అక్కడ ఆడది చీరకడితే ఉరి శిక్షే..!

599

ఆడపిల్లకు చీర కట్టే అందం.ఎన్ని రకాల డ్రెస్ లు వేసుకున్నా కూడా చీర కట్టుకున్నప్పుడు ఉన్న అందం మిగతా వాటిలో ఉండదు.అందుకే చీర బెస్ట్ డ్రెస్ అని అనిపించుకుంది.అయితే రాను రాను ప్యాషన్ల మాయలో పడి సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరకట్టు మాయమైపోతోంది.ముఖ్యంగా మన దేశంలో చాలామంది ఈ చీర కట్టు సంప్రదాయం పోతుందని బాధపడుతూనే ఉన్నారు.కారణం చీర పుట్టింది మన దేశంలోనే కాబట్టి.అయితే ఎవరికీ ఇష్టం ఉన్న డ్రెస్ వాళ్ళు వేసుకోవడం అనేది అందరికి ఉన్న హక్కు.కానీ ఒక దేశంలో చీర కడితే ఉరి తీస్తారంటా.ఆశ్చర్యకరంగా ఉంది కదూ.కానీ ఇది నిజం.మరి ఆ దేశం ఏది ఎందుకలా చేస్తున్నారు.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నైజీరియా దేశం గురించి మనం ఇప్పటివరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.అక్కడ ఆడవాళ్ళను ఎంత ఘోరంగా హింసిస్తారో మనకు తెలుసు.ఇప్పుడు అదే దేశంలో ఆడవాళ్ళు చీరకడితే అది పెద్ద నేరం తెలుసా..చీరకడితే జైలుశిక్ష కూడా వేస్తారు.అయితే ఇప్పటివరకు అయితే ఈ చట్టం లేదు కానీ మరికొన్ని రోజుల్లో ఈ చట్టం రాబోతుంది.నైజీరియాలో కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ చట్టంలో నాభి, వీపు కనబడేలా ఉండే వస్త్ర ధారణను నిషేధించాలని పేర్కొంది. ఇది గనుక అమల్లోకి వస్తే నైజీరియాలో సాంప్రదాయిక దుస్తులు ధరించే మహిళలకు జైలు శిక్ష విధిస్తారు. నాభి, వీపు కనబడేలా దుస్తులు ధరించడాన్ని నేరంగా పరిగణించి, మూడు నెలలపాటు జైలు శిక్ష లేదా వంద డాలర్ల జరిమానా విధించాలని ఈ చట్టంలో ప్రతిపాదించారు.

అయితే ఈ చట్టాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.కొత్త చట్టంలో చేసిన ప్రతిపాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఆడవాళ్లను పొందటం కోసమే నాయకులు అవినీతికి పాల్పడుతున్నారనటం వారిలోని డొల్లతనానికి నిదర్శనమంటూ మహిళా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.ముస్లిం మత సంస్థలు కూడా ఈ చట్టంలోని ప్రతిపాదనలకు మద్దతు తెలుపడంతో మహిళా సంఘాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతేగాకుండా, మహిళల వస్త్రధారణపై ఇలాంటి చట్టం తీసుకురావడంతో అక్కడ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.

అవినీతిని అంతమొందించే చర్యల్లో భాగంగా ఇలాంటి ప్రతిపాదనలు చేశామని నైజీరియా సెనేటర్ ఎమీ యూఫోట్ ఎకాట్టీ చెబుతున్నారు. అందమైన మహిళల వ్యామోహంలో పడిన తమ దేశ రాజకీయ నాయకులు చాలామంది అవినీతికి పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు.విన్నారుగా నైజీరియాలో కొత్తగా రాబోతున్న ఈ చట్టం గురించి.ప్రపంచం మొత్తం చీర వైపు చూస్తుంటే వీళ్ళు చీరనే బహిష్కరించడం విడ్డూరంగా ఉంది కదూ.