కరుణానిధి గురించి ఎవరికీ తెలియని విషయమిది..తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

451

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు…తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి తనను తీవ్రంగా బాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని అత్యంత సీనియర్ నాయకుల్లో కరుణానిధి ఒకరని మోదీ కొనియాడారు.

నాటి మద్రాస్ స్టేట్‌లోని నాగపట్టణం జిల్లా తిరుక్కువలై అనే గ్రామంలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు ‘కళైంగర్’ కరుణానిధి. పుట్టింది ఒక సామాన్య కుటుంబంలో అయినా కరుణానిధి ఎదిగిన తీరు అద్భుతం, అపూర్వం. కరుణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘దక్షిణామూర్తి’. తన పద్నాలవయేటే దక్షిణామూర్తిలో విప్లవ భావాలు వెలుగు చూశాయి. ఆ భావాలే ఆయనను పేరును మార్చాయి. తల్లిదండ్రులు పెట్టిన పేరును సైతం మార్చేసుకుని ‘కరుణానిధి’ అయ్యారు.

అయితే కరుణానిధి గురించి ఎవరికీ తెలియని విషయమొకటి ఇక్కడ మేము మీకు అందిస్తున్నాం..అదేంటో తెలుసుకుందాం పదండి..ప్రముఖ రాజకీయ నేత, డీఏంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గొప్ప రాజకీయవేత్త, సాహిత్యవేత్తగానే అందరికి సుపరిచితులు. కానీ ఆయన గొప్ప క్రీడాభిమాని అనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే కరుణానిధికి క్రికెట్ అంటే ఎంతో అభిమానం. ఆయన అస్వస్థతకు గురి కావడానికి ముందు.. ముని మనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆయన స్వగృహంలో వీల్‌ ఛైర్‌లోనే కూర్చొని క్రికెట్ ఆడారు. వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ ఆయన అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ పిల్లాడిని తికమక పెట్టేందుకు ఆయన కొన్ని స్పిన్ బాల్స్‌ని సంధించారు. మనవడు కూడా తాతకి ధీటుగా బ్యాటింగ్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది.