న్యూడ్ రెస్టారెంట్.. ఇందులో భోజనం చెయ్యాలంటే బట్టలు విప్పి తినాలి, లేకుంటే భోజనం లేదు..

370

పుర్రెకో బుద్ది, జిహ్వాకో రుచి అంటారు పెద్దలు. తినే తిండి విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. వారి అభిరుచికి తగినట్లు ఎన్నో రకాల రుచులను అందించడానికి పలు రకాల రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. కేవలం రుచిలోనే కాదు మిగతా విషయాల్లో కూడా కాస్త వెరైటీగా ఉండాలని అనుకుంటున్నారు.ఈ రోజుల్లోవ్యాపారం అనేది పోటీగా మారింది. నాణ్యతమైన ఆహారం,వినియోగదారుని యొక్క సంతృప్తిని కోరుకొంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాళ్ళ ఆలోచనా ధోరణితో వినియోగదారులని ఆశ్చర్యపరుస్తూ మార్కెట్లో టాప్ పొజిషన్కు లో ఉండాలనుకుంటారు.రెస్టారెంట్లు ఓనర్స్ ప్రజలని ఆకట్టుకోవాడినికి ఎప్పడికప్పుడు కొత్త కొత్త ప్రదర్శనలతో కస్టమర్స్ ని ఆహ్వానిస్తుంటారు. అలాంటి ఆలోచనలో పుట్టిందే న్యూడ్ రెస్టారెంట్. పేరు వింటేనే మీకు అర్థం అయ్యి ఉంటుంది. మరి ఆ రెస్టారెంట్ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for nude restaurant

ఫాషన్ ప్రపంచానికి పుట్టినిల్లు ఫ్రాన్స్. ఎన్నో రకాల ఫాషన్ అక్కడి నుంచి ప్రపంచానికి వచ్చింది. ఎఫ్ టీవీ పుట్టింది కూడా అక్కడే. ఇప్పటికి అక్కడ ఎన్నో ఫాషన్ షో లు జరుగుతుంటాయి. పారిస్ అంటేనే ఫాషన్ అని అర్ధం. ఫ్రాన్స్ లో బీచ్, రెస్టారెంట్ లకు కరువులేదు. పదుల సంఖ్యలో న్యూడ్ బీచ్ లు అక్కడ కనిపిస్తాయి, వందల సంఖ్యలో న్యూడ్ స్విమ్మింగ్ ఫూల్స్ దర్శనం ఇస్తాయి. నగ్నంగా మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం కోసం. శరీరాన్ని నిత్యం బట్టలతో కప్పేయడం వలన శరీరం రోగాల బారిన పడుతుంది. అందుకే కనీసం స్నానం చేసే సమయంలో అయినా దుస్తులు ఎందుకు అని అన్ని విప్పేసి స్నానం చేస్తుంటారు. చాలా మంది స్నానం చేసే సమయంలో ఒంటిమీద బట్టలు ఉంచుకోరు. దీనినే ఫ్రెంచ్ బాత్ అంటారు. ఇక ఇటీవలే ప్యారిస్ లో ఓ రెస్టారెంట్ ఓపెన్ అయింది. రెస్టారెంట్ కదా ఓపెన్ అయింది దీనికి ఇంత హడావుడి ఏమిటి అంటారా.. అక్కడికే వస్తున్నా. ఇది ఓ స్పెషల్ రెస్టారెంట్. ఇందులో విందు ఆరగించాలి అనుకునే వారు న్యూడ్ గా మారాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ రెస్టారెంట్ పేరు నేచురల్ రెస్టారెంట్. ప్రకృతి ప్రేమించేవారు, ఆరాదించేవారి కోసం ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ కు వచ్చే అతిదుల కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తారు. లోపలి ఎంటర్ కాగానే సిబ్బంది వారికి లాకర్లు చూపిస్తారట. అక్కడికి వెళ్లి తమ బట్టలను విప్పేసి నగ్నంగా మారిపోయి లోపలి వెళ్లి విందు తీసుకుంటారు.ఇక కొంతమందికి తమ ప్రైవేట్ భాగాలను చూపించేందుకు ఇష్టపడరు. వారికోసం చిన్న న్యాప్ కిన్స్ ఇస్తారు. దీనితో వాటిని కప్పుకోవచ్చు. ఇక్కడ 40 మంది అతిధులు కూర్చొని హ్యాపీగా తినవచ్చు.ఇక ఇక్కడ ధర 30 యురోల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రెస్టారెంట్ గురించి బయట తెలిసినా గట్టి బందోబస్తు ఉంటుంది కాబట్టి పెద్దగా గందరగోళం వంటివి జరగవట. వెరైటిగా ఉన్నది కదూ ఈ రెస్టారెంట్.మరి ఈ రెస్టారెంట్ గురించి అలాగే న్యూడ్ గా మారి భోజనము చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.