీస‌ర్ల పేర్లు వినిపిస్తాయి. దొంగ‌కి అక్ర‌మాలు చేసేవారికి మాట వింటే మాట చెబుతాం, లేదంటే తూటాకి ప‌ని చెబుతాం అంటారు పోలీసులు. దిల్లీ ముంబై బీహ‌ర్ ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు ఉండేవారు. ఈ పోలీస్ బాస్లు రౌడీల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఒక‌వేళ వీరి అరాచ‌కాలు పెరిగిపోతే వారికి అదే చివ‌రి రోజు అనేలా ప‌నిష్మెంట్ ఉండేది. అందుకే ఎన్ కౌంట‌ర్ అంటే రౌడీలు ఆమ‌డ దూరం పారిపోతారు. ఇటీవ‌ల మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు పాల్ప‌డే వారి విష‌యంలో ఎన్ కౌంట‌ర్లు చేస్తున్నారు పోలీసులు.. అలాగే స్మ‌గ్లింగ్ మ‌త్తుమందు విక్ర‌యం ఉమెన్ ట్రాఫికింగ్ ఎవ‌రు పాల్ప‌డినా వారిపై ఎన్ కౌంట‌ర్ అనే ఆయుధం వాడుతున్నారు.ఇక గ్యాంగ్ స్ట‌ర్ల‌ను కూడా ఇలాగే అంతం చేస్తున్నారు ఇక ముంబైలో అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ల‌కు కూడా ఇదే శిక్ష విధించేవారు. ఇక పోలీస్ ఆఫీస‌ర్లు కూడా వంద‌ల సంఖ్య‌లో ఎన్ కౌంట‌ర్లు చేసి రికార్డుల‌కి ఎక్కినవారు ఉంటారు అనేది తెలుసా, అవును ఇప్పుడు ఇలాంటి ఓ సూప‌ర్ పోలీస్ గురించి చెప్పుకోబోతున్నాం.

Image result for ప్రదీప్ శర్మ

వంద ఎన్‌కౌంటర్లు చేసిన స్పెషలిస్ట్, ముంబై సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టరు ప్రదీప్ శర్మ ఆయ‌న పేరు చెబితే రౌడీల‌కు అక్క‌డే చెమ‌ట ప‌డుతుంది ఆయ‌న సైర‌న్ వింటే కారుల్లో కాదు కాళ్ల‌తో ప‌రుగులు పెడ‌తారు. ఆయ‌న ఎంట‌ర్ అవుతున్నారు అంటే ఎంత పెద్ద రౌడీ అయినా సార్ కు స‌లాం చేస్తాడు లేక‌పోతే తాట‌తీస్తాడు అనే భ‌యం వారికి ఉంటుంది.అయితే ఇలాంటి గొప్ప కేడ‌ర్ ఉన్న ఆఫీస‌ర్ గురించి ఓ వార్త ముంబైలో పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయింది… ఆయ‌న తన ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. వంద ఎన్‌కౌంటర్లు చేసి మహారాష్ట్ర పోలీసుశాఖలో రికార్డు సృష్టించిన ప్రదీప్ శర్మ థానే క్రైంబ్రాంచ్ విభాగంలో సీనియర్ ఇన్‌స్పెక్టరుగా ఉన్నారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ప్రదీప్ శర్మ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. శివసేన పార్టీ టికెట్టుపై ఈయన పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా సమర్పించారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రింది వీడియో ని చూడండి

2008లో గ్యాంగస్టర్ లఖన్ భయ్యా నకిలీ ఎన్‌కౌంటర్ చేశారనే ఆరోపణలపై ప్రదీప్ శర్మతోపాటు 13మంది పోలీసులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. అనంతరం ఉద్యోగం నుంచి శర్మను సస్పెండ్ కూడా చేశారు. ఆ కేసును కోర్టు కొట్టివేయడంతో 2013లో ఈయన్ను మళ్లీ సర్వీసులోకి తీసుకున్నారు. 1983లో పోలీసుశాఖలో చేరిన ప్రదీప్ శర్మను ముంబై నగరంలోని అండర్ వరల్డ్ కార్యకలాపాలను అణచివేసేందుకు వీలుగా ముంబై క్రైంబ్రాంచ్ లో నియమించారు. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ అతని ముఠాను ఇతను అరెస్టు చేశారు. ముంబై నగరంలో వంద ఎన్‌కౌంటర్లలో 300 మంది గ్యాంగస్టర్లను శర్మ కాల్చి చంపారు. ఇతని జీవితం ఆధారంగా బాలీవుడ్ లో పలు సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఇటీవల నకిలీ ఎన్‌కౌంటర్ల వివాదాల్లోనూ చిక్కుకున్నారు. అయితే ఆయ‌న చాలా మంది ప్రాణాలు కాపాడారు అని అంటారు, కిడ్నాప్ ముఠాలను ప‌ట్టుకున్నారు అలాగే డ్ర‌గ్స్ ముఠాలు కూడా పారిపోయారు ఆయ‌న స‌ర్వీస్ లో చాలా మంచి లా అండ్ ఆర్డ‌ర్ ఉండేది అని అక్క‌డ ప్ర‌జ‌లు అంటారు మ‌రి ఇలాంటి పోలీస్ ఆఫీస‌ర్ ఈ ప్రాంతానికి కావాలి అని అక్క‌డ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తాము అంటే మేము స‌పోర్ట్ గా నిలుస్తాం అని ఇక్క‌డ ప్ర‌జ‌లు కూడా చెబుతున్నారు. సో నిజంగా ఈయ‌న ఇప్పుడు పోలీస్ నుంచి పోలిటిష‌న్ అవుతున్నార‌ని అర్ధం చేసుకోవాలి. మ‌రి ఆయన డెసిష‌న్ పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.